డోకిపర్రు (కృష్ణా జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 137: పంక్తి 137:
==గ్రామ విశేషాలు==
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామము అనేకమంది స్వాతంత్ర సమర యోధులను అందించినది.
#ఈ గ్రామము అనేకమంది స్వాతంత్ర సమర యోధులను అందించినది.
#కొత్తపేట, చాకలి పేట, పెద మాలోపల్లి, చిన మాలోపల్లి లు, మాదిగువ గూడెం, తురాయి పాలెం, పెద పాలెం, ఇలా అనేకమైన వృత్తుల సముదాయములతో కలగలిసిన సమాహారమే ఈ డోకిపర్రు గ్రామము.
#[[కొత్తపేట]], [[చాకలి పేట]], [[పెద మాలోపల్లి]], [[చిన మాలోపల్లి]] లు, [[మాదిగువ గూడెం]], [[తురాయి పాలెం]], [[పెద పాలెం]], ఇలా అనేకమైన వృత్తుల సముదాయములతో కలగలిసిన సమాహారమే ఈ డోకిపర్రు గ్రామము.
#ఈ ఊరికి చెందిన వీర్ల పాల్ సుధాకర్ అను విద్యార్థి, ఉక్రెయిన్ లో రాకెట్ మరియూ ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ బ్రాంచ్ లో మొదటి సం. ఇంజనీరింగ్ చదువుచున్నాడు. ఈయన చదువుచున్న కళాశాల పేరు kharkiv Aviation Institute of the National Aeroscope University. ఈతడు అంతరిక్షంలో వ్యోమగాములను తిరిగి క్షేమంగా భూమిమీద దింపగలిగిన మరియూ తిరిగి ఉపయోగించుకొనుటకు వీలయిన వొక అంతరిక్ష రాకెట్ (Single Stage to Orbit = SSTO) ను డిజైన్ చేయుచున్నాడు. [1]
#ఈ ఊరికి చెందిన వీర్ల పాల్ సుధాకర్ అను విద్యార్థి, [[ఉక్రెయిన్]] లో రాకెట్ మరియూ ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ బ్రాంచ్ లో మొదటి సం. ఇంజనీరింగ్ చదువుచున్నాడు. ఈయన చదువుచున్న కళాశాల పేరు kharkiv Aviation Institute of the National Aeroscope University. ఈతడు అంతరిక్షంలో వ్యోమగాములను తిరిగి క్షేమంగా భూమిమీద దింపగలిగిన మరియూ తిరిగి ఉపయోగించుకొనుటకు వీలయిన వొక అంతరిక్ష రాకెట్ (Single Stage to Orbit = SSTO) ను డిజైన్ చేయుచున్నాడు. [1]



==గణాంకాలు==
==గణాంకాలు==

02:31, 2 జూలై 2016 నాటి కూర్పు

డోకిపర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,909
 - పురుషుల సంఖ్య 2,982
 - స్త్రీల సంఖ్య 2,927
 - గృహాల సంఖ్య 1,670
పిన్ కోడ్ 521 332.
ఎస్.టి.డి కోడ్ 08674

డోకిపర్రు (Dokiparru) కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలములోని ఒక గ్రామము. ఈ వూరి పిన్ కోడ్ నం.521 332., యస్.టీ.డీ.కోడ్ నం.08674.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

గుడివాడ నుండి మచిలీపట్నం వెళ్ళే రోడ్డులో గుడ్లవల్లేరు నుండి 4 కి.మీ. దూరంలో, కౌతవరం కి నిడుమోలు కు మధ్యన మరియు విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే NH9 రోడ్డులో నిడుమోలు కు 3 కి.మీ. దూరం లో, డోకిపర్రు గ్రామము ఉన్నది.

సమీప గ్రామాలు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలు

పామర్రు, గుడివాడ, గూడూరు, ముదినేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు

ఊరికి బస్సు సౌకర్యం కలదు. ఆటోలు, మోటారు సైకిళ్ళు ఇతర ముఖ్య ప్రయాణ సాధనాలు.

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం కలదు. రైల్వేస్టేషన్ విజయవాడ 54 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

  1. డోకిపర్రు లో శ్రీ వీరమాఛనేని వెంకట గంగాధర రావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చాలా కాలంనుండి ఉంది. కృష్ణా జిల్లాలో ఇది రెండో ప్రభుత్వ ఉన్నత పాఠశాల. మిగిలినవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలే. పిల్లలకు రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండడం విశేషం.
  2. శాఖా గ్రంధాలయం:-ఈ గ్రంధాలయం గ్రేడ్-2 పరిధిలో ఉన్నది. ఇక్కడ మొత్తం 25,000 విలువైన గ్రంధాలు ఉన్నవి. []

గ్రామములో మౌలిక వసతులు

అనేక మంది దాతల వితరణ తో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గ్రంధాలయం, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాలలకు స్థలము, త్రాగు నీటి శుద్ధి కేంద్రం దాతల వితరణతో నెలకొల్పబడినది మరియు భవనములు సమకూరినవి.

బ్యాంకులు

ఆంధ్రా బ్యాంక్:- గ్రామములోని, ఆధునికీకరించిన ఈ బ్యాంక్ శాఖను 2016,జనవరి-16న ప్రారంబించెదరు. [7]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

ముఖ్యమైన నీటివనరు కృష్ణా కాలువలు మరియు అచ్చమ్మ చెరువు, భద్రారెడ్డి చెరువు, కోమటి చెరువు.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ జోగి వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ అలివేలు మంగా, పద్మాతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

  1. హైదరాబాదుకు చెందిన (మెయిల్) ఎం.ఇ.ఐ.ఎల్. (Mega Engineering Infrastructure Private Ltd.,) సంంస్థ ఛైర్మన్ శ్రీ పామిరెడ్డి పిచ్చిరెడ్డి మరియూ ఆ సంస్థ ఎం.డి. శ్రీ పురిటిపాటి కృష్ణారెడ్డి, ఈ గ్రామంలో రెండున్నర ఎకరాల స్థలం కొనుగోలుచేసి, ఆగష్టు-2012 లో నిర్మాణం ప్రారంభించి, పదికోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించినారు. వీరి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణపనులను గూడా ఆ సంస్థవారి ఇంజనీరింగ్ బృందమే చేపట్టి నిర్మించడం విశేషం. ఈ ఆలయానికి ఇరుప్రక్కలా శ్రీ సీతా, రామ, ఆంజనేయ, ప్రక్కన, వినాయక, వెనుక, ఉపాలయాలుగా శ్రీ లక్ష్మీనరసింహ, వరాహ, దశావతారస్వాములు, విష్వక్సేన, మునిమందిరాలు నిర్మించినారు. 59 అడుగుల ఎత్తయిన భారీ గాలిగోపుర నిర్మాణం, చుట్టూ కళాకృతప్రహరీ, కోనేరు నిర్మాణం, ఇక్కడి విశేషాలు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే-27వ తేదీ, బుధవారంనాడు ప్రారంభించినారు. [2]&[3]
  2. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి 40 రోజులైన సందర్భంగా, 2015,జూలై-15వ తేదీ బుధవారంనాడు, ఆలయంలో మండల దీక్షా కార్యక్రమాలు నిర్వహించినారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, క్రతువులు నిర్వహించినారు. [4]

గ్రామములోని ప్రధాన పంటలు

ఈ వూరిలో ప్రధానమైన పంట వరి. అపరాలు కూడా పండుతాయి.

గ్రామములోని ప్రధాన వృత్తులు

ఈ గ్రామము లో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ప్రముఖ స్థానం ఉన్నా, అన్ని వృత్తుల వారికి వారి వారి వృత్తులకు అధిక ప్రాధాన్యము కలదు. ఈ వూళ్ళో చాలా కాలంగా అన్ని కులాలు కలిసి సహ జీవనం సాగిస్తున్నాయి.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

శ్రీ పామిరెడ్డి పిచ్చిరెడ్డి:- వీరు హైదరాబాదులోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ అయిన "మెగా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిలెటెడ్ (M.E.I.L)" అను సంస్థకు ఛైర్మన్. వీరు రు. 10 కోట్లతో ఈ గ్రామాన్ని దత్తత తీసికొని, అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినారు.

గ్రామ విశేషాలు

  1. ఈ గ్రామము అనేకమంది స్వాతంత్ర సమర యోధులను అందించినది.
  2. కొత్తపేట, చాకలి పేట, పెద మాలోపల్లి, చిన మాలోపల్లి లు, మాదిగువ గూడెం, తురాయి పాలెం, పెద పాలెం, ఇలా అనేకమైన వృత్తుల సముదాయములతో కలగలిసిన సమాహారమే ఈ డోకిపర్రు గ్రామము.
  3. ఈ ఊరికి చెందిన వీర్ల పాల్ సుధాకర్ అను విద్యార్థి, ఉక్రెయిన్ లో రాకెట్ మరియూ ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ బ్రాంచ్ లో మొదటి సం. ఇంజనీరింగ్ చదువుచున్నాడు. ఈయన చదువుచున్న కళాశాల పేరు kharkiv Aviation Institute of the National Aeroscope University. ఈతడు అంతరిక్షంలో వ్యోమగాములను తిరిగి క్షేమంగా భూమిమీద దింపగలిగిన మరియూ తిరిగి ఉపయోగించుకొనుటకు వీలయిన వొక అంతరిక్ష రాకెట్ (Single Stage to Orbit = SSTO) ను డిజైన్ చేయుచున్నాడు. [1]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 5,909 - పురుషుల సంఖ్య 2,982 - స్త్రీల సంఖ్య 2,927 - గృహాల సంఖ్య 1,670

బయటి లింకులు

[1] ది హిందు దినపత్రిక; 2013,జూన్-23; 2వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,మే-27; 29వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,మే-30; 31వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,జులై-16; 30వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-15; 32వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-17; 26వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2016,జనవరి-15; 31వపేజీ.