తూర్పు గాంగులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:
|region = కళింగ
|region = కళింగ
|country =
|country =
|era = [[ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - పూర్వమధ్య యుగము|పూర్వమధ్య యుగము]]
|era = [[మధ్య యుగం]]
|status =
|status =
|event_start =
|event_start =
పంక్తి 28: పంక్తి 28:
|image_map_caption =
|image_map_caption =
|capital = [[ముఖలింగం]]/ కళింగ నగరం
|capital = [[ముఖలింగం]]/ కళింగ నగరం
|common_languages =
|common_languages = [[సంస్కృతం]],[[తెలుగు]],[[ఒరియా]]
|religion = [[హిందూ మతం]]
|religion = [[హిందూ మతం]]
|government_type = Monarchy
|government_type = రాజరికం
|leader1 = [[అనంత వర్మన్ చోడగంగదేవ]]
|leader1 = [[అనంత వర్మన్ చోడగంగదేవ]]
|year_leader1 = 1078–1147
|year_leader1 = 1078–1147
పంక్తి 57: పంక్తి 57:




తూర్పు గాంగులు, తొట్టతొలి పాలకుల అనంతర రాజులు [[వేంగి చాళుక్యులు|వేంగి చాళుక్యులు]] ఆధిపత్యాన్ని అంగీకరించారు. అయితే వేంగి చాళుక్యుల అంతర్గత తగాదాలను అదునుగా తీసుకుని వజ్రహస్త - 1, స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. ఈ కాలంలో బౌద్ధ, జైన మతాల స్థానాన్ని శైవ మతం ఆక్రమించింది. 8వ శతాబ్దానికి చెందిన తూర్పు గంగరాజు కామార్ణవుని కాలంలో [[శ్రీముఖలింగం]]లోని మధుకేశ్వరాయం లేదా ముఖలింగేశ్వరాయం నిర్మించబడింది.
తూర్పు గాంగులు, తొట్టతొలి పాలకుల అనంతర రాజులు [[వేంగి చాళుక్యులు|వేంగి చాళుక్యుల]] ఆధిపత్యాన్ని అంగీకరించారు. అయితే వేంగి చాళుక్యుల అంతర్గత తగాదాలను అదునుగా తీసుకుని వజ్రహస్త - 1, స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. ఈ కాలంలో బౌద్ధ, జైన మతాల స్థానాన్ని శైవ మతం ఆక్రమించింది. 8వ శతాబ్దానికి చెందిన తూర్పు గంగరాజు కామార్ణవుని కాలంలో [[శ్రీముఖలింగం]]లోని మధుకేశ్వరాయం లేదా ముఖలింగేశ్వరాయం నిర్మించబడింది.
[[File:Mukhalingeshwara temple , srimukhalingam srikakulam.jpg|thumb| కామార్ణవునిచేత నిర్మించబడిన ముఖలింగేశ్వర ఆలయం, [[శ్రీముఖలింగం]], [[శ్రీకాకుళం]],[[ఆంధ్ర ప్రదేశ్]]]]
[[File:Mukhalingeshwara temple , srimukhalingam srikakulam.jpg|thumb| కామార్ణవునిచేత నిర్మించబడిన ముఖలింగేశ్వర ఆలయం, [[శ్రీముఖలింగం]], [[శ్రీకాకుళం]],[[ఆంధ్ర ప్రదేశ్]]]]



10:39, 12 నవంబరు 2015 నాటి కూర్పు

తూర్పు గంగ సామ్రాజ్యం

1078–1434
రాజధానిముఖలింగం/ కళింగ నగరం
సామాన్య భాషలుసంస్కృతం,తెలుగు,ఒరియా
మతం
హిందూ మతం
ప్రభుత్వంరాజరికం
త్రికళింగాధిపతి 
• 1078–1147
అనంత వర్మన్ చోడగంగదేవ
• 1178–1198
అనంగ భీమ దేవుడు- 2
• 1238–1264
నరసింహదేవ - 2
• 1414–1434
భాను దేవ - 2
చారిత్రిక కాలంపూర్వమధ్య యుగము
• స్థాపన
1078
• పతనం
1434
Preceded by
Succeeded by
మహామేఘవాహన సామ్రాజ్యం
గజపతులు

తూర్పు గాంగులు మధ్యయుగ భారతదేశానికి చెందిన సామ్రాజ్య పాలకులు. వీరి స్వతంత్ర పాలన 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్ద ప్రారంభం వరకూ, ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రముతో పాటు, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బంగ లోని అనేక ప్రాంతాలలోకి విస్తరించి, సాగినది.[1] వారి రాజధాని కళింగ నగరం లేదా ముఖలింగం(శ్రీకాకుళం జిల్లా). కోణార్క సూర్య దేవాలయం (ప్రపంచ వారసత్వ ప్రదేశం) నిర్మాతలుగా ప్రపంచ ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటారు.

పశ్చిమ గాంగుల సంతతి వాడైన, అనంత వర్మన్ చోడగాంగునిచే ఈ రాజ్యం స్థాపించబడింది. [2] తూర్పు చాళుక్యులు, చోళులతో సంబంధ బాంధవ్యాలు కలిగిన తూర్పు గాంగులు, తమ దక్షిణ దేశ సంస్కృతిని ఒరిస్సా ప్రాంతానికి వ్యాపింపజేశారు. [3] వీరి కాలంలో 'ఫణం' అని పిలువబడిన నాణేలు, చెలామణీలో ఉండేవి. [3] రాజ్యస్థాపికుడైన అనంతవర్మ చోళగాంగుడు, హైందవ మతాభిమాని మరియు లలిత కళల పట్ల ఆసక్తిని కలిగి ఉండేవాడు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాధ ఆలయాన్ని నిర్మించాడు. [4][5] అనంత వర్మ అనంతరం అనేకమంది గాంగ రాజులు కళింగని పరిపాలించారు. వారిలో చెప్పుకోదగినవారిలో నరసింహదేవ వర్మ - 2 (1238–1264), ముఖ్యుడు. నరసింహదేవ వర్మ - 2 నిర్మింపజేసిన ఆలయాల్లో కోణార్క సూర్య దేవాలయం, శ్రీ కూర్మనాధుని దేవాలయం (శ్రీకూర్మం), వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, సింహాచలం ముఖ్యమైనవి.

బెంగాల్ ప్రాంతంనుండి, ఉత్తరాది నుండి నిరంతరం సాగిన ముస్లిం దండయాత్రల నుండి తూర్పు గాంగులు తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. సామ్రాజ్యం వర్తకవాణిజ్యాలలో పురోగమించింది. సామ్రాజ్యాధినేతలు, తమ ధనాన్ని ఆలయనిర్మాణంలో వెచ్చించారు. చివరి రాజు భానుదేవ-4 (1414-34) కాలంలో ఈ సామ్రాజ్యం అంతమైంది. [6]

అనంతవర్మన్ చోళగాంగుని చే నిర్మించబడిన పూరీ జగన్నాధ ఆలయం

ఉన్నతి మరియు పతనం

మహామేఘవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత, కళింగ ప్రాంతం అనేక స్థానిక నాయకుల పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ స్థానిక నాయకులంతా కళింగాధిపతి బిరుదుని ధరించినవారే. తూర్పు గాంగుల మొదటగా గురించి తెలిసినది, ఇంద్రవర్మ - 1 నుండి మాత్రమే. ఇంద్ర వర్మ - 1 విష్ణుకుండిన రాజైన ఇంద్రభట్టారకుని ఓడించి శ్రీముఖలింగం రాజధానిగా తన స్వతంత్ర పాలన ని ప్రారంభించాడు. తూర్పు గాంగులు 'త్రికళింగాధిపతి', 'సకల కళింగాధిపతి' బిరుదుని ధరించారు.

[7]


తూర్పు గాంగులు, తొట్టతొలి పాలకుల అనంతర రాజులు వేంగి చాళుక్యుల ఆధిపత్యాన్ని అంగీకరించారు. అయితే వేంగి చాళుక్యుల అంతర్గత తగాదాలను అదునుగా తీసుకుని వజ్రహస్త - 1, స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. ఈ కాలంలో బౌద్ధ, జైన మతాల స్థానాన్ని శైవ మతం ఆక్రమించింది. 8వ శతాబ్దానికి చెందిన తూర్పు గంగరాజు కామార్ణవుని కాలంలో శ్రీముఖలింగంలోని మధుకేశ్వరాయం లేదా ముఖలింగేశ్వరాయం నిర్మించబడింది.

కామార్ణవునిచేత నిర్మించబడిన ముఖలింగేశ్వర ఆలయం, శ్రీముఖలింగం, శ్రీకాకుళం,ఆంధ్ర ప్రదేశ్

11వ శతాబ్దంలో, తూర్పు గంగ రాజ్యం, చోళసామ్రాజ్య నియంత్రణలో సామంత రాజ్యంగా ఉండింది. [7]

నరసింహదేవ - 1 నిర్మింపజేసిన కోణార్క సూర్య దేవాలయం, కోణార్క్, ఒరిస్సా[7] ప్రస్తుతం, ప్రపంచ వారసత్వ ప్రదేశం.
సింహాచలం, గుడి వద్దననున్న రాతి సింహాసనం
దేవంద్రవర్మ - 1 నిర్మింపజేసిన శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి, ఆంధ్ర ప్రదేశ్

వజ్రహస్త-3 కుమారుడైన దేవేంద్ర వర్మ రాజరాజ దేవుడు - 1, చోళులతోను, తూర్పు చాళుక్యులతోనూ యుద్ధాలు చేస్తూ, రాజ్యానికి పటిష్టపరుచుకునేందుకు, చోళ రాజకుమారి, రాజసుందరి ని వివాహం చేసికున్నాడు. ఈమె చోళ చక్రవర్తి అయిన వీరరాజేంద్ర చోళుని కుమార్తె, మరియు మొదటి కులోత్తుగ చోళుని సోదరి.

వీరి కుమారుడైన అనంతవర్మన్ చోడగాంగ, గంగా - గోదావరి నదీముఖద్వారాల మధ్యనున్న ప్రదేశాన్నంతటినీ పరిపాలించి 11వ శతాబ్దంలో తూర్పు గాంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శైవునిగా పుట్టిన అనంతవర్మ, రామానుజాచార్యుని ప్రభావంతో వైష్ణవునిగా మారి పూరి వద్దనున్న జగన్నాధ ఆలయం నిర్మింపజేశాడు. చోళుల, గాంగుల వంశాన్ని సూచింపజేస్తూ చోడగాంగ అనే పేరుని ధరించినాడు. త్రికళింగాధిపతి బిరుదును మొదటిగా ధరించినది, అనంతవర్మే.


క్రీ.శ 1264 నరసింహదేవుని మరణం తర్వాత, తూర్పు గాంగుల శక్తి క్షీణించడం ఆరంభమైంది. క్రీ.శ 1324లో ఢిల్లీ సుల్తానులు, క్రీ.శ 1356లో విజయనగర ప్రభువులు కళింగ, ఓఢ్ర దేశాలపై దండెత్తి ఓడించారు. అయితే, చివరిపాలకుడైన నరసింహదేవ - 4 క్రీ.శ 1425లో మరణించేవరకు కళింగ-ఓఢ్ర ప్రాంతంపైన తూర్పు గాంగుల ఆధిపత్యం కొనసాగింది. క్రీ.శ 1434-35లో పిచ్చి రాజైన భానుదేవ-4 ని గద్దె దించి, మంత్రి అయిన ఓఢ్ర కపిలేంద్ర సింహాసనాన్ని అధిష్టించి, సూర్యవంశ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు గాంగులు మతానికి, కళలకి ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కాలంనాటి ఆలయాలు భారతీయ శిల్పకళ యొక్క గొప్పదనాన్ని చాటుతూ ఉన్నాయి. [8]

పరిపాలకులు

తూర్పు గాంగుల సామ్రాజ్యకాలంనాటి ఫణం[9]
  1. ఇంద్ర వర్మ (496-535)[7]
  2. దేవేంద్ర వర్మ - 4 (893-?)
  3. వజ్రహస్త అనంతవర్మన్ (1038-?)
  4. రాజరాజ - 1 (గంగరాజు)(?-1078)
  5. అనంతవర్మన్ చోడగాంగ (1078–1150)[7]
  6. అనంగ భీమదేవ - 2 (1178–1198)
  7. రాజరాజు - 2 (1198 - 1211)
  8. అనంగ భీమదేవ - 3 (1211–1238)
  9. నరసింహ దేవ - 1 (1238–1264)[7]
  10. భాను దేవ - 1 (1264–1279)
  11. నరసింహ దేవ - 2 (1279–1306)[7]
  12. భాను దేవ - 2 (1306–1328)
  13. నరసింహ దేవ - 3(1328–1352)
  14. భాను దేవ - 3 (1352–1378)
  15. నరసింహ దేవ - 4 (1379–1424)[7]
  16. భాను దేవ - 4 (1424–1434)

ఇవి కూడా చూడండి

రిఫరెన్సులు

  1. Ganga Dynasty[dead link] www.britannica.com.
  2. Satya Prakash; Rajendra Singh (1986). Coinage in Ancient India: a numismatic, archaeochemical and metallurgical study of ancient Indian coins. Govindram Hasanand. p. 348. ISBN 978-81-7077-010-7.
  3. 3.0 3.1 Patnaik, Nihar Ranjan (1 January 1997). Economic History of Orissa. Indus Publishing. p. 93. ISBN 978-81-7387-075-0. Retrieved 16 February 2015.
  4. Eastern Ganga Dynasty in India. India9.com (2005-06-07). Retrieved on 2013-07-12.
  5. Controversies in History: Origin of Gangas. Controversialhistory.blogspot.com (2007-10-09). Retrieved on 2013-07-12.
  6. [1][dead link]
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 7.7 Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 36–37. ISBN 978-9-38060-734-4.
  8. Ganga dynasty (Indian dynasties) - Encyclopedia Britannica. Britannica.com. Retrieved on 2013-07-12.
  9. Michael Mitchiner (1979). Oriental Coins & Their Values : Non-Islamic States and Western Colonies A.D. 600-1979. Hawkins Publications. ISBN 978-0-9041731-8-5.

బయటి లింకులు