"అమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
10 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ని → ని , గా → గా , తో → తో , పెళ్లి → పెళ్ళి, → using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ని → ని , గా → గా , తో → తో , పెళ్లి → పెళ్ళి, → using AWB)
{{See also|అమ్మ (అయోమయ నివృత్తి)}}
[[దస్త్రం:Mother and Child - Kozhikode - India.JPG|250px|thumb]]
[[కుటుంబము]] లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో [[స్త్రీ]] ని '''తల్లి''', '''జనని''' లేదా '''అమ్మ''' (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. పుట్టిన ప్రతి బిడ్డకు నాన్నఎవరో తెలియకపోయినా అమ్మ ఖచ్చితంగా తెలుస్తుంది. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు [[గర్భాశయం]] లో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత [[పాలు]] త్రాగించి, [[ఆహారం]] తినిపించి, [[ప్రేమ]] తో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని [[అమ్మ]] , [[మాత]] అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
 
* [[కన్న తల్లి]]: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.
* [[పెంపుడు తల్లి]]: పిల్లల్ని దత్తత చేసుకున్న తల్లి.
* [[సవతి తల్లి]]: కన్నతల్లి చనిపోయిన లేదా విడాకులు పొందిన తర్వాత, రెండవ పెళ్లిపెళ్ళి ద్వారా కుటుంబంలో స్థానం సంపాదించిన స్త్రీ పిల్లలకి సవతి తల్లి అవుతుంది.
* [[పెత్తల్లి]] లేదా [[పెద్దమ్మ]]: అమ్మ యొక్క అక్క లేదా తండ్రి యొక్క అన్న భార్య.
 
== తల్లి పేరుకూ చోటు ==
ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల సర్టిఫికెట్లలో తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా అదనంగా ముద్రిస్తారు. తల్లి పేరు మాత్రమే ఉండాలనో లేక తండ్రి పేరు మాత్రమే ఉండాలనో కూడా విద్యార్థి కోరుకోవచ్చు. ఈ విషయంలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
అమృత వాక్యం అమ్మ కదా అలాంటి అమ్మ పేరు వ్రాయవలసినది సర్టిఫికెట్ల మీద కాదు హృదయం లోహృదయంలో అని మనం అందరం తెలుసుకోవాలి .
 
== పంచమాతలు ==
::ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా !
 
రాజు భార్య (రాణి), అన్న భార్య ([[వదిన]]), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి ([[అత్త]]) మరియు కన్న తల్లి - వీరిని [[పంచమాతలు]] గా భావించవలెను అని [[కుమార శతకము]] నుండి పద్యము.
==శంకర సూక్తి==
ఆది శంకరుని దృష్టి లోదృష్టిలో తల్లి :<br />
"కు పుత్రోజాయేత క్వచిదపి కు మాతా న భవతి"<br />
'పుత్రుడు చెడ్డవాడైనా, తల్లి చెడ్డది కాబోదు ' అని తాత్పర్యం.<br />
 
 
== అమ్మ గురించి తెలుగు కవుల కమ్మని పలుకులు ==
 
== అమ్మతో సామెతలు ==
# అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు (జేబు) చూస్తుంది
# అమ్మకడుపున పుట్టిన వాళ్లంతా నిక్షేపరాయుళ్ళే
# అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
# అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు
# అమ్మ తా పెట్టదు, అడుక్కొని తినా తిననివ్వదు
# అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు, తగుదునని తగవు తీర్చవచ్చాడు
# అమ్మ కడుపులో ఉన్న వాళ్ళూ సమాధుల్లో ఉన్నవాళ్ళే మంచివాళ్ళు
# అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది
# అమ్మ గూటికి అయ్య కాటికి
# అమ్మ చెడ్డ చేటుకు ముసుగొకటా?
# అమ్మ దగ్గర కిందపడుకున్నా ఒక్కటే , అయ్య దగ్గర నేల పడుకున్నా ఒకటే
# అమ్మ మంచిదేకానీ తెడ్డు మంచిది కాదు
# అమ్మ దాసర్లకు, అయ్య జంగాలకు
# అమ్మను తిడతావేమిరా లంజాకొడకా అన్నాడట
# అమ్మ పెంచిన బిడ్డా?అయ్య పెంచిన బిడ్డా?
# అమ్మా నొప్పులెత్తుతున్నప్పుడు నన్ను లేపవే అంటే అలగా పడుకో బిడ్డా ఊటగా నొప్పులెత్తుకుంటే ఊరెల్లా నీవే లేపుతావు అన్నదట
# అమ్మా నీ అల్లుడొచ్చాడే అంటే నన్నేమి చేస్తాడమ్మా నిన్నే తీసికెళ్తాడు అందట
# అమ్మా పెట్టేవి నాలుగూ పెందలాడే పెట్టవే , దూడ గడ్డికి పోవాల అన్నాడట
# అమ్మా బాబు పిచ్చిగానీ , నాకు చదువు వస్తుందా?
# అమ్మా ఇలాంటి నాన్నతో ఎలా వేగేవే?
 
# తల్లి అయినా ఏడవందే పాలు ఇవ్వదు
# తల్లి ఓర్చనిది దాది ఓర్చునా?తల్లికి కానివాడు దాదికవునా?తల్లికి లేని ముద్దు దాదికి కలుగునా?తల్లే రోసిన దాది రోయదా?
# తల్లి కడుపులో చొరకముందు దయ్యాలదేవత, భూమిలో పుట్టిన తరువాత యమదేవత
# తల్లికి కాకపోతే తిళ్ళీకకు (దీపానికి) దణ్ణం పెట్టమన్నారు
# తల్లికి కొట్టరా వసంతం అన్నట్లు
# తల్లికి తగిన బిడ్డ , ఇంటికి తగిన పందిరి
# తల్లికి తప్పిన వానికి పినతల్లి శష్ప సమానం
# తల్లికి వంచ గలిగిన , పిల్లకు బొక్క (ఎముక) కలుగుతుంది
# తల్లికొద్దీ బొల్లి కోడె
# తల్లి గండము పిల్ల గండమూ ఉందిగానీ మధ్యలో మంత్రసాని గండం ఉందా?
# తల్లి చస్తే నాలుక చచ్చినట్లు, తండ్రి చస్తే కళ్ళు పోయినట్లు
# తల్లి చాలు పిల్లకు తప్పుతుందా?
# తల్లి చెవులో మద్దికాయలు దండుగలకు, భార్య మెడలో పూసలు బందుగులకు (భోగాలకు)
# తల్లి చెవులు తెంపిన వానికి పినతల్లి చెవులు బీరపువ్వులు
# తల్లి చేలో మేస్తే , దూడ గట్టున మేస్తుందా?
# తల్లి తర్పణానికే తక్కువైతే, పినతల్లికి పిండ ప్రధానమట
# తలిదండ్రి లేని బాల తన నాధునే కోరును
# తల్లి పుస్తి బంగారమైనా కంసాలి దొంగలించకుండాఉండలేడు
# తల్లి పెంచాలి ధరణి పెంచాలిగాని పెరవారు పెంచుతారా?
# తల్లి మాటలేగానీ, పెట్టుమాత్రం పినతల్లిది (సవతితల్లిది)
# తల్లి ముఖం చూడని బిడ్డ, వాన ముఖం చూడని పైరు
# తల్లి మీదకోపం పిల్లమీద పోతుంది
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1964216" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ