చిత్ర రచన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:చిత్రరచనలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5: పంక్తి 5:
==కాగితం ఆదా==
==కాగితం ఆదా==
చిత్ర రచన ద్వారా [[కాగితం|కాగితాన్ని]] [[పొదుపు]] చేయవచ్చు. బొమ్మలోనే చిత్రానికి సంబంధించిన చరిత్రను రాయడం వలన ఉదాహరణకు గాంధీజీ బొమ్మను ఆయన జీవితములోని ప్రధాన ఘట్టాలను ఆ బొమ్మలో రాయడం ద్వారా కాగితమును పొదుపు చేయవచ్చు. దీనితో గాంధీజీ బొమ్మ పిల్లల మనసులో ముద్ర పడటమే కాకుండా విజ్ఞానంతో పాటు కళాతృష్ణ పెరుగుతుంది.
చిత్ర రచన ద్వారా [[కాగితం|కాగితాన్ని]] [[పొదుపు]] చేయవచ్చు. బొమ్మలోనే చిత్రానికి సంబంధించిన చరిత్రను రాయడం వలన ఉదాహరణకు గాంధీజీ బొమ్మను ఆయన జీవితములోని ప్రధాన ఘట్టాలను ఆ బొమ్మలో రాయడం ద్వారా కాగితమును పొదుపు చేయవచ్చు. దీనితో గాంధీజీ బొమ్మ పిల్లల మనసులో ముద్ర పడటమే కాకుండా విజ్ఞానంతో పాటు కళాతృష్ణ పెరుగుతుంది.



==అరుంధతి సినిమా==
==అరుంధతి సినిమా==

11:33, 17 అక్టోబరు 2015 నాటి కూర్పు

శ్రీనివాసుని చిత్రాన్ని శ్రీ అక్షర రూపంలో అక్షర శైలిలో కొద్దిగా మార్పు చేస్తూ చిత్రించిన చిత్రం. ఒక్క అక్షరంతోనే కొంత సమాచారం ఇవ్వగల చిత్రం ఇది.
దస్త్రం:Httpwww.tagged.comwordsworkswonders (చిత్ర రచన).jpg
మహాత్మాగాంధీ చిత్రంలో చిత్ర చరిత్ర రచన

ఒక వస్తువు యొక్క చరిత్రను ఆ వస్తువు యొక్క రూపురేఖలు వచ్చేలా అక్షరాలను కూర్చుతూ వ్రాసే రచనను చిత్రరచన లేక చిత్ర చరిత్ర రచన అంటారు. చిత్రచరిత్రరచనను ఆంగ్లంలో ఐకోనో రైటింగ్ అంటారు. ఐకోనో అంటే చిత్రపట పరిశీలన శాస్త్రం, రైటింగ్ అంటే వ్రాయడం అని అర్థం. చదువుకునే పిల్లల్లో ఆసక్తిని కలిగించడానికి బొమ్మలోనే ఆ బొమ్మకు సంబంధించిన చరిత్రను లేదా విషయాన్ని అక్షర రూపంలో కూర్చుతున్నారు. ఈ విధమైన నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది. చిత్ర పటాల్లో చరిత్ర రాయడం ఒక అద్భుతమైన కళ. ఈ అద్భుతమైన చిత్ర రచన కళ ఇప్పుడు కొత్త తరహా విద్యా విధానానికి నాంది పలికింది. మలేషియా, థాయ్ లాండ్, జపాన్ లకు చెందిన విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఈ ప్రక్రియను అమలు చేయడంతోపాటు పరిశోధనలూ జరుపుతున్నాయి. చదువుతూ రాయడానికి బదులు రాస్తూ చదవడం ఈ చిత్ర రచన యొక్క ప్రత్యేకత. చిత్ర రచన ద్వారా చిత్రాన్ని చిత్రించేటప్పుడు మామూలు రచనలు వ్రాసేటప్పుడు వాడే బ్లూ కలర్ ఇంక్ నే కాకుండా వివిధ రంగుల పెన్నులను, పెన్సిలను కూడా ఉపయోగించడం జరుగుతుంది.

కాగితం ఆదా

చిత్ర రచన ద్వారా కాగితాన్ని పొదుపు చేయవచ్చు. బొమ్మలోనే చిత్రానికి సంబంధించిన చరిత్రను రాయడం వలన ఉదాహరణకు గాంధీజీ బొమ్మను ఆయన జీవితములోని ప్రధాన ఘట్టాలను ఆ బొమ్మలో రాయడం ద్వారా కాగితమును పొదుపు చేయవచ్చు. దీనితో గాంధీజీ బొమ్మ పిల్లల మనసులో ముద్ర పడటమే కాకుండా విజ్ఞానంతో పాటు కళాతృష్ణ పెరుగుతుంది.

అరుంధతి సినిమా

అరుంధతి సినిమాలో అరుంధతి చిత్ర రచన కళ ద్వారా చిత్రించిన తన జేజమ్మ చిత్ర పటాన్ని చూస్తూ ఆ పటంలో తన జేజమ్మకు సంబంధించిన చరిత్రను చదివి తన జేజమ్మ చరిత్రను తెలుసుకుంటుంది.

ఇవి కూడా చూడండి

చిత్ర లేఖనం

బయటి లింకులు

మూలాలు

ఆంధ్రజ్యోతి ఆదివారం - 7-10-2012

"https://te.wikipedia.org/w/index.php?title=చిత్ర_రచన&oldid=1755690" నుండి వెలికితీశారు