Coordinates: 16°07′01″N 80°40′31″E / 16.117069°N 80.675297°E / 16.117069; 80.675297

అమృతలూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 142: పంక్తి 142:
#గ్రామ దేవత శ్రీ పుట్లమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో గ్రామస్తులు, 2014, ఆగష్టు-3, శ్రావణమాసం, ఆదివారం నాడు, రజకసంఘం ఆధ్వర్యంలో, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. మహిళలు బిందెలతో నీటిని తెచ్చి, అమ్మవారికి జలాభిషేకం నిర్వహించినారు. అనంతరం అంకమ్మ దేవరకు ప్రత్యేకపూజలు, జలాభిషేకం నిర్వహించినారు. గ్రామంలోని ప్రధాన వీధులలో తప్పెట్ల విన్యాసాలతో, నీటి బిందెలతో మహిళలు గ్రామోత్సవం జరిపినారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. [5]
#గ్రామ దేవత శ్రీ పుట్లమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో గ్రామస్తులు, 2014, ఆగష్టు-3, శ్రావణమాసం, ఆదివారం నాడు, రజకసంఘం ఆధ్వర్యంలో, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. మహిళలు బిందెలతో నీటిని తెచ్చి, అమ్మవారికి జలాభిషేకం నిర్వహించినారు. అనంతరం అంకమ్మ దేవరకు ప్రత్యేకపూజలు, జలాభిషేకం నిర్వహించినారు. గ్రామంలోని ప్రధాన వీధులలో తప్పెట్ల విన్యాసాలతో, నీటి బిందెలతో మహిళలు గ్రామోత్సవం జరిపినారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. [5]
#శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి, మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [1]
#శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి, మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [1]
#శ్రీ మహా విష్ణు ఆలయం,
#శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయం:-
#శ్రీ రామాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. మసటిరోజున గ్రామములో అన్నదానం నిర్వహించెదరు. [6]
#శ్రీ రామాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. మసటిరోజున గ్రామములో అన్నదానం నిర్వహించెదరు. [6]
#శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం.

14:00, 21 డిసెంబరు 2015 నాటి కూర్పు

అమృతలూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం అమృతలూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ కూచిపూడి సతీష్ కుమార్
జనాభా (2001)
 - మొత్తం 6,524
 - పురుషుల సంఖ్య 3,458
 - స్త్రీల సంఖ్య 3,410
 - గృహాల సంఖ్య 1,833
పిన్ కోడ్ 522 325
ఎస్.టి.డి కోడ్ 08644
  ?అమృతలూరు మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటంలో అమృతలూరు మండల స్థానం
గుంటూరు జిల్లా పటంలో అమృతలూరు మండల స్థానం
గుంటూరు జిల్లా పటంలో అమృతలూరు మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°07′01″N 80°40′31″E / 16.117069°N 80.675297°E / 16.117069; 80.675297
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం అమృతలూరు
జిల్లా (లు) గుంటూరు
గ్రామాలు 13
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
46,960 (2001 నాటికి)
• 23540
• 23420
• 72.03
• 77.57
• 66.48


అమృతలూరు (Amruthaluru) ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లాలోని ఒక మండలము. పిన్ కోడ్ నం. 522 325., ఎస్.టి.డి కోడ్ = 08644.

గ్రామ చరిత్ర

గ్రామం పేరువెనుక చరిత్ర

అమృతలూరులో అమృతలింగేశ్వర స్వామి కొలువైనందున ఈ పేరు వచ్చింది. అమృతలూరు గ్రామాన్ని వాడుకలో "అమర్తలూరు" అని కూడా అంటారు.

గ్రామ భౌగోళికం

ఈ గ్రామం, తెనాలి పట్టణం నుండి 17కి.మీ.ల దూరంలో ఉంది.

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో యలవర్రు, గోవాడ, తురుమెళ్ళ, మోపర్రు, పెదపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

  1. అమృతలూరు గ్రామం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రహదార్లతో విస్తృతంగా కలపబడి ఉంది.
  2. దగ్గరలోని రైలు స్టేషన్లు: తెనాలి, పొన్నూరు, రేపల్లె.

గ్రామములోని విద్యాసౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

బ్యాంకులు

  1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రారంభం=27, అక్టోబరు-2010.)
  2. ఆంధ్రా బ్యాంక్. ఫోన్ నం. 08644/255229.

కొన్ని విషయాలు

  • లోక్‌సభ నియోజకవర్గం: తెనాలి
  • శాసనసభ నియోజకవర్గం: వేమూరు
  • రెవెన్యూ డివిజను: తెనాలి.
  • దగ్గరలోని సముద్రతీరం: నిజాంపట్నం.

విద్యా సౌకర్యాలు

  1. తురుమెళ్ళ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల.
  2. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  3. ఒకప్పటి సంస్కృత పాఠశాల.

గ్రామ పంచాయతీ

అమృతలూరు గ్రామ పంచాయతీ ఏర్పడి (8-2-2014 నాటికి ) 86 వసంతాలు పూర్తి చేసుకుని 87వ వసంతం లోనికి ప్రవేశించినది. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కూచిపూడి సతీష్ కుమార్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీమతి సోంపల్లి మంగమ్మ ఎన్నికైనారు. [3]

మండల గణాంకాలు

అక్షాంశరేఖాంశాలు: 16.117069°N 80.675297°E కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)

ముఖ్య పట్టణము అమృతలూరు

జిల్లా(లు) గుంటూరు

గ్రామాలు 13
జనాభా• మగ• ఆడ• అక్షరాస్యత శాతం• మగ• ఆడ 46,960 (2001)• 23540• 23420• 72.03• 77.57• 66.48

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శ్రీ అమృతలింగేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకోవడంతో, సి.జి.ఎస్.గ్రాంటు ద్వారా రు.కోటి రూపాయల అంచనాతో, ఆలయ పునర్నిర్మాణ పనులు సన్నద్ధం చేయుచున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రవాసులు శ్రీ సీతారామాంజనేయులు, మీనాక్షి దంపతులు రూ. 15 లక్షల విరాళం అందజేసి, జన్మభూమిపై తమకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. [2]
  2. గ్రామ దేవత శ్రీ పుట్లమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో గ్రామస్తులు, 2014, ఆగష్టు-3, శ్రావణమాసం, ఆదివారం నాడు, రజకసంఘం ఆధ్వర్యంలో, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. మహిళలు బిందెలతో నీటిని తెచ్చి, అమ్మవారికి జలాభిషేకం నిర్వహించినారు. అనంతరం అంకమ్మ దేవరకు ప్రత్యేకపూజలు, జలాభిషేకం నిర్వహించినారు. గ్రామంలోని ప్రధాన వీధులలో తప్పెట్ల విన్యాసాలతో, నీటి బిందెలతో మహిళలు గ్రామోత్సవం జరిపినారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. [5]
  3. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి, మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [1]
  4. శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయం:-
  5. శ్రీ రామాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. మసటిరోజున గ్రామములో అన్నదానం నిర్వహించెదరు. [6]
  6. శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం.
  7. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం.
  8. శ్రీ బండ్లమ్మ తల్లి ఆలయం:- దాతల సహకారంతో గ్రామమంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,జూన్-5వ తేదీ శుక్రవారంనుండి ప్రారంభమగును. 5వ తేదీ శుక్రవారంనాడు అఖండ స్థాపన, పుణ్యాహవచనం, 6వ తేదీ శనివారంనాడు, నిత్యనిధి, వాస్తుపూజ, మంటపారధన కార్యక్రమలు నిర్వహించెదరు. 7వ తేదీ ఆదివారంనాడు, ఉదయం విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. [7]

గ్రామంలోని ప్రధాన పంటలు

ఈ గ్రామములో పండే ప్రధాన పంటలు వరి మరియు మినుములు

గ్రామ ప్రముఖులు

  1. శరణు రామస్వామి చౌదరి (స్వాతంత్ర్య సమరయోధులు).
  2. కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి - ప్రముఖ తెలుగు పండితుడు,కవి,రచయిత,విమర్శకుడు.
  3. అమృతలూరు గ్రామంలో ఒక స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నారు. ఆయన పేరు శ్రీ మల్లెపద్ది కృష్ణమూర్తి. ఆయన తన 85వ ఏట, 2014,జూన్-10న, కాలధర్మం చెందినారు. [4]

గ్రామ విశేషాలు

  1. ఈ గ్రామములో శ్రీ మైనేని రత్నప్రసాద్, గొట్టిపాటి గంగాధర్, 5 సంవత్సరాలనుండి, ప్రతి సంవత్సరం పేదవృద్ధులను,విద్యార్ధులను అక్కున చేర్చుకొని చేయొతనిచ్చుచున్నారు. [8]
  2. ఈ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు శ్రీ పరుచూరి సీతారామాంజనేయులు, మీనాక్షి దంపతులు, మాచెర్లలోని మీనాక్షి, ఆంజనేయులు నేత్రాలయం నిర్మాణ సమయంలో రు. 50 లక్షలు, ఈ సంవత్సరం అదనపు భవన సదుపాయం కోసం, రు. 10 లక్షలు అందజేసి, కంటిచూపు లేని 8 వేలమందికి పైగా రోగులకు ఉచిత వైద్యసేవలందించి, వారి జీవితాలలో వెలుగులు నింపినారు. ఇంకనూ వీరు గ్రామంలో పంచాయతీకి, పాఠశాలకు, ఆలయాల అభివృద్ధికీ తనవంతు సాయం అందించుచున్నారు. [8]
  3. ఈ గ్రామానికి చెందిన శ్రీ వెలివోలు పేర్నీడు, తన భార్య కీ.శే.నాగేంద్రమ్మ ఙాపకార్ధం, 2011లో, వెలివోలు నాగేంద్రమ్మ ట్రస్ట్ స్థాపించి, తెనాలి వాణిజ్య బ్యాంకులో రు. 11 లక్షలు డిపాజిట్ చేసి, దానిమీద వచ్చే వడ్డీతో సేవలందించుచున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీలో 10% మూలధనానికి జమచేసి, మిగిలిన ధనంతో పేదవృద్ధులకు పింఛను, పేద విద్యార్ధులకు ప్రోత్సహకాల రూపంలో, ప్రతి ఒక్కరికీ రు. 2,500-00 అందించుచున్నారు. ఈ రకంగా అమృతలూరు, తురిమెళ్ళకు చెందిన 24 మంది పేదవృద్ధులూ, 24 మంది పేద విద్యార్ధులు, చేయూతనందుకొనుచున్నారు. [8]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6868.[1] ఇందులో పురుషుల సంఖ్య 3458, స్త్రీల సంఖ్య 3410,గ్రామంలో నివాసగృహాలు1833 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1499 హెక్టారులు.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[2] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2013,అక్టోబరు-27; 1వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014,ఫిబ్రవరి-8; 2వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014,జూన్-11; 1వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014, ఆగష్టు-4; 2వపేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2015,మార్చ్-30; 1వపేజీ. [7] ఈనాడు గుంటూరు సిటీ; 2015,జూన్-5; 33వపేజీ. [8] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-28; 35వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=అమృతలూరు&oldid=1795000" నుండి వెలికితీశారు