మంత్రి శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 47: పంక్తి 47:


జాతీయ నాట్య సంఘానికి [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆమె ప్రోత్సాహంతో సిటీ కాలేజి వేదికగా నాటకోత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో ఈ తొలి నాటకోత్సవానికి [[మర్రి చెన్నారెడ్డి]] అధ్యక్షులుగా ఉన్నారు. ఈ నాటకోత్సవంలో [[బెల్లంకొండ రామదాసు]] రాసిన ‘మాష్టార్జీ’ నాటకాన్ని మంత్రి శ్రీనివాసరావు, ఎ.ఆర్.కృష్ణ, తురగా కృష్ణమోహన్‌ రావు, పన్నూరి రామారావు మొదలగువారు ప్రదర్శించారు. దీని తరువాత తెలంగాణలో అనేక నాటకాలు ప్రదర్శితమయ్యాయి.
జాతీయ నాట్య సంఘానికి [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆమె ప్రోత్సాహంతో సిటీ కాలేజి వేదికగా నాటకోత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో ఈ తొలి నాటకోత్సవానికి [[మర్రి చెన్నారెడ్డి]] అధ్యక్షులుగా ఉన్నారు. ఈ నాటకోత్సవంలో [[బెల్లంకొండ రామదాసు]] రాసిన ‘మాష్టార్జీ’ నాటకాన్ని మంత్రి శ్రీనివాసరావు, ఎ.ఆర్.కృష్ణ, తురగా కృష్ణమోహన్‌ రావు, పన్నూరి రామారావు మొదలగువారు ప్రదర్శించారు. దీని తరువాత తెలంగాణలో అనేక నాటకాలు ప్రదర్శితమయ్యాయి.

[[అబ్బూరి రామకృష్ణారావు|అబ్బూరి రామకృష్ణరావు]] నటాలి పేరుతో నెలకొల్పిన నటశిక్షణ సంస్థలో మంత్రి శ్రీనివాసరావు నట శిక్షణ తరగతులు నిర్వహించారు.


== మరణం ==
== మరణం ==

03:30, 2 జనవరి 2017 నాటి కూర్పు

మంత్రి శ్రీనివాసరావు
దస్త్రం:Manthri Srinivasarao.jpg
జననంజనవరి 1, 1928
బచ్చుపల్లి, ఇబ్రహీంపట్నం తాలూకా రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
ప్రసిద్ధిరంగస్థల నటులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖ తొలి శాఖాధిపతి
తండ్రిమంత్రి రామచంద్రరావు
తల్లిరాజ్యలక్ష్మి

మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత ప్రముఖ రంగస్థల నటులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖ తొలి శాఖాధిపతి.[1]

జననం

తెలంగాణ దేశ్‌ ముఖ్‌ల సంతతికి చెందిన మంత్రి శ్రీనివాసరావు 1928 జనవరి 1రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకా కందుకూరు సమీపంలోని బచ్చుపల్లి లో మంత్రి రామచంద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. నిజాం కళాశాల లో విద్యాభ్యాసం చేశారు.

రంగస్థల ప్రస్థానం

1945లో కళాశాలలో చేరిన మంత్రి శ్రీనివాసరావు ఆంగ్ల, తెలుగు నాటకాల్లో నటించడం ప్రారంభించారు. 1946–47లో ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో చెకోవ్‌ ‘ప్రపోజల్‌’ నాటకంతో రంగస్థలం మీద అడుగుపెట్టారు.

అదే సమయంలో అబ్బూరి వరదరాజేశ్వరరావు తో ఏర్పడిన పరిచయం శ్రీనివాసరావులో ప్రపంచ నాటక రంగం వైపు ఆసక్తిని పెంపొందింపజేసింది. ఎ.ఆర్.కృష్ణ తో పరిచయం, సాన్నిహిత్యం 1952లో ఇండియన్‌ నేషనల్‌ థియేటర్‌ స్థాపనకు దారితీసింది.

జాతీయ నాట్య సంఘానికి కమలాదేవి ఛటోపాధ్యాయ అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆమె ప్రోత్సాహంతో సిటీ కాలేజి వేదికగా నాటకోత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో ఈ తొలి నాటకోత్సవానికి మర్రి చెన్నారెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ నాటకోత్సవంలో బెల్లంకొండ రామదాసు రాసిన ‘మాష్టార్జీ’ నాటకాన్ని మంత్రి శ్రీనివాసరావు, ఎ.ఆర్.కృష్ణ, తురగా కృష్ణమోహన్‌ రావు, పన్నూరి రామారావు మొదలగువారు ప్రదర్శించారు. దీని తరువాత తెలంగాణలో అనేక నాటకాలు ప్రదర్శితమయ్యాయి.

అబ్బూరి రామకృష్ణరావు నటాలి పేరుతో నెలకొల్పిన నటశిక్షణ సంస్థలో మంత్రి శ్రీనివాసరావు నట శిక్షణ తరగతులు నిర్వహించారు.

మరణం

1974 అక్టోబర్‌ 9 న తన 46వ యేట అస్వస్థతతో విశాఖలో మరణించారు.

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి. "నవీన నాటక శిల్పి". Retrieved 1 January 2017.