నా రీసెర్చ్ లో భాగంగా తెలుగు నాటకరంగం గురించిన వివరాలను తెలుసుకోవలసివుంటుంది. అంతకుముందే ఇంగ్లీష్ వికీపీడియాతో పరిచయం ఉండడంవల్ల తెలుగు వికీపీడియాలో వెతకడం జరిగింది. కాని అనుకున్న సమాచారం లభించలేదు. అన్ని భాషల వికీపీడియల్లో కంటే తెలుగు వికీపీడియాలో తక్కువ సమాచారం ఉందని అర్థం అయ్యింది. ఎలాగైనా తెలుగు వికీపీడియాలో పూర్తి సమాచారం ఉండేలా కృషి చేయాలనిపించింది.
08.03.2013 మహిళా దినోత్సవం రోజున థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆఫీస్ లో వికీపీడియా అకాడమీలో భాగంగా వికీపీడియా:సమావేశం/మార్చి_8,_2013_సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో పాల్గొని వికీపీడియా గురించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నాను.
2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు (Wiki 10th Anniversary) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను.
2015లో తిరుపతిలో జరిగిన 11 వ వార్షికోత్సవంలో (Wiki 11th Anniversary) ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను
2016 జూన్ లో ఇటలీలో జరిగిన వికీమేనియా-2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను.
2016 ఆగష్టులో చండిఘడ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాను. పంజాబ్ ఎడిటథాన్ పోటీలో తెలుగు వికీపీడియా విజయం సాధించింది.
తెలుగు నాటకము రంగానికి సంబంధించిన నటీనటులు, రచయితలు ఇతర సాంకేతిక నిపుణుల గురించిన సమగ్ర సమాచారం అందించడం.
ప్రణయ్‌రాజ్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో నాటక రంగానికి చెందిన వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్ (చర్చ) 07:24, 18 ఏప్రిల్ 2015 (UTC)
పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో తెలుగు వికీపీడియాను విజయం వైపు నడపడంలో మీ సమన్వయ, నిర్వహణ నైపుణ్యాన్ని వినియోగించినందుకు, స్వయంగా అనేక వ్యాసాలను సరిదిద్ది సహ సభ్యులను ఉత్సాహపరిచినందుకు మీకు ఓ విజయ పతకం.... పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున పవన్ సంతోష్ (చర్చ) 14:50, 10 ఆగష్టు 2016 (UTC)