త్రిపురనేని గోపీచంద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40: పంక్తి 40:


== జననం ==
== జననం ==
గోపీచంద్ [[1910]], [[సెప్టెంబర్ 8]] న [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామములో జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ [[సంఘ సంస్కర్త ]] [[త్రిపురనేని రామస్వామి]]. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించారు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించారు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి '''ఎందుకు?''' అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. '''ఎందుకు?''' అన్న ప్రశ్నే అతన్ని ఒక [[జిజ్ఞాసువు]] గా,[[తత్వవేత్త]] గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
గోపీచంద్ [[1910]], [[సెప్టెంబర్ 8]] న [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ [[సంఘ సంస్కర్త ]] [[త్రిపురనేని రామస్వామి]]. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి '''ఎందుకు?''' అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. '''ఎందుకు?''' అన్న ప్రశ్నే అతన్ని ఒక [[జిజ్ఞాసువు]] గా,[[తత్వవేత్త]] గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.


గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన రాసిన ''అసమర్థుని జీవయాత్ర'' తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. [[1963]]లో ''పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా'' కు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] వచ్చింది. <ref>[http://www.sahitya-akademi.org/sahitya-akademi/awa10321.htm#telugu కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు]</ref>
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన ''అసమర్థుని జీవయాత్ర'' తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. [[1963]] లో ''పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా'' కు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] వచ్చింది. <ref>[http://www.sahitya-akademi.org/sahitya-akademi/awa10321.htm#telugu కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు]</ref>


==జీవిత క్రమం==
==జీవిత క్రమం==

00:12, 3 నవంబరు 2015 నాటి కూర్పు

త్రిపురనేని గోపీచంద్
దస్త్రం:Tripuraneni Gopichand.jpg
త్రిపురనేని గోపీచంద్
జననంత్రిపురనేని గోపీచంద్
సెప్టెంబర్ 8, 1910
కృష్ణా జిల్లా అంగలూరు
మరణంనవంబర్ 2, 1962
ఇతర పేర్లుత్రిపురనేని గోపీచంద్
ప్రసిద్ధితెలుగు రచయిత,
హేతువాది
సంపూర్ణ మానవతావాది,
సాహితీవేత్త
తెలుగు సినిమా దర్శకుడు
సంతకం

త్రిపురనేని గోపీచంద్ (సెప్టెంబర్ 8, 1910 - నవంబర్ 2, 1962) సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు.

జననం

గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్నే అతన్ని ఒక జిజ్ఞాసువు గా,తత్వవేత్త గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.

గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963 లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. [1]

జీవిత క్రమం

  • 8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించారు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ.
  • హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. అయితే తరువాతి కాలంలో ఆయన ఆస్తికుడిగా మారారు.
  • 1932 లో వివాహం;1933లో బి,ఏ పట్టా ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో యిమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం(మార్క్సిజం)పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు.
  • ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.
  • 1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు.
  • తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల పరివర్తనం(1943).
  • 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు.
  • 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.
  • 1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు. ఈ దశలో అరవిందు ని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు.
  • 1962 నవంబర్ 2 నాడు గోపీచంద్ మరణించాడు.
  • భారత ప్రభుత్వము సెప్టెంబరు 8, 2011న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది.


గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నారు. ఇంటి పనులతోపాటు, తండ్రి గారి నాస్తికోద్యమమునకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాల గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నారు. అతని మీద చాలా కాలము వారి నాన్న గారి ప్రభావం ఉండేది. వారు మొదట వ్రాసిన చాలా నవలలో Marxist భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి.

వారు వ్రాసిన "మెరుపుల మరకలు" అనే గ్రంధంలో గాంధీరామయ్య అనే ఒక పాత్ర ఉంది. . ఆ పాత్ర శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారిని పోలి ఉంటుందన్నది కొందరి భావన. రామస్వామి, పంతులు మంచి స్నేహితులు. రెండు భిన్న ధ్రువాలు. ఒకరు కరుడుగట్టిన నాస్తిక వాది, మరి ఒకరు పూర్తి ఆస్తికులు. ఇద్దరూ గాంధేయవాదులు. రామస్వామికి యవ్వనంలోనే భార్య గతించింది. పునర్వివాహం చేసుకోలేదు. ఒక రోజు పంతులు రామస్వామిని కలవటానికి తెనాలి వెళ్ళారు. స్నేహితులిద్దరికి గోపీచంద్ భోజనం వడ్డిస్తున్నారు. ఆ సందర్భములో, పంతులు "ఏమయ్యా! రామస్వామి నీవు ఉద్యమాలలో పూర్తిగా మునిగి, కుమారుడి వివాహము సంగతే మర్చిపోయావు" అని అన్నారు. అప్పుడు, రామస్వామి, నిజమే పంతులు గారు, ఆ విషయము పూర్తిగా మరచిపోయాను. మీరే ఏదైనా మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చెయ్యండి అని అన్నారట. అప్పుడు. పంతులు, గోపీచంద్ తో, "నీవు మద్రాస్ వెళ్ళే లోపు ఒక పది రోజుల ముందు, గుంటూరు రా.." అని అన్నారు. గోపీచంద్, సరే అంటం... అలాగే గుంటూరికి వెళ్ళటం జరిగింది.

ఆ రోజుల్లో గుంటూరులో "శారదా నికేతన్" అనే వితంతు శరణాలయం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. దాని నిర్వహణ బాధ్యత అంతా ఆ రోజుల్లో పంతులు గారే చూసుకునే వారు. ఆ రోజుల్లో అన్నీ బాల్యవివాహాలు కావటం చేత, వధూవరులకు వయోభేదం ఉండటం చేత అక్కడ ఉన్నవారిలో కూడా చాలామంది బాలవితంతువులే! గోపీచంద్ వచ్చి పంతులుని కలసి, ఎందుకు రమ్మన్నారో చెప్పమని అడిగారు. పంతులు ఏ విషయము చెప్పకుండా, నీకు నచ్చిన ఒక క్లాసుకు వెళ్లి ఒక పది రోజులు పాఠాలు చెప్పమన్నారు. ఆ వితంతు శరణాలయాన్ని పంతులు నడుపుతున్న తీరు, బాలవితంతుల దీన పరిస్థితి గోపీచంద్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆయన రచనలలో కొన్నింటిలో వాటి ప్రభావం కనపడుతుంది. కాలక్రమంలో గోపీచంద్ మీద వారి నాన్న ప్రభావం తగ్గ నారంభించింది. స్వతంత్ర భావాలను పెంచుకున్నారు. జీవితములో పెంచి పెద్ద చేసిన నాన్న కంటే పంతులు ప్రభావం అతని మీద చాలావరకు ఉంది. అందుకే, గాంధీరామయ్య పాత్ర సజీవంగా నిలిచిపోయింది.

గోపీచంద్ నెమ్మదిగా మార్క్సిస్టు సిద్ధాంతం నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంధాన్ని వ్రాయటం జరిగింది. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు - ఈ గ్రంధాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది. ఆయనే, ఒక చోట ఇలా అంటారు, "మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు". మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్నివదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి, చలం కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ. ఒక పుస్తకాన్ని వారి తండ్రిగారికి అంకితం ఇస్తూ- 'ఎందుకు' అని అడగటం నేర్పిన నాన్నకి అని వ్రాసారు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికెదిగారు.

రచనలు

నవలలు

వాస్తవిక రచనలు

తెలుగు సినిమాలు

బయటి లింకులు

మూలములు