శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 50: పంక్తి 50:
<ref>https://www.youtube.com/watch?v=k5PlXbIbovU&feature=share</ref>
<ref>https://www.youtube.com/watch?v=k5PlXbIbovU&feature=share</ref>
<ref>సార్ధక బిరుదాంకితులు పండిత యశస్వి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, http://sarikothasamacharam.com/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%95-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AA%E0%B0%82/</ref>
<ref>సార్ధక బిరుదాంకితులు పండిత యశస్వి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, http://sarikothasamacharam.com/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%95-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AA%E0%B0%82/</ref>
<ref> శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 150వ జయంతి సాక్షి దినపత్రిక(21.10.16)</ref>
<ref> శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 150వ జయంతి సాక్షి దినపత్రిక(21.10.16)</ref>
ఈతీరున బత్త్రి కాసంపాదకులై, శతాధిక గ్రంథరచయితలై, భారత బాగవత రామాయణాంధ్రీకర్తలై, కవిరాజులై, కవిసార్వభౌములై, కళాప్రపూర్ణులై, మహామహోపాధ్యాయులై, ఆంధ్రవ్యాసులై, కనకాభిషిక్తులై, పూర్ణపురుషాయుషజీవులై విరాజిల్లుచున్న కృష్ణమూర్తి శాస్త్రిగారి సమగ్రజీవితము వ్రాసినచో మఱియొక మహాభారతము.
ఈతీరున బత్త్రి కాసంపాదకులై, శతాధిక గ్రంథరచయితలై, భారత బాగవత రామాయణాంధ్రీకర్తలై, కవిరాజులై, కవిసార్వభౌములై, కళాప్రపూర్ణులై, మహామహోపాధ్యాయులై, ఆంధ్రవ్యాసులై, కనకాభిషిక్తులై, పూర్ణపురుషాయుషజీవులై విరాజిల్లుచున్న కృష్ణమూర్తి శాస్త్రిగారి సమగ్రజీవితము వ్రాసినచో మఱియొక మహాభారతము.
https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:AndhraRachaitaluVol1.djvu/243
https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:AndhraRachaitaluVol1.djvu/243

06:19, 24 అక్టోబరు 2016 నాటి కూర్పు

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
జననం1866
మరణం1960, డిసెంబరు 29
వృత్తిరచయిత
తల్లిదండ్రులు
  • వెంకట సోమయాజులు (తండ్రి)
  • వెంకట సుబ్బమ్మ (తల్లి)

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి (జననం: 1866 - మరణం: 1960) ఆధునిక తెలుగు ఆస్థాన కవి.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఎర్నగూడెం దగ్గర దేవరపల్లిలో వెంకట సోమయాజులు మరియు వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా గ్రంథాలు రచించారు. వానిలో నాటకాలు, కావ్యాలు, జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి.

పండితయశస్వి

'ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవి శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కి గండపెండేరం సత్కారం, గజారోహణం ఇలా ఎన్నో సత్కారాలు జరిగాయి. ఎన్నో బిరుదులూ వున్నాయి. ఆ బిరుదులన్నీ సార్ధక బిరుదులే. శతాధిక గ్రంధాలను రాసిన శ్రీపాదవారు కృతి కర్తె కాదు. కృతి భర్త కూడా. ప్రజ్ఞా వంతుడు. ప్రతిభావంతుడు.యశస్వి. శ్రీపాదవారి తర్వాత అంతటి కీర్తిప్రతిష్టలు పొందినవాళ్ళు చాలా అరుదుగా వున్నారని చెప్పవచ్చు అసలు హర్షుడు రాసిన నైషధీయ చరితాన్ని, శ్రీనాధుడు రాసిన శృంగార నైషధాన్ని మళ్ళీ రాయాలని సంకల్పించడమే ఓ సాహసం. అయితే ఎక్కడా కూడా మూల గ్రంధాల సహజత్వం పోకుండా చూసారు. అద్భుతంగా నైషద చరితాన్ని అందించిన ఘనత శ్రీపాద వారికే చెల్లిందని చెప్పవచ్చు.ఇక శ్రీపాద వారికి వచ్చిన పతకాలు, వస్తువులు ఆంధ్రాయూనివర్సిటీకి ఇచ్చేశారు.అయితే అందులో కొన్ని మ్యూజియంకి తరలించగా, కొన్ని ఇంకా ఎక్కడ ఉంచారో వెతుకుతున్నారు.

పదబంధ నేర్పరి శ్రీపాద వారు

గోదావరి తీరం,రాజమహేంద్రవరం తాలూకు ప్రశస్తిని చాటిన శ్రీపాదవారు తన రచనలో ఎన్నో కొత్త పదాలు వాడడమే కాదు, ఒకపదం వేస్తే అర్ధం ఎలా మారుతుంది, ఓ పదం తీసేస్తే అర్ధం ఎలా ఉంటుంది వంటి ప్రయోగాలు చేసారని విశ్లేషించారు.'మరందం, మకరందం'వంటి పదాలు అందుకు ఉదాహరణ. సజాతి,విజాతి,విలోమ పదాలతో పదబంధం చేసిన నేర్పరి శ్రీపాద. శివదండకం, సరస్వతి దండకం ఇలా దండకాలను కూడా పొదిగారు.ముఖ్యంగా వసంతరాత్ర వర్ణన, దమయంతి వర్ణన అమోఘం. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఒంటిచేత్తో రామాయణ,మహాభారత, భాగవతాలను అనువదించడమే కాక శతాధిక గ్రంధాలను రాసారు. పద్యం,గద్యం, లలితపదాలు అన్నీ ఆయన రచనలో స్పష్టంగా కనిపిస్తాయి. స్మార్తం,వేదం,శ్రౌతం ఈ మూడు నేర్చుకున్న గొప్ప పాండిత్యం గల శ్రీపాద వారు ఆయన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి ఆధ్వర్యం వహించారు.ఇంటికి వచ్చినవాళ్ళు చివరకు కోర్టుకేసులు వేసినవాళ్లు వచ్చినాసరే ఆతిధ్యం ఇచ్చి అన్నంపెట్టిన మహోన్నత వ్యక్తిత్వం ఈయనిది.

పత్రికా సంపాదకుడిగా

శ్రీ శాస్త్రులుగారు పత్రికాసంపాదకతచే గొంతకీర్తి సంపాదించుకొనిరి. 'కళావతి' యను ముద్రణాలయమును మదరాసులో నెలకొలిపి పిమ్మట దానిని రాజమహేంద్రవరమునకు మార్చి యవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడపిరి. 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో నారంభించిరి. అది యొకయేడు నడచి యాగిపోయినది. వీరి వజ్రాయుధము, మానవసేన, వందేమాతరం అను పత్రికలు నాడు మంచి ప్రచారము లోనికి వచ్చినవి.

మున్సిపల్ మ్యూజియంలో విగ్రహం

రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మ్యూజియం పార్కులో శ్రీపాద వారి విగ్రహాన్ని గతంలోనే ఏర్పాటుచేశారు. దీన్ని ఇంకా సముచిత స్థానంలో పెట్టాలని పలువురు అంటున్నారు.ఇక శ్రీ రామేన ఆదినారాయణకు శ్రీపాద వారంటే ఎనలేని భక్తిప్రపత్తులు వుండేవి. అందుకే శ్రీ ఆదినారాయణ జీవించివున్నంతకాలం శ్రీపాద వారి జయంతికి మేళతాళాలతో ఊరిగింపు నిర్వహించేవారు. శ్రీపాద వారి విగ్రహానికి పూలమాల వేసి భక్త్యంజలి ఘటించేవారు.

సార్ధ శతజయంతి

శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సార్ధ శత జయంత్యుత్సవం (150ఏళ్ళ వేడుక) ఆశ్వియుజ బహుళ షష్టి అక్టోబర్ 21 శుక్రవారం సాయంత్రం త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆధ్వర్యాన నిర్వహించారు. ఉదయం మున్సిపల్ మ్యూజియంలో శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి విగ్రహం దగ్గర శ్రీ రామేన బ్రహ్మం కుటుంబ సభ్యులతో కల్సి శ్రీపాద వారి ప్రపౌత్రుడు శ్రీ కల్లూరి శ్రీరామ్, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు(విశాఖపట్నం) పూజాదికాలు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ శ్రీ వి.విజయరామరాజు హాజరయ్యారు. శ్రీపాద విగ్రహానికి పొష్పాంజలి ఘటించారు. సాయంత్రం గోదావరి గట్టునగల సమితి స్వస్థలంలో ఆత్మీయ పూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు శ్రీ వి.ఎస్.ఎస్.కృష్ణకుమార్ స్వాగతం పలికారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ఆచార్య బేతవోలు రామబ్రహం అధ్యక్షత వహించారు. మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి, ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, సంస్కృత భాషోద్యమ సారధి శ్రీ దోర్బల ప్రభాకర శర్మ అతిధులుగా పాల్గొన్నారు. ఈసందర్బంగా శ్రీ కల్లూరి శ్రీరామ్ రూపొందించిన శ్రీపాద వారి ప్రత్యేక సంచికను ఆచార్య బేతవోలు ఆవిష్కరించారు. నఖచిత్రకారుడు డాక్టర్ రవి పరస గోటితో వేసిన శ్రీపాద వారి చిత్రపటాన్ని ఆచార్య బేతవోలు ఆవిష్కరించారు.

శ్రీ పోతుకూచి సూర్యనారాయణమూర్తి శ్రీ అమరేశం రాజేశ్వర శర్మ, శ్రీ చెబియ్యం వెంకట్రామయ్య, శతావధాని డాక్టర్ అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు, మాజీ ఎం.ఎల్.ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు, ఆదాయపు పన్ను శాఖ అధికారి శ్రీ రామావతారం, వంకలంక రామం, రామేన బ్రహ్మం, ఎర్రాప్రగడ రామకృష్ణ,చాగంటి శరత్ బాబు, పెరుమాళ్ళ రఘునాధ్,అశోక కుమార్ జైన్,ఓ.ఎన్.జి.సి. రిటైర్డ్ అధికారి శ్రీ విజయకుమార్, శ్రీపాద జిత్ మోహన్ మిత్ర, డాక్టర్ తల్లావఝల పతంజలి శాస్త్రి, ఎర్రాప్రగడ ప్రసాద్, నల్లగొండ రవిప్రకాష్, జోరా శర్మ, డాక్టర్ పివి మురళీకృష్ణ,జూపూడి వెంకట రమణారావు,కల్లూరి శ్రీరాములు,నిమ్మలపూడి వీర్రాజు, రత్నం సన్ పెన్వర్క్స్ అధినేత డాక్టర్ కె.వి.రమణమూర్తి దంపతులు,డాక్టర్ పీ.ఎస్.రవికుమార్,గ్రంధి రామచంద్రరావు,పెమ్మరాజు గోపాలకృష్ణ,దినవహి బాపిరాజు, మరాశాస్త్రి, డాక్టర్ ఏ.ఎస్.వి మహాలక్ష్మి, బులుసు వెంకటేశ్వర్లు,సత్యమూర్తి,అజ్జరపు హరిబాబు, ప్రజాపత్రిక సుదర్శన్, దీక్షితుల సుబ్రహమణ్యం,వాడ్రేవు దివాకర్, రామనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే 29న విశాఖలో శ్రీపాద వారి సార్ధ శతజయంతి నిర్వహిస్తారు. [1] [2] [3]

ఈతీరున బత్త్రి కాసంపాదకులై, శతాధిక గ్రంథరచయితలై, భారత బాగవత రామాయణాంధ్రీకర్తలై, కవిరాజులై, కవిసార్వభౌములై, కళాప్రపూర్ణులై, మహామహోపాధ్యాయులై, ఆంధ్రవ్యాసులై, కనకాభిషిక్తులై, పూర్ణపురుషాయుషజీవులై విరాజిల్లుచున్న కృష్ణమూర్తి శాస్త్రిగారి సమగ్రజీవితము వ్రాసినచో మఱియొక మహాభారతము. https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:AndhraRachaitaluVol1.djvu/243

ముఖ్యమైన రచనలు

నాటకాలు

  • కలభాషిణి
  • రాజభక్తి
  • భోజరాజ విజయం
  • శ్రీనాథ కవి రాజీయం

పద్య కావ్యాలు

  • గౌతమీ మహత్యం
  • సత్యనారాయణోపాఖ్యానం
  • గజానన విజయం
  • శ్రీకృష్ణ కవి రాజీయం
  • సావిత్రీ చరిత్రం
  • వేదాద్రి మహాత్మ్యము
  • యజ్ఞవల్క్య చరిత్ర

అచ్చతెలుగు కావ్యాలు

  • బ్రహ్మానందం
  • శాకుంతలం

వచన గ్రంథాలు

  • సంస్కృత కవి జీవితాలు
  • కాళిదాస విలాసము
  • తెనాలి రామకృష్ణ చరిత్రము
  • చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (మొదటి భాగము)
  • చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (రెండవ భాగము)

అనువాదాలు

  • శ్రీకృష్ణ భారతం
  • శ్రీకృష్ణ రామాయణం
  • శ్రీకృష్ణ భాగవతం

జీవితచరిత్ర

ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి అనంతపంతుల రామలింగస్వామి ఈ గ్రంథాన్ని రచించారు.[4] ఇది వజ్రాయుధపత్రిక నుండి 1933 సంవత్సరంలో పునర్ముద్రించబడినది.

బిరుదులు

  • మహామహోపాధ్యాయ
  • కవిసార్వభౌమ
  • కవిరాజు
  • కవిబ్రహ్మ
  • ఆంధ్రవ్యాస
  • అభినవ శ్రీనాథ
  • వేద విద్యా విశారద
  • ప్రసన్న వాల్మీకి
  • కళాప్రపూర్ణ

మూలాలు

  1. https://www.youtube.com/watch?v=k5PlXbIbovU&feature=share
  2. సార్ధక బిరుదాంకితులు పండిత యశస్వి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, http://sarikothasamacharam.com/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%95-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AA%E0%B0%82/
  3. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 150వ జయంతి సాక్షి దినపత్రిక(21.10.16)
  4. భారత డిజిటల్ లైబ్రరీలో శ్రీకృష్ణకవి చరిత్రము పుస్తక ప్రతి.