"తూర్పు గాంగులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
|image_map =
|image_map_caption =
|capital = [[ముఖలింగం]]/ కళింగ నగరం <br> [[కటక్]]
|common_languages = [[సంస్కృతం]],[[తెలుగు]],[[ఒరియా]]
|religion = [[హిందూ మతం]]
వజ్రహస్త-3 కుమారుడైన దేవేంద్ర వర్మ రాజరాజ దేవుడు - 1, చోళులతోను, తూర్పు చాళుక్యులతోనూ యుద్ధాలు చేస్తూ, రాజ్యానికి పటిష్టపరుచుకునేందుకు, చోళ రాజకుమారి, రాజసుందరి ని వివాహం చేసికున్నాడు. ఈమె చోళ చక్రవర్తి అయిన వీరరాజేంద్ర చోళుని కుమార్తె, మరియు మొదటి [[కులోత్తుంగ చోళ|కులోత్తుగ చోళుని]] సోదరి.
 
వీరి కుమారుడైన [[అనంతవర్మన్ చోడగాంగ]], గంగా - గోదావరి నదీముఖద్వారాల మధ్యనున్న ప్రదేశాన్నంతటినీ పరిపాలించి 11వ శతాబ్దంలో తూర్పు గాంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శైవునిగా పుట్టిన అనంతవర్మ, రామానుజాచార్యుని ప్రభావంతో వైష్ణవునిగా మారి పూరి వద్దనున్న జగన్నాధ ఆలయం నిర్మింపజేశాడు. చోళుల, గాంగుల వంశాన్ని సూచింపజేస్తూ చోడగాంగ అనే పేరుని ధరించినాడు. త్రికళింగాధిపతి బిరుదును మొదటిగా ధరించినది, అనంతవర్మే. తన రాజధానిని [[శ్రీముఖలింగం]]నుండి సామ్రాజ్య మధ్యంలో ఉన్న [[కటక్ |కటకానికి]] మార్చాడు
 
క్రీ.శ 1198లో రాజ్యానికి వచ్చిన రాజరాజు-3, క్రీ.శ 1206లో కళింగ పై సాగిన బెంగాల్ ముస్లింల దండయాత్ర నియంత్రించలేకపోయాడు. వీరి దండయాత్రని ని నిరోధించిన, అతని కుమారుడు అనంగభీమ -3, తన విజయానికి సంకేతంగా భవనేశ్వరం వద్ద మేఘేశ్వరాలయాన్ని నిర్మించాడు. అతని కుమారుడు నరసింహదేవ వర్మ-1, దక్షిణ బెంగాలుపై దండెత్తి వారి రాజధాని [[గౌర్]]ని ఆక్రమించాడు. ఆ విజయానికి గుర్తుగా కోణార్క్ వద్ద [[కోణార్క సూర్య దేవాలయం| సూర్యదేవాలయాన్ని]] నిర్మించాడు.
# భాను దేవ - 4 (1424–1434)
 
==భాష మరియు సాహిత్యం==
తెలుగువారైన తూర్పు గాంగులు, తమ రాజ్యంలోని అన్ని మతాలనీ, భాషలని సమానంగా చూసారు. వీరి రాజ్యంలో [[తెలుగు]], [[ఒరియా]], [[సంస్కృతం]], అపభ్రంశ భాషలను మాట్లాడే ప్రజలున్నారు. సంస్కృత భాష రాజభాషగా ఉండినది. అన్ని ప్రాంతాలలోనూ తెలుగు, సంస్కృత, ఒరియా శాసనాలు వేయించినారు. పరిపాలనాభాషగా ఒరియా భాషకి స్థానం కల్పించినది, తూర్పు గాంగులే. అయితే, తమ ఆస్థానాలలో తెలుగు, ఒరియా కవులను పోషించిన దాఖలాలు లేవు. <ref name ='EGanga1'>[http://odisha.gov.in/e-magazine/Orissareview/2012/April/engpdf/33-39.pdf]. odisha.gov.in. Retrieved on 2015-11-12.</ref>
 
రాజ్యవిస్తరణ అనంతరం కటకానికి రాజధాని మార్చినప్పటికీ స్థానికేతరులైన కారణంచేత, స్థానిక నాయకులకి అసంతృప్తి ఉండినట్టు పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగువారైనప్పటికి తూర్పు గాంగులు తమ రాజ్యాన్ని జాతులకి, భాషలకి అతీతంగా తమ రాజ్యాన్ని “పురుషోత్తమ సామ్రాజ్యం”గా పేర్కొన్నారు. కళింగ రాజ్యం లేదా ఓఢ్రరాజ్యం అని ఏ శాసనాలలోనూ పేర్కొనలేదు.<ref name ='EGanga1'/>
 
వీరి అనంతరం వచ్చిన సూర్యవంశ గజపతులు, భువనేశ్వర్-కటక్ లలో వేయించిన శాసనాలలో రాజధాని ప్రాంతాన్ని'స్వతంత్ర ఓఢ్ర దేశం'గా ప్రకటించుకున్నారు. అది స్థానిక అసంతృప్తి కారణంగానే అని పరిశోధకుల అభిప్రాయం.
 
శ్రీకాకుళం, టెక్కలి, సంతబొమ్మాళి, వంటి ప్రాంతాలలో లభించిన వీరి దానశాసనాలలో ‘కోల’, ‘మూర’, ‘మాడ’, ‘పుట్టి’, ‘తూము’, ‘కుంట’ వంటి వంటి తెలుగు కొలమానాలు కనిపిస్తాయి. <ref>[http://odisha.gov.in/e-magazine/Journal/jounalvol1/pdf/orhj-12.pdf]. odisha.gov.in. Retrieved on 2015-11-12.</ref>
 
వీరి కాలానికి చెందిన కొందరు ప్రముఖులు
*[[శ్రీకాంత కృష్ణమాచారి | శ్రీకాంతకృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య]]. 13వ శతాబ్దానికి చెందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు. సింహాచలం నరసింహస్వామిని స్తుతిస్తూ కీర్తనలు రచించాడు.
*[[జయదేవ]] 13వ శతాబ్దానికి చెందిన సంస్కృత పండితుడు. ‘గీత గోవిందం’అనే సుప్రసిద్ధ గ్రంధాన్ని రచించాడు.
==ఇవి కూడా చూడండి==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1772467" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ