చల్లా పిచ్చయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 8: పంక్తి 8:


==అవధానరంగము==
==అవధానరంగము==
ఇతడు [[రాళ్ళబండి వెంకటసుబ్బయ్య]]తో కలిసి జంటగా 1913-1915 మధ్య మూడు సంవత్సరాలు అనేక శతావధానాలు, అష్టావధానాలు చేశాడు. వాటిలో ప్రత్తిపాడులో ఒక శతావధానము, ఉల్లిపాలెం, కొల్లూరులలో రెండు అష్టావధానాల వివరాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఇతడు ఒంటరిగా కూడా
అనేక అవధానాలు చేశాడు.
===కొన్ని అవధానపద్యాలు===
* సమస్య: ఉత్తరంబున భానుదేవుఁడుదయంబయ్యెన్

==రచనలు==
==రచనలు==
==మూలాలు==
==మూలాలు==

00:20, 14 జూలై 2016 నాటి కూర్పు

చల్లా పిచ్చయ్యశాస్త్రి మహాకవి, శతావధాని, పండితుడు మరియు సంగీత విద్వాంసుడు.

జీవిత విశేషాలు

ఇతడు విజయ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు గుంటూరు జిల్లా, ఇంటూరు గ్రామంలో వెంకమాంబ, పున్నయ్య దంపతులకు జన్మించాడు.

బాల్యము, విద్యాభ్యాసము

ఇతడు వీధిబడిలో చదువుకుంటూ మామ రాజనాల వేంకటసుబ్బయ్యశాస్త్రివద్ద రఘువంశం ప్రథమసర్గ పూర్తిచేశాడు. వల్లూరులోని ప్రతాపరామయ్య వద్ద రఘువంశం ద్వితీయ సర్గ ప్రారంభించాడు. తరువాత పాతూరి రామస్వామి వద్ద రఘువంశములోని ద్వితీయ,తృతీయ సర్గలు పూర్తిచేసి, కుమార సంభవములోని మొదటి ఐదు సర్గలు చదివాడు. తాడేపల్లి వేంకటసుబ్బయ్య వద్ద నాటకాలంకార శాస్త్రములతోపాటుగా సంస్కృత పంచకావ్యములు, మనుచరిత్ర మొదలైన ఆంధ్రకావ్యములు అధ్యయనం చేశాడు.

ఉద్యోగపర్వము

ఇతడు మొదట ఇంటూరు హిందూ హైస్కూలులో 1928 నుండి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత 1944లో పొన్నూరులోని భావనారాయణ సంస్కృత కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి 1951 వరకు పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు.

అవధానరంగము

ఇతడు రాళ్ళబండి వెంకటసుబ్బయ్యతో కలిసి జంటగా 1913-1915 మధ్య మూడు సంవత్సరాలు అనేక శతావధానాలు, అష్టావధానాలు చేశాడు. వాటిలో ప్రత్తిపాడులో ఒక శతావధానము, ఉల్లిపాలెం, కొల్లూరులలో రెండు అష్టావధానాల వివరాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఇతడు ఒంటరిగా కూడా అనేక అవధానాలు చేశాడు.

కొన్ని అవధానపద్యాలు

  • సమస్య: ఉత్తరంబున భానుదేవుఁడుదయంబయ్యెన్

రచనలు

మూలాలు