రాధా కల్యాణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
{{వేదిక|తెలుగు సినిమా}}
పంక్తి 1: పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా
{{సినిమా
| name = రాధా కళ్యాణం<br />Radha Kalyanam
| name = రాధా కళ్యాణం<br />Radha Kalyanam

14:47, 17 అక్టోబరు 2015 నాటి కూర్పు

రాధా కళ్యాణం
Radha Kalyanam

(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం జి.డి.ప్రసాదరావు, పి.శశిభూషణ్
రచన ముళ్లపూడి వెంకటరమణ
కథ కె. భాగ్యరాజా
చిత్రానువాదం ముళ్లపూడి వెంకటరమణ
తారాగణం చంద్రమోహన్
రాధిక
శరత్ బాబు
కాంతారావు
సంగీతం కె.వి.మహదేవన్, పుహళేంది
నేపథ్య గానం పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన సి.నారాయణ రెడ్డి, జ్యోతిర్మయి
సంభాషణలు ముళ్లపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం బాబా ఆజ్మీ
కళ కృష్ణమూర్తి
కూర్పు జి.ఆర్.అనిల్ దత్తాత్రేయ
విడుదల తేదీ నవంబర్ 7, 1981
దేశం ఇండియా
భాష తెలుగు

రాధా కల్యాణం (ఆంగ్లం: Radha Kalyanam) 1981 లో విడుదలైన కుటుంబ కథాచిత్రం. దీనిని ముళ్లపూడి వెంకటరమణ రచించగా బాపు దర్శకత్వం వహించారు. ఇది ఒక మంచి తెలుగు సినిమాగా విమర్శకుల మన్ననలు పొందించి.[1] ఈ సినిమాకు కె. భాగ్యరాజా దర్శకత్వం వహించిన తమిళ సినిమా అంత ఎఝు నాట్కల్ (Those 7 Days) ఆధారం.[2]

కథా సంగ్రహం

రాధ (రాధిక) ఒక మధ్య-తరగతికి చెందిన అమ్మాయి. ఆమె వాళ్లింట్లో అద్దెకుంటున్న పాలఘాట్ మాధవన్ (చంద్రమోహన్) తో ప్రేమలో పడుతుంది. మాధవన్ గొప్ప సంగీత విద్వాంసులు కావాలని కోరుకొంటున్నా కూడా జీవనోపాధి కోసం కష్టపడుతుంటాడు. అతడు రాధ పట్ల ఆకర్షితుడౌతాడు.

భార్య మరణించిన తర్వాత, డా. ఆనంద్ (శరత్ బాబు), చావుకు సమీపంలోనున్న తల్లి కోరికమేరకు రాధను పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రాధ కథను విన్న ఆనంద్ రాధను తిరిగి మాధవన్ కు అప్పగించడానికి మనసారా అంగీకరిస్తాడు. కానీ చివరికి రాధ ఎవరకు చెందుతుంది, భర్తకా లేదా ప్రియుడికా, అనేది ప్రధానంగా అత్యంత క్లిష్టమైన సమస్యను దర్శకుని ప్రతిభతో ఎలా పరిష్కరిస్తాడు అనేది చిత్రకథ.

పాత్రలు - పాత్రధారులు

పాటలు

పాట రచయిత గాయనీ గాయకులు సంగీత దర్శకత్వం నటీనటులు
"ఏమ్మొగుడో... వద్దంటే వినడేమి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె.వి. మహదేవన్ రాళ్ళపల్లి
"కలనైనా క్షణమైనా మాయనిదీ మన ప్రేమ" సి.నారాయణ రెడ్డి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె.వి. మహదేవన్ చంద్రమోహన్, రాధిక, శరత్ బాబు
"చేతికి గాజుల్లా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కె.వి. మహదేవన్ చంద్రమోహన్, రాధిక
"పాలఘాట్ మాధవన్ పాటంటే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కె.వి. మహదేవన్ చంద్రమోహన్
"బంగారు బాల పిచ్చుక" కె.వి. మహదేవన్

హిందీ సినిమా

1983 సంవత్సరంలో ఈ సినిమాను హిందీ భాషలో "వో సాత్ దిన్" (Woh Saat Din) గా నిర్మించారు. ఇందులో అనిల్ కపూర్, పద్మినీ కొల్హాపురీ మరియు నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలు పోషించారు.

మూలాలు

బయటి లింకులు