ఏడిద నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 41: పంక్తి 41:


==మరణం==
==మరణం==
గత కొతంకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ [[హైదరాబాదు]]లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ [[అక్టోబరు 4]], [[2015]] ఆదివారం సాయంత్రం 5 గంటలకు కన్ను మూశారు.
గత కొతంకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ [[హైదరాబాదు]] లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ [[అక్టోబరు 4]], [[2015]] ఆదివారం సాయంత్రం 5 గంటలకు కన్ను మూశారు.


==విశేషాలు==
==విశేషాలు==

14:26, 5 అక్టోబరు 2015 నాటి కూర్పు

ఏడిద నాగేశ్వరరావు
జననంఏడిద నాగేశ్వరరావు
(1934-04-24)1934 ఏప్రిల్ 24
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట
మరణం2015 అక్టోబరు 4
హైదరాబాదు, తెలంగాణ
మరణ కారణంఅనారోగ్యం, వృద్ధాప్యం
వృత్తినిర్మాత
తండ్రిసత్తిరాజు నాయుడు
తల్లిపాపలక్ష్మి

ఏడిద నాగేశ్వరరావు (ఏప్రిల్ 24, 1934 - అక్టోబరు 4, 2015) ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ (Poornodaya Movie Creations) అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

బాల్యం

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934, ఏప్రిల్ 24 న జన్మించాడు.[1]

కుటుంబం

ఆయనకు భార్య జయలక్ష్మి, కూతురు ప్రమీల, కుమారులు విశ్వమోహన్, శ్రీరామ్, రాజా వున్నారు. ముగ్గురు కుమారుల్లో విశ్వమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడగా, చిన్న కుమారులు ఏడిద శ్రీరామ్ నిర్మాత, నటుడిగా, ఏడిద రాజా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు.

వృత్తి

నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.

మరణం

గత కొతంకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు 4, 2015 ఆదివారం సాయంత్రం 5 గంటలకు కన్ను మూశారు.

విశేషాలు

  • ఆయన నిర్మించిన చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి.
  • పలు చిత్రాలు రష్యన్ భాషలో విడుదలయ్యాయి.
  • ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన 9 సినిమాల్లో అత్యధిక చిత్రాలు విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం.

నిర్మించిన చిత్రాలు

బయటి లింకులు

ఐ.ఎమ్.బి.డి.లో ఏడిద నాగేశ్వరరావు పేజీ.

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక అక్టోబరు 5, 2015