వెంట్రప్రగడ రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు తొలగించబడింది; [[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యు...
పంక్తి 31: పంక్తి 31:
[[Category:సిక్కిం గవర్నర్లు]]
[[Category:సిక్కిం గవర్నర్లు]]
[[Category:తెలుగు ప్రజలు]]
[[Category:తెలుగు ప్రజలు]]
[[Category:ఆంధ్ర ప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు]]
[[Category:ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యులు]]

16:10, 20 మే 2016 నాటి కూర్పు

వి.రామారావు
దస్త్రం:Rama Rao V.jpg
వ్యక్తిగత వివరాలు
జననం (1935-12-12) 1935 డిసెంబరు 12 (వయసు 88)
మచిలీపట్నం, కృష్ణా జిల్లా
మరణం2016 జనవరి 17(2016-01-17) (వయసు 80)
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామివసంత కుమారి
సంతానంవి. శ్రీనివాస్
నివాసంభజన్ హిల్స్, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్

వి.రామారావు (డిసెంబరు 12 1935 - జనవరి 17 2016) సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా 2002 నుండి 2005 వరకు పనిచేసారు.[1] హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు (1966, 1972, 1978, 1984ల్లో) ఎమ్మెల్సీగా గెలుపొందారు. మండలిలో బీజేపీ పక్షనాయకుడిగానూ సేవలందించారు.[2]

రాజకీయ జీవితం

ఆయన డిసెంబరు 12 1935 న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో గల మచిలీపట్నం దగ్గరలో జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. ఆయన స్వస్థలం మచిలీపట్నం అయినా హైదరాబాద్ బీజేపీ నేతగానే ప్రసిద్ధులయ్యారు.

ఆయన 1956లో జనసంఘ్ లో సభ్యునిగా చేరారు. అనేక సంవత్సరాలపాటు భారతీయ జనసంఘ్ కు నేషనల్ ఎక్జిక్యూటివ్ సభ్యునిగా తమ సేవలనందించారు. తరువాత భారతీయ జనతా పార్టీ లోనికి చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ గా రెండు సార్లు ((1993-2001) పనిచేసారు. ఆయన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 2002 నుండి 2007 వరకు ఉన్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనేట్ సభ్యునిగా కూడా సేవలనందించారు.

శాసన మండలి సభ్యులుగా

ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో వరుసగా 1966, 1972, 1978 మరియు 1984 లలో ఎన్నికైనారు. ఆయన పార్టీ ఫ్లోర్ లీడరుగా కూడా వ్యవహరించారు. 2002- 2005 మధ్య కాలంలో సిక్కింకు గవర్నర్ గా పనిచేసిన ఆయన. ఆ పదవి నిర్వహించిన అతికొద్దిమంది తెలుగువారిలో ఒకరు.

సిక్కిం గవర్నర్ గా

ఆయన ఆగష్టు 2002 న సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా భారత రాష్ట్రపతిచే నియమింపబడ్డారు.

మరణం

ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు [జనవరి 17]] 2016 ఉదయం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆసుపత్రిలో మరణించారు.[3]

మూలాలు

  1. Hindu, The. "The Hindu Article".
  2. సీనియర్ నేత వీ రామారావు కన్నుమూత January 17, 2016 16:44 (IST)
  3. "Sikkim former Governor Rama Rao died". TelanganaNewspaper.