స్వెత్లానా అలెక్సీవిచ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38: పంక్తి 38:
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==
* [http://vasantam.net/?p=13387 కాల్పనికేతర కథనానికి తొలిసారి నోబెల్‌ – రచయిత్రి స్వెత్లానా అలెక్సేవిచ్‌]
{{నోబెల్ బహుమతి అందుకున్న మహిళలు}}
{{నోబెల్ బహుమతి అందుకున్న మహిళలు}}



13:50, 14 మార్చి 2016 నాటి కూర్పు

స్వెత్లానా అలెక్సీవిచ్‌
2013 లో స్వెత్లానా అలెక్సీవిచ్‌
రచయిత మాతృభాషలో అతని పేరుСвятлана Аляксандраўна Алексіевіч
పుట్టిన తేదీ, స్థలంస్వెత్లానా అలెక్సాండ్రోవ్నా అలెక్సీవీచ్
(1948-05-31) 1948 మే 31 (వయసు 75)
స్టానిస్లావివ్, ఉక్రయిన్, సొవియట్ యూనియన్
వృత్తిజర్నలిస్టు, రచయిత
భాషరష్యన్
జాతీయతబెలరూసియన్
పూర్వవిద్యార్థిబెలరూసియన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం
పురస్కారాలునోబెల్ బహుమతి (సాహిత్యం) (2015)
Order of the Badge of Honour (1984)
Peace Prize of the German Book Trade (2013)
Prix Médicis (2013)
Website
http://alexievich.info/indexEN.html

స్వెత్లానా అలెక్సీరోవ్నా అలెక్సీవిచ్(జననం 31 మే 1948) మనిషి స్వార్థపూరిత ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన యుద్ధాలు, విపత్తులపై అక్షరాలతో గళమెత్తిన బెలారస్ రచయిత్రి. 2015 సంవత్సరానికి సాహిత్యరంగంలో ఆమెకు నోబెల్ బహుమతి లభించింది.

జీవిత విశేషాలు

ఆమె సోవియట్ యూనియన్‌లోని ఉక్రెయిన్ ఎస్‌ఎస్‌ఆర్‌లోగల స్టానిస్లావ్‌లో మే 31, 1948 న జన్మించారు. వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన ఆమె బాల్యం రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన భయానక వాతావరణంలో గడిచింది. అందువల్లనే ఆమె జర్నలిస్టుగా యుద్ధ బాధితుల వెతలను ప్రపంచానికి చూపించటమే లక్ష్యంగా పనిచేశారు. ముఖ్యంగా మహిళల దయనీయ పరిస్థితులే కథా వస్తువులుగా పలు పుస్తకాలు రాశారు. ఆమె ప్రధానంగా రష్యన్ భాషలోనే రచనలు చేశారు. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం దుర్ఘటన, సోవియట్ యూనియన్ విచ్చిన్నానికి ముందు, ఆ తర్వాత పరిస్థితుల చుట్టే ప్రధానంగా ఆమె రచనలు సాగాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో 1985లో ఆమె రచించిన వార్స్ అన్‌వామింగ్‌లీ ఫేస్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యుద్ధ బాధిత మహిళలే తమ గోడును స్వయంగా వెల్లబోసుకొంటున్నట్లు ఫస్ట్ పర్సన్‌లో సాగే ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది.

యుద్ధ బాధిత చిన్నారుల అనుభవాల ఆధారంగా ఆమె రాసిన ది లాస్ట్ విట్నెస్: ది బుక్ ఆఫ్ అన్‌చైల్డ్‌లైక్ స్టోరీస్ పుస్తకం కూడా ఆమెకు గొప్ప గుర్తింపు తెచ్చింది. సోవియట్ యూనియన్ పతనం ఆధారంగా 1993లో రాసిన ఎన్‌చాంటెడ్ విత్ డెత్ పుస్తకం నాటి ప్రజల మానసిక సంఘర్షణలను ప్రపంచానికి సజీవంగా చూపింది. అత్యుత్తమ రచనలు చేసిన ఆమెకు అనేక అవార్డులు లభించాయి. చెర్నోబిల్ దుర్ఘటన బాధితులపై రాసిన వాయిసెస్ ఆఫ్ చెర్నోబిల్ గ్రంథానికి 2005లో నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు లభించింది.

గుర్తింపు, తిరస్కారాలు

గొప్ప ఆదర్శాల పునాదులపై మొదలయిన సోవియట్‌ రాజ్య వ్యవస్థ, దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ, కఠిన చట్రంగా మారిపోయి, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన దశను కళ్ళారా చూసిన తరాలకు చెందిన రచయిత్రి ఈమె. ఎర్ర రాజ్యంపై అయిదు పాత్రికేయ కథనాల రచనలు, తన ముప్ఫయి అయిదేళ్ళ రచనా జీవితంలో చేసినందుకు, తగు గుర్తింపుతో బాటు దూషణ, తిరస్కారాలను పొందింది. ఆ అయిదు పుస్తకాలు ఇవి.

  1. ద లాస్ట్‌ విట్నెసెస్‌ – ద బుక్‌ ఆఫ్‌ అన్‌ చైల్డ్‌ లైక్‌ స్టోరీస్‌.
  2. జింకీ బాయ్స్‌ – సోవియట్‌ వాయిసెస్‌ ఫ్రమ్‌ ద అఫ్ఘానిస్థాన్‌ వార్‌,
  3. ఎంఛాంటెడ్‌ విత్‌ డెత్‌,
  4. ద చెర్నోబిల్‌ ప్రేయర్‌ – ఎ క్రానికల్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌,
  5. ఎ సెకండ్‌ హేండ్‌ టైమ్‌.

ఈ రచనలన్నిటిలో ప్రధాన లక్షణం, డాక్యుమెంటరీ చిత్రణ, న్యూస్‌ రీల్‌ పని, వార్తా స్రవంతి వలె విషయాన్ని అమర్చడం.

పురస్కారాలు

  1. 1996లో టుచోల్‌స్కీ ప్రైజ్,
  2. 1997లో ఆండ్రీ సిన్యావ్‌స్కీ ప్రైజ్,
  3. 1998లో లీప్‌జిగ్ బుక్‌ప్రైజ్,
  4. 1999లో హెర్డర్ ప్రైజ్‌

మూలాలు

ఇతర లింకులు

ఇతర లింకులు