"సైమన్ కమిషన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
విచారణ సంఘము నియమించుటలోని ఉద్దేశ్యములు: 1919 సంవత్సరములో బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము(చూడు [[మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము]]) విడుదలచేయు సమయములో తదుపరి 10 సంవత్సరముల తరువాత ఇంకయూ రాజ్యాంగసంస్కరణలు చేయవలసిన అవసరమును నిర్ణయించెదమని బ్రిటిష్ పార్లమెంటులో ప్రకటించబడినది. ఆ సమయపరిధి దగ్గరపడుచున్నందున్న 1927 లో సర్ జాన్ సైమన్ అధ్యక్షతక్రింద విచారణ సంఘమును (Simon Commission) నియమించారు. ఆర్భాటముగా వెలువడించబడిన బాహ్యోద్దేశ్యము అదే అయినప్పటికీ భారతదేశము బ్రిటిష్ వారి వలసరాజ్యములలోకల్లా అమూల్యమైన ఆభరణమని ఒక శతాబ్ధపునకు పూర్వమే వారి ప్రతినిధి, వంగరాష్ట్రపు గవర్నర్ [[రాబర్టు క్లైవు]] ద్వారా తెలుసుకునటమేగాక తదుపరి 1905 సంవత్సరములో విజ్ఞానకరముగా అధ్యయనముచేసిన గవర్నర్ జనరల్ (వైస్ రాయి) [[లార్డ్ కర్జన్]] యొక్క పునః ఉద్ఘాటనతో భారతదేశమునకు స్వతంత్ర పరిపాలననిచ్చు అవకాశము కలుగనీయకుండుటకు చేదోడుగా వంతుపలుకెడి విచారణ సంఘమను పేరట ఉపశమనకార్యముగా భారతయుల కన్నీళ్ళ తుడుపుచేయుట అంతఃరోద్దేశ్యము.<br>
 
పూర్వోత్తర సందర్భములు: సైమన్ కమిటీ [[భారతదేశము]] పర్యాటనకు కొద్దిరోజుల మునుపు 1927సంవత్సరమున మద్రాసులో జరిగిన [[కాంగ్రెస్]] మహా సభలో సైమన్ విచారణ సంఘమును '''అనేకవిధములుగా బహిష్కరించవలెనన్న తీర్మానము చేయబడినది'''. 1928 సంవత్సరములోనే '''( సైమన్ కమిటీ వారి పర్యటానంతరము, వారి నివేదిక బహిరంగము కాక మునుపే )''' భారతదేశమునందు '''సర్వపక్ష సమావేశ సభ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన చేసిన తీర్మానము''' ప్రకారము భారతదేశమునకు డొమీనియన్ స్టేటస్ (కెనడా దేశమునకు బ్రిటిష్ సామ్రాజ్యము ప్రసాదించినట్టి డొమీనియన్ స్టేటస్ వంటి) [[ అధినివేశ స్వరాజ్యము]] కావలయునని అపేక్షించబడినది. ఆ తీర్మానము ప్రకారము భారతదేశమునకు సుముఖమైన డొమీనియన్ స్టేటస్ [[రాజ్యాంగము]] చిత్తుప్రతి నిర్మాణించబడినది. సైమన్ విచారణ సంఘములో భారతీయప్రతినిదినిత్వములేదని తెలియగనే మద్రాసులో 1927లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సైమన్ కమీషన్ ను బహిష్కరించవలయునని తీర్మానించబడినది. అటుతరువాత 1928 లో జరిగిన కాంగ్రెస్సుమహాసభలో డొమీనియన్ స్టేటస్ (అధినివేశ స్వరాజ్యము) కనుక ఇవ్వకపోతే సంపూర్ణస్వరాజ్యము స్తాపించెదమని బ్రిటిష్ సామ్రాజ్యప్రబుత్వమునకు ఇంకా తీవ్రమైన అంత్యహెచ్చెరిక (ultimatum) జారీచేయబడినది. 1929 డిసెంబరు 31 వ తేదీ న కాంగ్రెస్సు మహా సభలో బ్రిటిష్ వారితో సంబందము లేకనే సత్యాగ్రహము సాధనముగా సంపూర్ణ స్వాతంత్ర్యము సంపాదింపవలెనని తీర్మానము చేయబడినది. 1930 జనేవరి 26 తేదీన ప్రధమ స్వాతంత్రదినోత్సవము దేశములో అన్ని ఊర్లలో జయప్రదముగా జరుపకొన బడినది. దేశము దాస్యమునకు, దారిద్ర్యమునకు బ్రిటిష్ ప్రభుత్వమే కారణమని కూడా తీర్మానించబడినది. దేశప్రజలకు రాజకీయ హక్కులివ్వక భారతదేశమును బానిస రాజ్యముగా పరిపాలించుచున్న బ్రిటిష ప్రభుత్వమునకు కనీసపు ముఖ్య సంస్కరణలు చేయమని పదకొండింటిని గాంధీజీ ప్రతిపాదించెను. కానీ బ్రిటిష్ ప్రభుత్వము అవిత్రోసిపుచ్చి మరింత కఠినవైఖరి అవలంబించి నిర్బంద, నిషేదములు విధించెను. అట్టి పరిస్తితులలో గాంధీ 1930 మార్చి 12 వ తేదీన ఉప్పు-సత్యాగ్రహము ప్రారంభించి ఏప్రిల్ 6 వతేదీన దండి మార్చి అనబడిన చారిత్రాత్మక ఉప్పు చట్ట తిరస్కారముచేసి శాసనోల్లంఘనమును చేసెను. ఆ సందర్బన యావద్భారతదేశమున కోకొల్లలు గా దేశ ప్రజలు జైలుకు పంపబడిరి. చూడు [[ఉప్పు-సత్యాగ్రహము]]. శాసనసభా సభ్యులనేక ప్రముఖులు రాజీనామా చేసిరి. అందు [[విఠల్భాయివిఠల్ భాయి పటేలు]] (శాసన సభాద్యక్షుడు) తన అధ్యక్షపదవికి రాజీనామా చేసి చెరసాలకేగెను. <ref name="Siva Rao(1938)"> "The British Rule in India" D.v. Siva Rao(1938) ఆంధ్ర ద్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ pp402-408 </ref> <br>
 
==సైమన్ కమిటీలోని సభ్యులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2047927" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ