శ్రీ చక్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q395018
బొమ్మ:SriYantra_construct.svgను బొమ్మ:SriYantra_color.svgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: [[:commons:COM:FR#
పంక్తి 9: పంక్తి 9:


<gallery mode="packed" heights="180">
<gallery mode="packed" heights="180">
File:SriYantra construct.svg| భూప్రస్తారం
File:SriYantra color.svg| భూప్రస్తారం
File:Meru1.jpg| మేరు ప్రస్తారం
File:Meru1.jpg| మేరు ప్రస్తారం
</gallery>
</gallery>

07:27, 30 మార్చి 2016 నాటి కూర్పు

శ్రీ యంత్రము యొక్క రేఖాచిత్రం

శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం (Sri Chakra or Shri Yantra) కాశ్మీరీ హైందవము ఆధారితమైన తంత్రము లో ఒక పవిత్రమైన యంత్రం. దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణులైన శ్రీ విద్య, లలితా దేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవయోని చక్రం (Navayoni Chakra) అని లేదా నవ చక్రం (Nava Chakra) అని కూడా పిలుస్తారు.[1]

రకాలు

  • భూప్రస్తారం: రేఖాచిత్రం వలె ద్విమితీయం (two-dimensional)గా ఉంటుంది.
  • మేరు ప్రస్తారం: పిరమిడ్ వలె త్రిమీతీయంగా (three-dimensional)గా నిర్మాణించబడితే, (మేరు పర్వతాన్ని సూచించే) మహా మేరు అని అంటారు.

సరియైన బీజాలు, మంత్రాలు లేనిదే శ్రీ యంత్రము నిరుపయోగము. ప్రాణప్రతిష్ఠ, పూజలు చేయకున్నచో యంత్రము మరణించినట్లు సమానం.


శ్రీ చక్ర భాగాలు

శ్రీ చక్రం లోని ఒక్కొక్క భాగం త్రిపుర సుందరి యొక్క సూచికగా భావిస్తారు. బయటి నుండి లోపలికి వెళ్ళే దిశలో శ్రీ చక్ర భాగాలు-

  • మూడు సమాంతర రేఖలతో కూడుకుని ఉన్న చతురస్రాకారము - త్రైలోక్య్య మోహనం లేదా భూపం
  • పదహారు రేకులు గల వృత్తము - సర్వ ఆశా పరిపూరకము
  • ఎనిమిది రేకులు గల వృత్తము - సర్వ సంక్షోభనము
  • పధ్నాలుగు చిన్న త్రిభుజాలు - సర్వ సౌభాగ్యదాయకము
  • పది చిన్న త్రిభుజాలు - సర్వ అర్థసాధకాలు
  • పది చిన్న త్రిభుజాలు - సర్వ రక్షకాలు
  • ఎనిమిది చిన్న త్రిభుజాలు - సర్వ రోగహరింపులు
  • మధ్యనున్న ఒక త్రిభుజం - సర్వ సిద్ధిప్రద
  • బిందువు - సర్వ ఆనందమయి

వివరణ

కుయ్పర్ కే అనే రచయిత, Understanding India: The Culture of India అనే తన పుస్తకం లో శ్రీ చక్రం గురించి ఈ విధంగా తెలిపాడు.

వివిధ పరిమాణాలలో ఉన్న ఈ తొమ్మిది త్రిభుజాలు, ఒకదానితో ఒకటి కలుస్తాయి. వీటి మధ్యలో మానవ నేత్రానికి అందనంత, అత్యున్నత స్థానం కలిగిన, అనంతమైన కేంద్రంలో బిందువు రూపంలో శక్తి ఉంటుంది. ఈ కేంద్రము నుండే సమస్త విశ్వము వ్యాపిస్తుంది. ఈ త్రికోణాల చుట్టూ ముందు సృష్టిని సూచించే ఎనిమిది రేకులు గల వృత్తము, దాని తర్వాత పునరుత్పత్తిని సూచించే పదహారు రేకులు గల వృత్తములు ఉంటాయి. వీటి చుట్టూ నాలుగు దిశలలో పవిత్ర స్థలానికి ద్వారలు ఉంటాయి.

బిందువు అంతరాలలో కామకళ నిగూఢమై ఉంటుంది. దీనికి మూడు రకాల శక్తులు ఉంటాయి. అవి

  • ఎరుపు - అండము
  • తెలుపు - వీర్యము
  • రెండిటి కలయిక - శివశక్తుల సంగమము. ఈ సంగమమే శ్రీ చక్ర కారకము.

వామకేశ్వర తంత్రము

వామకేశ్వర తంత్రము రెండవ భాగమైన యోగినీ హృదయ లో శ్రీ చక్రం గురించి ఈ విధంగా చెప్పబడినది.

  • స్త్రీ శక్తి నుండి సృజనాత్మకం పురుష శక్తి నుండి అగ్ని వెలువడతాయి. వీటి సంయోగము తోనే చక్రము ఆవిర్భవిస్తుంది. ఇదే చక్రము యొక్క మూలము
  • మహోన్నతమైన స్త్రీ శక్తి స్వేచ్ఛగా సృష్టి అనే రూపాంతరము పొందినది. దీనికి ప్రతిస్పందనగా చక్రము యొక్క సృష్టి కూడా జరిగినది. ఈ ప్రకంపనలతో శూన్యముని పోలిన విసర్గ (:) వలె చైతన్య స్థితిలో బిందువు ఉద్భవించినది. దివ్య శక్తి యొక్క ఈ స్థిర ప్రవాహంలో సంపూర్ణమైన వ్యవస్థ అనే సముద్రము అవతరించినది. ఇదే ముగ్గురు అమ్మల మూలపుటమ్మ
  • చక్రం లో బైందవము (బిందువు)కి మూడు రూపాలు కలవు. ధర్మము, అధర్మము మరియు ఆత్మ. మాత్రి, మేయము మరియు ప్రమము. నవయోని చక్రము చైతన్యానికి, అనంత సౌఖ్యానికి సూచిక. మంత్రము యొక్క తొమ్మిది విభాగాలు కలది.

స్తోత్రము

ఇది శ్రీ చక్రాన్ని వర్ణించే శ్లోకము. శ్రీ చక్రం అమ్మ నివాస స్దానమ్.శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నవి. ఈ తొమ్మిది ఆవరణలను అర్చించుటయె శ్రీ చక్రనవావరణార్చన. ఇది అమ్మకు చాలా ప్రియమైన అర్చన.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Shankaranarayanan, S. (1979). Sri Chakra (3rd ed.). Dipti Publications.
  2. http://www.shivashakti.com/tripura.htm
  3. Kuiper, K (2011). Understanding India: The Culture of India. Britannica Educational Publishing. ISBN 9781615302031.
  1. Shankaranarayanan, S. (1979). Sri Chakra (3rd ed.). Dipti Publications.