"దిగవల్లి వేంకటశివరావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయన తల్లిగారు [[ద్రాక్షారామం]] వాస్తవ్యులు ఆలమూరు సూరయ్య గారి కుమార్తె. శివరావుగారి సతీమణి [[విశాఖపట్టణం]]కు వాస్తవ్యులు బుధ్ధిరాజు మూర్తిరాజు గారి కుమార్తె కమల. శివరావుగారు వృత్తిరీత్యా 1922 నుండీ [[విజయవాడ]]లో ప్రఖ్యాత [[న్యాయవాది]]. అంతేకాక వారు చరిత్ర పరిశోధకుడుగా గ్రంథ కర్తగా ప్రసిధ్ధి.<ref>The National Biography of Indian Literature 1901-1953 సాహిత్య ఎకాడమీ, కొత్తఢిల్లీ, వాల్యూం 4, పేజీలు 251,416,417,419</ref><ref>నా జీవితగాధ-నవ్యాంధ్రము (1959) అయ్యదేవర కాళేశ్వరరావు పేజీ155-159</ref>,<ref>మిత్రులు నేను [[గొర్రెపాటి వెంకట సుబ్బయ్య]] (1970) పేజీ 186-193</ref>, గాంధీ వాది. గాంధీ ప్రవేశపెట్టిన అనే క సత్యాగ్రహ ఉద్యమములో వారి సేవ విశేషమైనది.<ref>[[ఆంధ్రజ్యోతి]] అక్టోబరు10,1966 "నేనెరిగిన శివరావుగారు" [[కాకాని వెంకటరత్నం]]</ref>. జైలుకు వెళ్ళటానికి ఏరోజుకారోజు సంసిధులైయ్యుండికూడా [[బ్రిటిష్]] ప్రభుత్వచేసే అన్యా.యమునుఅన్యాయమును ప్రజలకు కాంగ్రెస్సు కార్యకర్తలకు తెలిసేటట్టు ఉదృతముగా ఆనేక రచనలు కాంగ్రెస్సువాదిగను వ్యక్తిగతముగను చేశారు. నిశతమైన [[న్యాయవాది]]గా వృత్తి రీత్యా వారు ప్రముఖులైనప్పటికి నీ వారు కేవలం వృత్తికే అంకితం అయి ధన సంపాదనే లక్ష్యం చేసు కోలేదు. విద్యార్థిగా చదువుకుంటున్న రోజలనుంచే దేశ చరిత్ర, స్వతంత్ర ఉద్యమాలకు తోట్పడుటకు దోహదం మైన వారి ఉపాధ్యాయుల ప్రసంగాలు, రచనలు, వారి పై ప్రభావం చూపటంవల్లం వారు వృత్తిలో ప్రవేశిస్తూనే ఆకాలంనాటి కాంగ్రెస్సు రాజకీయల్లో పాలుపంచుకుంటూ ఇంకో ప్రక్క ఏమాత్రం సమయం వృధాచేయకుండా వారు సాహిత్యకృషిలో మునిగి తేలుతూవుండేవారుతేలుతూ వుండేవారు. చరిత్రకు సంబంధించి ఇంకా వెలుగు చూడని క్రొత్త విషయాలు చదవాలి వ్రాయాలి అనేది ఆయనకు లక్ష్యంగా వుండేది. అనేక పుస్తాకాలు చదివి చారిత్రాత్మకమైన అనే క అపురూపమైన వ్యాసములు, పుస్తకములు వ్రాశారు.<ref>" ప్రామాణిక చరిత్రకారులు ",అక్కిరాజు రమాపతి రావు ఆంధ్ర ప్రభ ఫిబ్రవరి 15,1988</ref> వారు నీతి నిజాయితీకి మరోపేరు.<ref>ఆంధ్రపత్రిక నవంబరు 9, 1986 "ద్రిషణా ధురంధరుడు" ప్రకాశచంద్ర శతపధి</ref> [[అవినీతి]] ఆటగోడుతనంసహించేవారు కాదు. కల్లాకపటం వారి దరిదాపుల్లోకి రావటానికి సాహచించేవికావు. 1930–1947 మధ్యకాలంలో గాంధీ గారి స్వాతంత్ర్యోద్యమం పిలుపులో వారు సాహిత్య, రాజకీయ, న్యాయవాద పరిజ్ఞానంతో చేసిన కృషి అపారం. [[ఉపన్యాసాలు]] ఇవ్వటం ఉపన్యాసాలకి వెళ్ళ టం వారు అరుదుగా చేశేవారు. స్వాతంత్ర్య సమరయోధులుగా ఎటువంటి గౌరవాలు సన్మానాలు స్వీకరించేవారు కాదు. తను వృత్తిరీత్య న్యాయవాదినని, జైలుకు పోలేదని కారణాలు చెప్పి నిరాకరించేవారు. వినపట్టం కొంచంగా తక్కువ కావటంతోనే 1965 లోనే కోర్టుకు వెళ్లడం మానేశారు. అప్పటికి వారికి చాల పెద్ద పెద్ద కేసులు విచారణకుండేవి. ఆత్మగౌరవం వారికి సంధిపడరాని విషయం. కోర్టు మానేసినప్పటికీ వారి సలహాకోసం కక్షిదారులు వస్తూవుండేవారు. అలాగ వారు న్యాయ సలహాలు ఇస్తూ 1980 దాకా [[విజయవాడ]]లోనే వుండేవారు. వారి సతీమణి కమల 1978 లో పరమదించారు. 1980 లో 83 ఏండ్లు పైబడ్డ తరువారు శివరావుగారు హైదరాబాదులో వారి కుమార్ల వద్ద వుండేవారు. వారు సాహిత్య కృషి మాత్రం మానకుండా జీవితాంతం చదవుతూ వ్రాస్తూ వుండి చివరకు 95 పైబడినతరువాత 03-10-1992 న భోపాలు[[భోపాల్]] నగరంలో “a narrative of the campaign in India which terminated the war with Tippusultan in 1792” అనే పుస్తకం చదువూతూనే వారి కుమారుని వద్ద చివరి శ్వాస వదిలారు. వారి సాహిత్య కృషే వారి జీవిత చరిత్రలో చాల పెద్ద పర్వం. వారు దాదాపుగా 40 పుస్తాకాలు, 400 వ్యాసాలు వాశారు. వారు వ్రాసిన వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రకటితమయ్యేవి అనేక చారిత్రక విషయములు ఎక్కడెక్కడనుంచో త్రవ్వి బహువిధ కృషితో వాటిని తెలుగువారి కోసం సరళమైన తెలుగులో మంచి శైలిలో వెలుగులోకి తీసుకుచ్చారు. శివరావు గారు తన సమకాలికులు, మిత్రుల కంటే దీర్ఘ కాలం జీవించారు వారిజ్ఞాపక శక్తి అపారం. కచ్చితమైన తారీఖులు పేర్లు సంఖ్యలు వారికి కొట్టిన పిండి. వారి చేతివ్రేళ్ళమీద వుండేవి. కట్టల కట్టలుగా వ్రాసుకునియన్న నోట్సుల్లోంచి ఏ విషయంపైన కావలసినా చాల సునాయాసంగా బయటకు తీయగలిగేవారు. మొదటినుంచీ పుస్తకం చదువుతు న్నప్పుడే నోట్సు వ్రాసుకోటం వారికి చిరకాలపు అలవాటు. ఆ విధంగా వారు చరిత్ర పరిశోధన చేసి వ్రాసిపెట్టుకున్నఅనేక నోట్సుల కట్టలు చాలవిలువైన ఖజానాలాంటివి చరిత్రపరిశోధకులకు చాల ఉపయోగ పడగలవి ఇంకా ఉన్నాయి. వారి అముద్రిత గ్రంథములు, వ్యాసములు కూడా చాలవున్నవి. ముఖ్యంగా కథలు గాథలు 5 మరియ 6 భాగములు చాల విలువైనవి. వెంటనే ముద్రింప తగినవి. వారు చేసిన సాహిత్యకృషి వారి పుస్తకాలు వ్యాసాలు చెప్ప గలవు. న్యాయవాది వృత్తి, సాహిత్య కృషి, స్వాతంత్ర్యోద్యమములో జైలుకి వెళ్ళటం అనివార్యమైన స్థితిలో కూడా వారు వివిధరకాలుగా చేసిన కృషి విషేంచి చెప్పదగినవి. వాటిల్లో కొన్ని క్లుప్తంగా
# [[ఆంధ్ర]] [[మద్రాసు]] ప్రావిన్సల పై విపులమైన సమాచారము [[గాంధీ]]గారి హయామ్ లో కాంగ్రెసు అధిష్ఠానానికి పంపిచారు
# స్వాతంత్ర్యోద్యమములో [[కాంగ్రెసు]] కార్యకర్తలకు బోధపడేటట్లు కీలక రాజకీయ విషయములు, ప్రజాప్రభుత్వ విధానములు, బ్రిటిషవారు మనదేశంలో చేస్తున్నపక్షపాతపు పరిపాలన, వారు మనప్రజలను మన దేశ నిధులను ఏవిధంగా దోచుకుంటున్నదీ మొదలగు విషయముల గురించి అనేక కరపత్రములు వ్రాశారు
# ఆంధ్ర ప్రభుత్వమువారు వారి జ్ఞాపకాలను రికార్డు చేసారు. ఆవిధంగా వారు చేసిన కృషి వివరాలు వారి సాహిత్య కృషితో జతపర్చటమైనది.
“Family History and diary of chronological events” అని పేరుతో ఒక పెద్ద డైరీలో 1815 నుండీ వారు తన సొంత విషయాల్తో పాటుగా ఆకాలంనాటి గోదావరి ప్రోవిన్సు, పిఠాపురం జమీందారీ ఎస్తేటు పరిసర ప్రాంతాలకు సంబంధించినవి కూడా వ్రాశారు. ఎందువలనంటే వారి పితామహులైన దిగవల్లి తిమ్మరాజుగారు ఆకాలంలో రాజమండ్రి- [[కాకినాడ]]- పిఠాపురం (ఆనాటి రాజమండ్రీ జిల్లా) లో కంపెనీ ప్రభుత్వము వారి వున్నతో ద్యోగి (1820లోఇంగ్లిషు రికార్డు కీపర్ తరువాత 1850 లో హుజూర్ సిరస్తదారు). వారి పితామహుని కాలం నాటివి గోదావరి జిల్లాకి, [[పిఠాపురం]] జమీందారీకి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు, రెవెన్యూ రికార్డులు నుంచి శివరావు గారు బహుముఖ కృషితో సంపాదించి వ్రాశారు. వారి తండ్రి గారి కాలం 1850 -1908 మరియు తన జీవితకాలం 1898-1992 మధ్య కాలం లోని సంఘటనలు శివరావుగారి డైరీలో వ్రాశారు . 1923 నుండీ 1947 మధ్యకాలంలో కృష్ణాజిల్లాలో ముఖ్యంగా బెజవాడలోగాంధీమహాత్మునిబెజవాడలో గాంధీమహాత్ముని సహాయనిరాకరణోద్యమము ఉప్పు సత్యాగ్రహము మొదలగు స్వాతంత్ర్య పోరాటమునకు సంబంధించన ఉద్యమాల సంఘటనలు చాలా విపులంగా వ్రాసుకున్నారు. ఆంతేకాక తన డైరీలో “Reminiscences” అని పేరుతో వారికి ప్రీతి కరమైన విషయాల పై విశదంగా అనుభవాలు జ్ఞాపకాలు వ్రశారు. ఉదాహరణకు వారి రాజమండ్రీలో 1910 -1916 మధ్య అనుభవాలు, మద్రాసులో 1916 - 1922 ప్రెసిడెన్సీ కాలేజీ, విక్టోర్యా హాస్టలు జ్ఞాపకాలు వ్రాసుకున్నారు. వారి సమకాలీకులు విక్టోర్యా హాస్టలలో నున్న ఇంజనీరింగ్, వైద్య, సాహిత్యము, న్యాయ విభాగపు విద్యార్థులు తెలుగువారు వారి వారి జీవితకాలాంతరమూ శివరావుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు, రాకపోకలు వుండేవి. అటువంటివారి కొందరి పేర్లు చెప్పక తప్పదు: అడవి బాపి రాజు, [[వెలిదండ్ల హనుమంతరావు]] L.M&S, డా. చాగంటి సూర్యనారాయణ MBBS, డా. దండు సుబ్బారెడ్డి M.D, [[యల్లాప్రగడ సుబ్బారావు]] L.M&S.,Ph.D (U.S.A), [[డా గోవిందరాజుల సుబ్బారావు]], [[డా అమంచర్ల శేషాచలపతి రావు]] [[కె యల్ రావు]] (కానూరి లక్ష్మణ రావు) M.Sc., Ph.D. (కేంద్ర మంత్రిగా చేశారు) [[టి. యస్ అవినాశ లింగం]] (మద్రాసు రాష్ట్ర మంత్రి గాచేశారు), [[యమ్. భక్త వత్సలం]] ( మద్రాసు రాష్ట్ర ముఖ్య మంత్రిగా చేశారు ) [[కోకా సుబ్బారావు]] ( భారత ప్రధన న్యాయ మూర్తిగా చేశారు) [[పోతాప్రగడ శ్రీరామారావు]], (తణుకులో న్యాయవాదిగా చేశారు )
 
==వంశ చరిత్ర : పుట్టుపూర్వోత్తరాలు==
2,16,294

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2042855" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ