క్రియాశీల శక్తి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
200 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
రసాయనాలని కలిపినప్పుడు అవి ఎంత సమర్ధవంతంగా సంయోగం చెందుతాయో చెప్పడానికి '''క్రియాశీల శక్తి''' లేదా చర్యాశీల శక్తి లేదా "ఉత్తేజన శక్తి" (activation energy) అనే భావనను స్వీడన్‌ దేశపు శాస్త్రవేత్త [[సెవెంటే ఎర్రీనియస్]] 1889 లో ప్రవేశపెట్టడము జరిగింది. దీనిని ఒక రసాయన చర్య ప్రారంభించడానికి అవసరమైన కనీస శక్తి అని నిర్వచించవచ్చు. ఈ శక్తిని సాధారణంగా ''E<sub>a</sub>'' అని సూచిస్తారు. దీనిని ఒక [[మోలు]] ఒక్కంటికి ఇన్ని కిలోజూలులు kJ/mol అని కాని, మోలు ఒక్కంటికి ఇన్ని కిలోకేలరీలు kcal/mol అని కాని కొలుస్తారు.
 
ఈ ఊహనం (concept) ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం.పరిశీలించడానికి ఈ దిగువ చూపిన ఉత్క్రమణీయ (reversible) రసాయన ప్రక్రియని పరిశీలిద్దాం:
 
ClNO<sub>2</sub> + NO --> NO<sub>2</sub> + ClNO
 
ClNO<sub>2</sub> + NO <--> NO<sub>2</sub> + ClNO
ఇక్కడ ఎడమ పక్కన ఉన్న ClNO<sub>2</sub> మరియు NO రసాయన చర్యలో పాత్రధారులు. కుడి పక్క ఉన్న ClNO మరియు NO<sub>2</sub> చర్య జరిగిన తరువాత మిగిలిన ఉపలబ్దులు (products of reaction). ఈ రసాయన ప్రక్రియ జరుగుతూన్నప్పుడు ClNO<sub>2</sub> లో నత్రజని అణువుని (N) పట్టుకుని ఉన్న హరితం అణువు (Cl) తమ మధ్య ఉన్న పరస్పర బంధం తెంచుకుని NO లో ఉన్న నత్రజని అణువుని పట్టుకుంటుంది. ఈ పని జరగాలంటే NO లో ఉన్న నత్రజని అణువు వెళ్లి ClNO<sub>2</sub> లో ఉన్న హరితం అణువుని బలంగా గుద్దుకోవాలి. ఇక్కడ విషయం సమగ్రంగా అర్థం కావాలంటే బణువులు (molecules) లో అణువుల అమరిక ఎలా ఉంటుందో అర్థం కావాలి. ఉదాహరణకి, NO బణువుకి ఉల్టా-సీదాలు ఉంటాయి; అనగా, ఒక నత్రజని శీర్షం (Nitrogen end) ఒక ఆమ్లజని శీర్షం (Oxygen end) ఉంటాయి. అలాగే ClNO<sub>2</sub> బణువుకి ఒక హరితం శీర్షం, రెండు ఆమ్లజని శీర్షాలు ఉంటాయి. అనగా, ఒక బణువుకి మూడు శీర్షాలు, మరొక బణువుకి రెండు శీర్షాలు ఉంటాయి కదా. ఈ రెండు బణువులని దగ్గరకి తీసుకువచ్చినప్పుడు Cl కి O ఎదురుపడి గుద్దుకున్నా, O కి N ఎదురుపడి గుద్ధుకున్నా రసాయన ప్రక్రియ జరగదు; Cl కి N ఎదురుపడి గుద్దుకుంటేనే రసాయన ప్రక్రియ జరుగుతుంది.
 
ఈ క్రియాశీల శక్తిని ఊహించుకోడానికి పక్కన ఉన్న గ్రాఫు ఉపయోగపడుతుంది.
 
ఈ చిత్రములో ఎడమ నుండి కుడికి వెళుతూ ఉన్న నల్ల గీతపై దృష్టి సారిద్దాం. రసాయన చర్య మొదలయే ముందు చర్యలో పాల్గొంబోయే ఘటకద్రవ్యాల శక్తి X అని బొమ్మ చెబుతోంది. కాలగమనంతో పాటు కుడి పక్కకి జరుగుతున్నాం. రసాయన చర్య జరగాలంటే ఈ నల్ల గీత చూపించే "మూపురం" దాటగలగాలి. అంటే ఘటకద్రవ్యాల శక్తి పెరగాలి. ఎంత పెరగాలి? ఈ బొమ్మ ప్రకారం E<sub>a</sub> అంత పెరగాలి. అంటే ఒంటె మూపురంలా ఉన్న అవరోధాన్ని దాటగలగాలి. ఈ అవరోధాన్ని దాటితేకాని రసాయన చర్య కొనసాగదు. రసాయన చర్య సహేతుకమైన మార్పుదల (రేటు) తో కొనసాగాలంటే క్రియాశీల శక్తి E<sub>a</sub>, లేక అంత కన్నా ఎక్కువ శక్తి, వున్న అణువులు/బణువులు ఘటకద్రవ్యాలలో గణనీయమైన సంఖ్యలో వుండాలి.
 
== ఎరీనియెస్ సమీకరణము- ఉష్ణోగ్రత ==
8,003

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1733285" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ