అల్యూమినియం నైట్రైడ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 13: పంక్తి 13:
*మొబైల్ పోన్‌లలో వాడు ఆరేఫ్ ఫిల్టరు(RF filter)లలో అల్యూమినియం ఆక్సైడ్‌ను ఉపయోగిస్తారు. అలాగే సర్ఫేస్ అకౌస్టిక్ వేవ్(surface acoustic wave )సెన్సరుల తయారీలో ఉపయోగిస్తారు.
*మొబైల్ పోన్‌లలో వాడు ఆరేఫ్ ఫిల్టరు(RF filter)లలో అల్యూమినియం ఆక్సైడ్‌ను ఉపయోగిస్తారు. అలాగే సర్ఫేస్ అకౌస్టిక్ వేవ్(surface acoustic wave )సెన్సరుల తయారీలో ఉపయోగిస్తారు.
*ఫైజోఎలక్ట్రిక్ మైక్రోమేచిండ్ అల్ట్రాసౌండ్ ట్రాన్స్‌డ్యుసర్స్ తయారీలో ఉపయోగిస్తారు.
*ఫైజోఎలక్ట్రిక్ మైక్రోమేచిండ్ అల్ట్రాసౌండ్ ట్రాన్స్‌డ్యుసర్స్ తయారీలో ఉపయోగిస్తారు.
*ఆప్టోఎలాక్త్రానిక్స్ లోఉపయోగిస్తారు.

04:20, 28 అక్టోబరు 2015 నాటి కూర్పు

అల్యూమినియం నైట్రైడ్ ఒకరసాయన సమ్మేళనపదార్ధం.ఇది ఒక అకర్బన సంయోగపదార్ధం.ఈ సంయోగ పదార్ధం రసాయన సంకేతపదం AlN.అల్యూమినియం మరియు నైట్రోజన్ మూలక పరమాణు సంయోగం వలన అల్యూమినియం నైట్రైడ్ ఏర్పడినది.

భౌతిక లక్షణాలు

అల్యూమినియం నైట్రైడ్ తెల్లగా లేదా పాలిపోయిన పసుపు రంగు కల్గిన ఘనపదార్ధం.అల్యూమినియం నైట్రైడ్ అణుభారం 40.9882 గ్రాములు /మోల్. 25°C వద్ద అల్యూమినియం నైట్రైడ్ సాంద్రత 3.260 గ్రాములు /సెం.మీ3. అల్యూమినియం నైట్రైడ్ సంయోగ పదార్ధం ద్రవీభవన స్థానం 2,200°C (3,990°F;2,470 K). అలాగే అల్యూమినియం నైట్రైడ్ బాష్పీభవన స్థానం 2,517°C (4,563°F;2,790K),ఈ ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం నైట్రైడ్ వియోగం చెందును. అల్యూమినియం నైట్రైడ్ మొనోక్రిస్టల్ రూపంలో నీటిలో కరుగదు.పౌడరు/పొడి రూపంలో రియాక్ట్ అగును.ఇధనాల్ లో కరుగును.అల్యూమినియం నైట్రైడ్ ఉష్ణవాహక విలువ 285 W/(m•K).అల్యూమినియం నైట్రైడ్ వక్రీభవన సూచిక 1.9–2.2.

స్థిరత్వం-రసాయన ధర్మాలు

అల్యూమినియం నైట్రైడ్ జడమైన వాతావరణంలో, అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరత్వం కల్గిఉండును.పీడన రహితస్థితి(vacuum)లో 1800 °C వద్ద అల్యూమినియం నైట్రైడ్ వియోగం చెందును.గాలిలో 700 °C ఉష్ణోగ్రత కు పైగా వేడిచేసిన ఉపరితల ఆక్సిడేసన్ జరుగును.సాధారణ గదిఉష్ణోగ్రత వద్ద కూడా 5-10 nm మందమున్న ఉపరితల ఆక్సైడ్ పొరలు ఏర్పడుట గమనించవచ్చును.ఈ విధంగా ఏర్పడిన ఆక్సైడ్ పొర1370 °C ఉష్ణోగ్రత వరకు సంయోగపదార్ధం ఆక్సీకరణ చెందకుండా నిలువరించును. 1370°C ఉష్ణోగ్రత దాటిన బల్క్ ఆక్సిడేసన్ సంభవించును. హైడ్రోజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ వాయుయుతపరిసరాలలో/వాతావరణంలో 980 °C వరకు అల్యూమినియం నైట్రైడ్ స్థిరంగా ఉండును. ఖనిజ ఆమ్లాలలో అల్యూమినియం నైట్రైడ్ గ్రైన్‌బౌండరి దాడివలన నెమ్మదిగా కరుగును.బలమైన క్షారాలు అల్యూమినియం నైట్రైడ్ గ్రైన్స్ మీదదాడి చెయ్యడం వలన కరుగును.అల్యూమినియం నైట్రైడ్ నెమ్మదిగా జలవిశ్లేషణ చెందును. క్లోరైడ్ మరియు క్రయోలైట్ లతో సహ పలు కరిగిన లవణాలక్షయికరణ దాడిని నిలువరించు స్థిరత్వం అల్యూమినియం నైట్రైడ్ కల్గిఉన్నది.

చరిత్ర

అల్యూమినియం నైట్రైడ్ ను 1877 ను మొదటిసారి ఉత్పత్తి చేసారు. అల్యూమినియం నైట్రైడ్ యొక్క అత్యధిక ఉష్ణవాహకత్వాన్ని(thermal conductivity)గుర్తించిన 1980 నుండి మాత్రమే ఎలక్ట్రికల్ ఇన్సులేటింగ్ సెరామిక్‌లో ఉపయోగించడం మొదలైనది.

ఉత్పత్తి

అల్యూమినియం ఆక్సైడ్ ను కార్బోథెర్మల్ క్షయికరణ కావించడం వలన అల్యూమినియం నైట్రైడ్ ఉత్పత్తి చెయ్యబడును.లేదా నేరుగా అల్యుమినియంను నైట్రిడెసన్ చెయ్యడం వలన కూడా అల్యూమినియం ఆక్సైడ్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును.

ఉపయోగాలు

  • మొబైల్ పోన్‌లలో వాడు ఆరేఫ్ ఫిల్టరు(RF filter)లలో అల్యూమినియం ఆక్సైడ్‌ను ఉపయోగిస్తారు. అలాగే సర్ఫేస్ అకౌస్టిక్ వేవ్(surface acoustic wave )సెన్సరుల తయారీలో ఉపయోగిస్తారు.
  • ఫైజోఎలక్ట్రిక్ మైక్రోమేచిండ్ అల్ట్రాసౌండ్ ట్రాన్స్‌డ్యుసర్స్ తయారీలో ఉపయోగిస్తారు.
  • ఆప్టోఎలాక్త్రానిక్స్ లోఉపయోగిస్తారు.