"మదనపల్లె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
== మదనపల్లె నాటక కళాపరిషత్‌ ==
 
35 ఏళ్ళ కిందట [[మదనపల్లె]] నాటక కళాపరిషత్‌ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్‌ జిల్లా న్యాయమూర్తి జయరామిరెడ్డి న్యాయవాదులు బోయపాటి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీకాంతం, బి.నర్సింహులు, పార్థసారధి, కాంట్రాక్టర్లు రామన్న, కిట్టన్న, పెరవళి కృష్ణమూర్తి, అశ్వర్థనారాయణ, జర్నలిస్టు పురాణం త్యాగమూర్తి శర్మ, గాయకుడు పత్తి రెడ్డన్న, ఫోటోగ్రాఫర్‌ బి.నారాయణశర్మ, ఉపాధ్యాయులు ఎ.సుబ్రమణ్యం, ఉద్యోగి జివి రమణలు కీలకపాత్ర పోషించారు. వీరు సభ్యులుగా, నటులుగా ఎన్నో నాటకాలు వేశారు. [[నెల్లూరు]] కు చెందిన నెప్జా నాటక కళాపరిషత్‌, [[ప్రొద్దుటూరు]] కు చెందిన రాయల నాటక కళాపరిషత్‌ [[అనంతపురం|అనంతపురము]] కు చెందిన పరిత కళాపరిషత్‌, [[చిత్తూరు]] కు చెందిన ఆర్ట్స్ లవర్‌ అసోసియేషన్‌ నిర్వహించే నాటక పోటీల్లో మదనపల్లె నాటక కళా పరిషత్‌ పాల్గొంటూ ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. మదనపల్లె నాటక రంగంలో ప్రధానంగా పల్లెపడుచు, [[రామదాసు|భక్త రామదాసు]], వెంకన్న కాపురం, ఎవరు దొంగ, కప్పలు తదితర సాంఘిక, చారిత్రాత్మక నాటకాలను వేశారు. మదనపల్లె జిఆర్‌టి హై స్కూల్‌లో రోజుకు నాలుగు దాకా నాటకాలు వేశేవారు. పోటీలు నిర్వహించి వారం రోజుల పాటు నిరవధికంగా నాటకాలు వేసేవారు. నాటకాల్లో మహిళా పాత్రదారులు [[గూడూరు]] సావిత్రి, సీతారామమ్మ, రాజేశ్వరీ తదితరులు వచ్చేవారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించేది.
 
== అంజుమన్ తరఖి ఉర్దూ (మదనపల్లె శాఖ) ==
1,89,110

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1950858" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ