కృష్ణా జలవివాదాల న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు
కొత్త పేజీ |
+మూస |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{కృష్ణా నదిపై ప్రాజెక్టులు}} |
|||
[[కృష్ణా నది|కృష్ణా జలాల]] పంపకంపై మూడు పరీవాహక రాష్ట్రాలైన [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[ఆంధ్ర ప్రదేశ్]] ల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించి, లభ్యమయ్యే నీటిని పంపకం చేసేందుకు ఉద్దేశించినది, '''బచావత్ ట్రిబ్యునల్'''. జస్టిస్ ఆర్.ఎస్.బచావత్ అధ్యక్షుడిగా ఏర్పడింది కాబట్టి దీన్ని బచావత్ ట్రిబ్యునల్ అన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 కు లోబడి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటయింది. |

18:02, 3 ఫిబ్రవరి 2006 నాటి కూర్పు
కృష్ణా జలాల పంపకంపై మూడు పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించి, లభ్యమయ్యే నీటిని పంపకం చేసేందుకు ఉద్దేశించినది, బచావత్ ట్రిబ్యునల్. జస్టిస్ ఆర్.ఎస్.బచావత్ అధ్యక్షుడిగా ఏర్పడింది కాబట్టి దీన్ని బచావత్ ట్రిబ్యునల్ అన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 కు లోబడి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటయింది.
1969 ఏప్రిల్ 10 న కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఆర్.ఎస్.బచావత్ అధ్యక్షుడిగా, షంషేర్ బహదూర్, డి.ఎం.భండారి సభ్యులుగా బచావత్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి, కృష్ణా నదిలో లభ్యమయ్యే నీటిని మూడు రాష్ట్రాల మధ్య పంపకం చేయమని కోరింది.
ట్రిబ్యునల్ పంపకాలు
కృష్ణా నదిలో నమ్మకంగా ప్రవహిస్తుందని అంచనా వేసిన 2060 టి.ఎం.సి. నీటిని 1976 లో ట్రిబ్యునల్ కింది విధంగా పంపకం చేసింది.
- మహారాష్ట్ర: 560 టి.ఎం.సి.
- కర్ణాటక: 700 టి.ఎం.సి.
- ఆంధ్ర ప్రదేశ్: 800 టి.ఎం.సి.
పై నీటికి అదనంగా నదిలో 70 టి.ఎం.సి. ఊట (రీజనరేటివ్ ఫ్లో) ఉంటుందని కూడా అంచనా వేసారు. ఈ నీటిని కూడా పంచాక మూడు రాష్ట్రాల వాటా ఇలా ఉంది.
- మహారాష్ట్ర: 585 టి.ఎం.సి.
- కర్ణాటక: 734 టి.ఎం.సి.
- ఆంధ్ర ప్రదేశ్: 811 టి.ఎం.సి.
పై మొత్తాలకు మించి ప్రవహించే అదనపు జలాలను పూర్తిగా వాడుకునే స్వేచ్ఛను ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చింది. అయితే ఈ అధిక జలాలపై హక్కును మాత్రం ఆంధ్ర ప్రదేశ్ పొందదు.
- స్కీము ఎ, స్కీము బి
- ట్రిబ్యునల్ తన నివేదికను స్కీము 'ఎ', స్కీము 'బి' అనే రెండు భాగాలుగా ఇచ్చింది. అయితే తన తుది తీర్పులో మాత్రం స్కీము 'ఎ' ను మాత్రమే ప్రస్తావించి, స్కీము 'బి' ని వదలివేసింది. అయితే మూడు పక్షాలు అంగీకరిస్తే స్కీము 'బి' ని కూడా అమలు జరపవచ్చని వివరించింది.
- ట్రిబ్యునల్ తీర్పు యొక్క సమీక్ష
- బచావత్ ట్రిబ్యునల్ చేసిన పంపకాలను 2000 మే 31 తరువాత మరో అధికారిక సంస్థ చేత సమీక్ష చేయించవచ్చు.