మీనా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
{{Infobox actor
{{Infobox actor
| bgcolour =
| bgcolour =
| image = Meena 01.jpg
| size == 250px
| name = మీనా
| name = మీనా
| birthname = మీనా
| birthname = మీనా

16:11, 2 అక్టోబరు 2015 నాటి కూర్పు


మీనా

జన్మ నామంమీనా
జననం సెప్టెంబర్ 16, 1975
భార్య/భర్త విద్యాసాగర్

మీనా (సెప్టెంబర్ 16,1975), దక్షిణ భారత సినిమా నటి. జన్మతః మలయాళీ అయినా తెలుగు, తమిళ సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ కన్నూరు జిల్లా లోని తాలిపరంబకు చెందిన వాడు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.


మీనా తెలుగు మరియు తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. బాలనటిగా రజినీకాంత్ మరియు కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా మరియు అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్ లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉన్నది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియు మళయాల చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసినది. తెలుగులో వెంకటేష్ , మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచినది.

మీనా నటించిన తెలుగు సినిమాలు

మీనా నటించిన తమిళ సినిమాలు

మీనా నటించిన మళయాళ సినిమాలు

మీనా నటించిన కన్నడ సినిమాలు

మీనా నటించిన హిందీ చిత్రాలు

"https://te.wikipedia.org/w/index.php?title=మీనా&oldid=1732375" నుండి వెలికితీశారు