అంగర సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Venkat angara (చర్చ | రచనలు) |
Venkat angara (చర్చ | రచనలు) author personal data |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
{{సమాచారపెట్టె వ్యక్తి |
{{సమాచారపెట్టె వ్యక్తి |
||
| name = '''అంగర సూర్యారావు''' |
| name = '''అంగర సూర్యారావు''' |
||
| residence =22-67-5/1, chopudargalli, Town hall road, Visakhaptam-1 |
|||
| residence = |
|||
| other_names = |
| other_names = |
||
| image =Angara Suryarao.JPG |
| image =Angara Suryarao.JPG |
||
| imagesize = 250px |
| imagesize = 250px |
||
| caption = అంగర సూర్యారావు |
| caption = అంగర సూర్యారావు |
||
| birth_name = |
| birth_name =Surya Rao |
||
| birth_date = |
| birth_date =4 july 1927 |
||
| birth_place = |
| birth_place =Mandapeta ( East godavari dist, Andhrapradesh) |
||
| native_place = |
| native_place =Visakhapatnam |
||
| death_date = |
| death_date = |
||
| death_place = |
| death_place = |
||
| death_cause = |
| death_cause = |
||
| known = తెలుగు నాటక రచయిత, చరిత్రకారుడు. |
| known = తెలుగు నాటక రచయిత, చరిత్రకారుడు. |
||
| occupation = |
| occupation =AP govt. Retd Employee |
||
| title = |
| title = |
||
| salary = |
| salary = |
||
| term = |
| term = |
||
| predecessor = |
| predecessor = |
||
| successor = |
| successor =Angara Krishnarao, Angara Venkateswara Rao |
||
| party = |
| party = |
||
| boards = |
| boards = |
||
| religion = |
| religion = |
||
| wife = |
| wife = |
||
| spouse= |
| spouse=Padmavathi |
||
| partner = |
| partner = |
||
| children = |
| children = |
||
| father = |
| father =Naganna |
||
| mother = |
| mother =veeramma |
||
| website = |
| website = |
||
| footnotes = |
| footnotes = |
15:52, 16 అక్టోబరు 2016 నాటి కూర్పు
బాల్యం
అంగర సూర్యారావు 1927 జులై 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించారు.
విద్య
విద్యాభ్యాసం మండపేట , రామచంద్రపురంలలో జరిగింది.
వృత్తి
1949లో విశాఖపట్నంలో విద్య శాఖలో గుమాస్తాగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సూర్యారావు విశాఖనగరంపై ప్రేమను పెంచుకొని, బదిలీలు ఇష్టపడక పదోన్నతులను వదులుకొని రిటైర్ అయ్యేవరకూ గుమాస్తాగానే వుండిపోయారు.
రచనలు
- తొలి రచన 1945లో ' కృష్ణా పత్రిక' లో వచ్చింది.( వ్యాసం)
- మొదటి కథ ' వినోదిని ' మాస పత్రికలో ప్రచురితమయింది.
- ' చిత్రగుప్త', ' చిత్రాంగి', ' ఆనందవాణి', ' సమీక్ష', వంటి ఆనాటి పత్రికలలో కథలు, నాటికలు వచ్చాయి.
- 1948 నుండి 1958 వరకు ' తెలుగు స్వతంత్ర' లో కథలు, స్కెచ్ లు వచ్చాయి.
- ' ఆంధ్ర సచిత్ర వారపత్రిక' ,' భారతి సాహిత్య మాస పత్రిక' , 'ఆంధ్ర ప్రభ', సచిత్ర వార పత్రికలలో వచ్చిన నాటికలు, నాటకాలలో కొన్ని రచనలు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.
- పలు నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.
పుస్తకాలు
- కళోద్ధారకులు ( నాటికలు - 1956)
- శ్రీమతులు - శ్రీయుతులు ( నాటికలు - 1959 )
- నీలి తెరలు ( నాటకం - 1959)
- పాపిష్టి డబ్బు ( నాటికలు - 1960 )
- ఇది దారి కాదు ( నాటకం - 1967)
- ఎనిమిది నాటికలు ( 1976 )
- చంద్రసేన ( నాటకం - 1976 )
- రెండు శతాబ్దాల విశాఖ నగర చరిత్ర ( 2006 )
- సమగ్ర విశాఖ నగర చరిత్ర - మొదటి భాగం ( 2012)
- సమగ్ర విశాఖ నగర చరిత్ర - రెండవ భాగం ( 2014)
- 60 ఏళ్ళ ఆంధ్ర సాహిత్య చరిత్రలో పురిపండా ( అముద్రితం)
- ఉత్తరాంధ్ర సమగ్ర సాహిత్య చరిత్ర ( అముద్రితం)
రచన శైలి
- నిశితమైన వ్యంగ్యం వుపయోగించి ఎదుటి వాడిని చకిత పరచడమూ,సున్నితమైన హాస్యంతో నవ్వినచడమూ, తప్పు చేసి తప్పుకొనే మనిషిని నిలువునా నిలదీయడమూ వీరి నాటికలు, నాటకాలలోని ప్రత్యేకత.
- వీరి రచనలలోని పాత్రలు సమాజంలో మన చుట్టూ తిరుగుతుండేవే. అందుకనే వారి రచనలు సజీవమైనవి...సత్య దూరం కానివి. వీరి నాటికలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ నాలు మూలాల రంగస్థలాలకెక్కాయి.
- రచనలో మాత్రమే కాక నాటక ప్రయోగంలో సూర్యారావు గారికి మంచి అనుభవమూ, అభినివేశమూ వుంది. రంగశాల అనే సంస్థను స్థాపించి, దానికి అధ్యక్షులుగా వుండి ప్రయోగాత్మక కృషి చేసారు.
ఉదాహరణలు
సాహిత్య సేవ
- 1949లో ప్రారంభించిన ' విశాఖ రచయితల సంఘం' వ్యవస్థాపక సభ్యులలో ఒకరు.
- 1965 - 1978 సంవత్సరాల మధ్య ' కవితా సమితి ' సెక్రటరీ గానూ,
- 1974 నుండి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగానూ వున్నారు.
పురస్కారాలు, గౌరవాలు, బిరుదులు
- ఆయన రాసిన "చంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు పొందినది (1978).
- 1979లో ఎనిమిది నాటికలు సంపుటిని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు M.A. పాఠ్యగ్రంధాలలో ఒకటిగా ఎంపిక చేసారు.
- 2015లో ' జాలాది ఆత్మీయ పురస్కారం' ను అందుకున్నారు.
- 2015 లోనే ' బలివాడ కాంతారావు స్మారక అవార్డు' ను అందుకున్నారు.