Coordinates: 16°0′16″N 80°43′28″E / 16.00444°N 80.72444°E / 16.00444; 80.72444

నగరం (నగరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 169: పంక్తి 169:
* [[చినమట్లపూడి]]
* [[చినమట్లపూడి]]
* [[చిరకాలవారిపాలెం]]
* [[చిరకాలవారిపాలెం]]
* [[జిల్లేపల్లి]]
* [[తాడివాకవారిపాలెం]]
* [[తాడివాకవారిపాలెం]]
* [[తోటపల్లి (నగరం)|తోటపల్లి]]
* [[తోటపల్లి (నగరం)|తోటపల్లి]]

13:45, 14 అక్టోబరు 2015 నాటి కూర్పు

నగరం
—  మండల కేద్రం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అమర్తలూరి దీప కుమారి
జనాభా (2001)
 - మొత్తం 4,824
 - పురుషుల సంఖ్య 2,382
 - స్త్రీల సంఖ్య 2,155
 - గృహాల సంఖ్య 1,158
పిన్ కోడ్ 522 268
ఎస్.టి.డి కోడ్ 08648


నగరం
—  మండలం  —
గుంటూరు పటంలో నగరం మండలం స్థానం
గుంటూరు పటంలో నగరం మండలం స్థానం
గుంటూరు పటంలో నగరం మండలం స్థానం
నగరం is located in Andhra Pradesh
నగరం
నగరం
ఆంధ్రప్రదేశ్ పటంలో నగరం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°0′16″N 80°43′28″E / 16.00444°N 80.72444°E / 16.00444; 80.72444
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం నగరం
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 51,380
 - పురుషులు 25,860
 - స్త్రీలు 25,520
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.06%
 - పురుషులు 68.75%
 - స్త్రీలు 53.26%
పిన్‌కోడ్ 522268


నగరం, గుంటూరు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండలం. పిన్ కోడ్: 522 268., ఎస్.టి.డి.కోడ్ = 08648.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో బేతపూడి, చిరకాలవారిపాలెం, బెల్లంవారిపాలెం, ఏలేటిపాలెం, ఉప్పూడి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాల

  1. ఈ కళాశాల 45వ వార్షికోత్సవం, 2014,మార్చ్-4న జరుగనున్నది. గ్రామీణ వాతావరణం, క్రమశిక్షణకు మారుపేరుగా, తక్కువ ఖర్చుతో, గ్రామీణ విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించుచున్నారు. గత 2,3 సంవత్సరాలలో, రు. 3 కోట్లతో ఆడిటోరియం, బాలికల వసతిగృహ సముదాయం, అదనపు తరగతి గదులు, అధునాతతన వసతులతో నిర్మించారు. పూర్వ విద్యార్ధుల చేయూతతో ఒక కోటిరూపాయల వ్యయంతో మరియొక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. యాజమాన్యం వారు, కళాశాల పేద విద్యార్ధులకు, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకార వేతనలు అందించుచున్నారు. కళాశాలలో, పురావస్తు ప్రదర్శనశాల, గ్రంధాలయం గూడా ఏర్పాటు చేసినారు. [1]
  2. ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్" కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసినారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, గ్రీసుదేశంలోని ఏథెన్సు నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]

బి.సి.బాలుర వసతిగృహం

నగరం మండల కేంద్రంలోని ఈ వసతి గృహానికి కావలసిన భూమిని గ్రామస్థులు విరాళంగా అందించినారు. అక్టోబరు/2014లో, 80 లక్షల రూపాయల అంచనావ్యయంతో, ఈ స్థలంలో భవన నిర్మాణానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన నిర్వహించినారు. [12]

గ్రామలోని మౌలిక సౌకర్యాలు

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం

త్రాగునీటి పథకం

ప్రభుత్వ వైద్యశాల

బ్యాంకులు

ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం. 08648/256728.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామములో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి అమర్తలూరి దీపకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ పద్మావతీ సమేత శ్రీనివాసాలయం

ఈ ఆలయం స్థానికంగా గిరిపురంలో ఉన్నది.

శివాలయం

నేలపాటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015,మార్చి-15, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించినారు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి ప్రతిమను ట్రాక్టరుపై ఏర్పాటుచేసి, నగరం, బెల్లంవారిపాలెం, ఏలేటివారిపాలెం గ్రామాలలో ఊరేగించినారు. మేళతాళాలతో సాంప్రదాయపద్ధతులతో మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులనుండి హారతులు స్వీకరింఇనారు. [6]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

భద్రాచలం గ్రామానికి చెందిన శ్రీ ఎం.వి.ఆర్,శాస్త్రి, 2010 లో శ్రీరాముని పాదుకలతో, "జనచైతన్య యాత్ర" ను భద్రాచలంలో ప్రారంభించినారు. ఈ యాత్రలో భాగంగా ఆయన ఇటీవల, "నగరం" గ్రామానికి చేరుకొని, స్థానిక శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంలో శ్రీరాముని పాదుకలను ఉంచి, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో నగరం గ్రామానికి చెందిన భక్తులు పాల్గొన్నారు. [7]

శ్రీ పక్కలమ్మ అమ్మవారి ఆలయం

నగరం గ్రామస్థుల ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015,జూన్-7వవ తేదీనుండి ప్రారంభమైనవి. సాంప్రదాయ పద్ధతులలో అమ్మవారిని మేళతాళాలతో సాగనంపినారు. పుట్టింట్లో బాణాలుపోసుకొని తిరిగి, 11వ తేదీ గురువారంనాడు నగరం గ్రామానికి చేరుకున్నది. 12వ తేదీ శుక్రవారం అమ్మవారిని గ్రామంలో ఊరేగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారిని తిరిగి ఆలయంలో ప్రవేశపెట్టడంతో ఈ వార్షిక ఉత్సవాలు ముగిసినవి. [9]

శ్రీకృస్ణమందిరం

నగరం గ్రామములోని యాదవపాలెంలో, గ్రామస్థుల సహకారంతో, రు. 50 లక్ష్ల వ్యయంతో ఈ మందిరాన్నీ, చుట్టూ ప్రహరీ గోడనూ నిర్మించినారు. ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలను 2015,జూన్-14వ తేదీ ఆదివారం నిర్వహించినారు. ఈ ఉత్సవాలకై ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దినారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు, అన్నదానం మొదలగు కార్యక్రమాలు నిర్వహించినారు. [10]

గ్రామ దేవత శ్రీ పోతురాజుస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక ఉత్సవాలు, 2015,ఆగష్టు-30వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారు. [11]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4537.[1] ఇందులో పురుషుల సంఖ్య 2382, స్త్రీల సంఖ్య 2155,గ్రామంలో నివాస గృహాలు 1158 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 724 హెక్టారులు.

మండల గణాంకాలు

మండలంలోని గ్రామాలు

మూలాలు

బయటి లింకులు

[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,జనవరి-10; 3వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మార్చి-4; 1వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఆగష్టు-2; 1వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఫిబ్రవరి-11; 3వపేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మార్చి-16; 1వపేజీ. [7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మే-11వతేదీ; 1వపేజీ. [8] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మే-27వతేదీ; 2వపేజీ. [9] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,జూన్-9&13; 1వపేజీ. [10] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,జూన్-15; 1వపేజీ. [11] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,ఆగష్టు-31; 2వపేజీ. [12] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,సెప్టెంబరు-30; 2వపేజీ.