చీనాబ్ వంతెన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో , → (3) using AWB
-అనాథ మూస
పంక్తి 1: పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}

{{Infobox bridge
{{Infobox bridge
|bridge_name = చీనాబ్ బ్రిడ్జ్
|bridge_name = చీనాబ్ బ్రిడ్జ్

05:48, 27 నవంబరు 2016 నాటి కూర్పు

చీనాబ్ బ్రిడ్జ్
Coordinates33°9′3″N 74°52′59″E / 33.15083°N 74.88306°E / 33.15083; 74.88306
OS grid reference[1]
Carriesకాశ్మీర్ రైల్వే
Crossesబక్కల్ మరియు కౌరి మధ్య చీనాబ్ నదిపై
Characteristics
Designఆర్చి వంతెన
Materialస్టీల్ మరియు కాంక్రీటు
Total length1,263 m (4,144 ft)[1]
Height(నది బెడ్ నుంచి నిర్మాణముకు) 359 m (1,178 ft)[1]
Longest span480 m (1,570 ft)
No. of spans17
Location
పటం

చీనాబ్ వంతెన భారతదేశంలో నిర్మాణంలో ఉన్న ఒక ఆర్చి వంతెన. ఇది జమ్మూ కాశ్మీర్‌ లోని రేసి జిల్లాలో, బక్కల్ మరియు కౌరి మధ్య చీనాబ్ నదిపై సంధానంగా ఉంటుంది. వంతెన పూర్తయినప్పుడు 1,263 మీటర్ల (4,144 అడుగులు) పొడవు, ఆర్చ్ స్పాన్ దూలం 480 మీటర్ల (1,570 అడుగులు) తో, చీనాబ్ నదిపైన 359 మీటర్ల (1,178 అడుగులు) ఎత్తులో మరియు కౌరి వైపు వయాడక్ట్ 650 మీటర్ల (2,130 అడుగులు) పొడవుగా ఉంటుంది. ఈ వంతెన అనేక వంతెనల మరియు సొరంగాల యొక్క భాగం దీనిని జమ్మూ కాశ్మీర్ లోని USBRL ప్రాజెక్ట్ కత్రా-లావోలి విభాగం నిర్మిస్తుంది. ఈ లింక్ లో మరో చిన్న ఆర్చి వంతెన కత్రా మరియు రేసి మధ్య 657 మీటర్ల (2,156 అడుగులు) పొడవుగా, 189 మీటర్ల (620 అడుగులు) ఎత్తుతో అంజి ఖాద్ వంతెన ఉంటుంది. వాస్తవానికి చీనాబ్ బ్రిడ్జ్ డిసెంబర్ 2009 కి పూర్తయ్యేలా నిర్ణయించబడింది. అయితే, సెప్టెంబర్ 2008 లో చీనాబ్ వంతెన యొక్క స్థిరత్వం మరియు భద్రత మీద ఆందోళన చెంది దీనిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వంతెన పని 2010 లో పునఃప్రారంభించబడింది మరియు నిర్మాణము 2015 కి పూర్తికాగలదని ఇది పూర్తయితే చీనాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలో ఎత్తైన రైలు వంతెన అవుతుందని భావిస్తున్నారు.

విశేషాలు

జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నది పై భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్నది. దీనిని చీనాబ్ బ్రిడ్జి ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. సుమారు రూ.552 కోట్ల అంచనా వ్యయంతో కొంకణ్ రైల్వే ఈ వంతెనను నిర్మిస్తున్నది. బారాముల్లా-జమ్మును కలిపే ఈ వంతెన నిర్మాణం పూర్తయితే. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి పడుతున్న ఆరున్నర గంటల సమయం సగానికి తగ్గిపోతుంది. దీని నిర్మాణం పూర్తయ్యేసరికి దీని ఎత్తు 359 మీటర్లకు చేరుతుందని అంచనా. అది ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న ఈఫిల్‌టవర్ కన్నా 35 మీటర్లు ఎక్కువ. 2016 చివరి నాటికల్లా ఈ వంతెన నిర్మాణం పూర్తిచేయాలనే లక్ష్యంతో ఇంజినీర్లు కృషి చేస్తున్నారు. భూకంపాలు, బలమైన ఈదురుగాలులను తట్టుకునేలా దీని నిర్మాణం జరుగుతున్నది. 2002 లోనే దీని నిర్మాణం ప్రారంభమైనా బలమైన ఈదురుగాలులను తట్టుకోగలుగుతుందా? అన్న అనుమానంతో 2008 లో నిర్మాణం నిలిచిపోయింది. ఆ తరువాత రెండేళ్లకు డిజైన్‌పై సందేహాలు వీడడంతో 2010లో నిర్మాణం మళ్లీ మొదలైంది. దీని నిర్మాణానికి 25వేల టన్నుల ఇనుము అవసరమవుతుందని అంచనా. ఇంద్రధనుస్సు (ఆర్క్) ఆకారంలో నిర్మిస్తున్న ఈ వంతెన విడిభాగాలను చీనాబ్ నది పక్కనే తయారుచేసి రెండు కేబుల్ కార్ల సాయంతో వంతెనకు జత చేస్తున్నారు.

మూలాలు

  1. 1.0 1.1 "Salient Features of the Chenab and Anji Khad Bridges" (PDF). Official Webpage of the Konkan Railway Corporation Limited. Retrieved 2008-08-14.

ఇతర లింకులు