"కలువ కుటుంబము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
==కలువ==
{{main|కలువ}}
కలువ మొక్క ప్రతి చెరువులోను దొరువుల లోను పెరుగ గలదు గాని తామర మొక్క పెరుగ జాలదు. ఇవి రెండును అందమునకు ప్రసిద్ధి కెక్కినవి. కలువల లోను, దామరల లోను తెలుపు, ఎరుపు, నలుపు భేదములచే మూడు తెగల గలవు. కలువ కంటే దామరయే ఎక్కువ యందముగా నుండును. తామర పువ్వు విష్ణునాభి యందుండి యుత్పత్తియైన దనియు, లక్ష్మికి వాస యోగ్యమయిన గృహమనియు గాధలుండుట చే దాని యందు భక్తియు గలుగు చున్నది. కలువ సాయంత్ర మందును, దామర ప్రాతఃకాల మందును వికసించు ననుట కవి సమయముగాని యదార్థము గాదు. కలువ పువ్వు పెక్కు గదులు కలిగిన నొక కాయనే కాచును. తామర వుప్పులో గదులన్నియు విడిపోయి పెక్కు కాయలు కాచును. వీని రెండింటికి నిదియే ముఖ్య భేదము.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1904067" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ