హైదరాబాద్ రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
17 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి (→‎మూలాలు: clean up using AWB)
== బ్రిటీష్ పాలనలో ==
[[File:Hyderabad street with Charminar India 1890.jpg|thumb|హైదరాబాద్‌లో చార్మినార్ వీధి, 1890]]
1801 నాటికి నైజాం ప్రాంతం మధ్య దక్కన్ కలిగి చుట్టూ బ్రిటీష్ ఇండియాతో భూభాగంతో బంధింపబడి, బ్రిటీష్ అధికారం క్రింద ఉండే ప్రిన్స్‌లీ స్టేట్‌ స్థితిలో ఉండేది. ఐతే అంతకు 150 ఏళ్ళనాడు విస్తారమైన బంగాళాఖాతపు కోస్తాతీరాన్ని కలిగివుండేది. రాజ్యాంతర్భాగాల్లో కొంత ప్రాంతం నేరుగా నిజాం అధికారంలో ఉండగా, కొంత ప్రాంతాన్ని నిజాం సామంతులైన సంస్థానాధీశులు పరిపాలించేవారు, కొద్ది భూభాగాన్ని రాజు తన వ్యక్తిగత అవసరాల కోసం స్వంత ఆస్తిగా ఉంచుకున్నారు. జమీందారులు కట్టవలసిన కొద్ది ధనం నిజాం రాజుకు కట్టి పరిపాలనలో బాగా స్వాతంత్రం తీసుకునేవారు. ఒకవిధంగా సంస్థానాధీశుల పాలనలో ఉన్న భూభాగంపై నిజాం పాలన కన్నా వారి పాలనే ఎక్కువగా సాగేది. కొద్ది డబ్బును కూడా ఈయకుండా పరిపాలన చేసే సంస్థానాదీశులపై నిజాం ససైన్యంగా వచ్చి కొట్టి సాధించి రూకలు తీసుకునేవారు. ఆ జమీందార్లలో ఒకరిలో ఒకరికి సరపడకపోతే వారిలో వారు సైన్యసహితంగా పోరుసల్పడమే కాక ఒకరి గ్రామాలను ఒకరు కొల్లగొట్టి, గ్రామస్తులను హింసించి, గ్రామాలను పాడుచేసేవారని 1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాసుకున్నారు. ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించేనాటికి కొల్లాపూర్ సంస్థానం, వనపర్తి సంస్థానాలకు నడుమ అటువంటి వివాదం <ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>. 1857లో ప్రధానంగా సైన్యంతో పాటు సంస్థానాధీశులు, స్థానిక రాజులు అసంతృప్తితో కంపెనీ పరిపాలనపై తిరుగుబాటు చేసిన సమయంలో మధ్య దక్కన్లో అతిఎక్కువ భూభాగాన్ని పరిపాలిస్తున్న హైదరాబాద్ నవాబు దివాన్ సాలార్ జంగ్ మాత్రం బ్రిటీష్ పక్షాన్ని వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా బ్రిటీషర్ల వద్ద '''నమ్మదగ్గ మిత్రుడు''' అన్న బిరుదును సంపాదించుకున్నారు. ఈ నిర్ణయం ఆధునిక దేశభక్తులు చాలా అసంతృప్తితో గమనిస్తూంటారు. [[బ్రిటీష్ ఇండియాలోఇండియా]]లో అతి ఎక్కువ భూభాగాన్ని కలిగివుండి, కొంతవరకూ బలమైన సైన్యశక్తిని కూడా కలిగున్న నిజాం తిరుగుబాటుదారుల వైపు ఉండివుంటే బ్రిటీషర్లు అనూహ్యంగా బలహీనమైపోయి ఉండేవారేనని పేర్కొంటూంటారు. ఉత్తరభారతదేశానికి ఢిల్లీ ఎటువంటిదో దక్షిణభారతానికి [[హైదరాబాద్]] అటువంటిది. ఐతే చారిత్రికంగా ఈ పరిణామం జరగలేదు, పైగా దేశంలోని అనేకమైన రాజ్యాలతోపాటే హైదరాబాద్ బ్రిటీష్ వైపు నిలిచాయి. 1857తో [[ఈస్టిండియా కంపెనీ]] పరిపాలన అంతమై బ్రిటీష్ కిరీటపు పాలన కిందకు నేరుగా వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ అత్యంత ప్రధానమైన [[ప్రిన్స్‌లీ స్టేట్‌గాస్టేట్‌]]గా నిలిచింది. ఆపైన 20 ఏళ్ళకు [[విక్టోరియా మహారాణి]] భారత సామ్రాజ్ఞిగా ప్రకటించుకున్నారు.
 
== సామాజిక స్థితిగతులు ==
హైదరాబాద్ రాజ్యాన్ని, హైదరాబాద్ నగరాన్ని 1830ల్లో తన కాశీయాత్రలో భాగంగా సందర్శించిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని గురించి తెలుగులో తొలియాత్రాచరిత్రయైన [[కాశీయాత్ర చరిత్ర]]లో వ్రాశారు.
5,722

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1787797" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ