వి6 న్యూస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 53: పంక్తి 53:


'''స్పాట్ లైట్''': సమకాలీన పరిస్థితులపై దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు లోతైన మరియు క్లిష్టమైన విశ్లేషణలు అందించే కార్యక్రమం ఇది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాల గురించిన చర్చలు ఉంటాయి.
'''స్పాట్ లైట్''': సమకాలీన పరిస్థితులపై దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు లోతైన మరియు క్లిష్టమైన విశ్లేషణలు అందించే కార్యక్రమం ఇది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాల గురించిన చర్చలు ఉంటాయి.

'''స్టూడియో డిస్కషన్''': ఇది ఉదయం సాయంత్రం ప్రసారమయ్యే రాజకీయ చర్చ. ఇందులో రాజకీయ పార్టీ నేతలు మరియు విశ్లేషకులు మధ్య చర్చలు జరుగుతాయి.


== పంపిణీ ==
== పంపిణీ ==

10:20, 4 జనవరి 2017 నాటి కూర్పు

వి6 న్యూస్
ఆవిర్భావము మార్చి 1, 2012
యాజమాన్యం వి.ఐ.ఎల్. మీడియా ప్రై.లి
దృశ్య నాణ్యత 4:3, 576ఐ, ఎస్.డి. టివి)
1080ఐ (హెచ్.డి. టివి)
నినాదము ప్రతి దృశ్యం
ప్రజల పక్షం
దేశం భారతదేశం
భాష తెలుగు
ప్రసార ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణ
Availability
Satellite
విజన్ ఆసియా (ఆస్ట్రేలియా)
ఎయిర్ టెల్ డిజిటల్ టివి (భారతదేశం) ఛానల్ 912
విడియోకాన్ డి2హెచ్ (భారతదేశం) ఛానల్ 738
డిష్ టివి (భారతదేశం) ఛానల్ 938
స్కై (యునైటెడ్ కింగ్ డమ్ & ఐర్లాండ్) ఛానల్ 591
డిష్ నెట్ వర్క్ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) ఛానల్ 611
డియాలాగ్ టివి
(శ్రీలంక)
ఛానల్ 4
Cable
విర్జిన్ మీడియా (యునైటెడ్ కింగ్ డమ్) ఛానల్ 621
స్టార్ హబ్ టివి (సింగపూర్) ఛానల్ 162


వి6 న్యూస్ ఛానల్ తెలంగాణ లోని ప్రముఖ వార్తా ఛానల్.[1] ఇందులో 24 గంటలుపాటు వార్తలు ప్రసారం అవుతుంటాయి. భారతదేశం మరియు ఇతర దేశాలలో 120 మిలియన్ తెలుగు ప్రజలను చేరుకోవడమే ఈఛానల్ లక్ష్యం.

చరిత్ర

2012, మార్చి 1న వి.ఐ.ఎల్. ప్రై.లి అనే సంస్థ ద్వారా ఈ ఛానల్ ప్రారంభించబడింది. దీనికి అనుభవజ్ఞ పాత్రికేయుడు అంకం రవి సి.ఈ.ఓ. గా ఉన్నారు. అంతేకాకుండా దీని కార్యకలాపాలలో ప్రసిద్ధ పాత్రికేయులు కూడా ఉన్నారు.[2]

కార్యక్రమాలు

ఇందులో తీన్మార్ వార్తలు, మాటకారి మంగ్లీ, సిన్మా టాకీస్, జనపదం, స్పాట్ లైట్, డెత్ సీక్రెట్స్ వంటి కార్యక్రమాలు ఉంటాయి.

తీన్మార్ వార్తలు: తీన్మార్ వార్తలు అనేది తీన్మార్ సావిత్రి, బిత్తిరి సత్తి లు చేస్తున్న వ్యంగ వార్తల కార్యక్రమం, ఇది ప్రతిరోజు రాత్రి గం 9.30 లకు ప్రసారం అవుతుంది.[3] గతంలో తీన్మార్ వార్తలు కార్యక్రమంలో లో రచ్చ రాములమ్మ, మల్లన్న మరియు తీన్మార్ లచ్చవ్వ వంటి వార్త పాత్రలు ఉండేవి. అతి తక్కువ సమయంలోనే తీన్మార్ వార్తల కార్యక్రమం చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రధానంగా రాజకీయ మరియు పౌర సమస్యలపై దృష్టి సారిస్తుంది. దీనిలో సాధారణ తెలంగాణ యాసను ఉపయోగించి ఒక హాస్య ప్రధానంగా ఉండి, రాజకీయ మరియు ఇతర ప్రముఖులపై కార్యక్రమాలను చేస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాహసోపేత మరియు ఆసక్తికరమైన విషయాలు కూడా చూపిస్తుంది.

స్పాట్ లైట్: సమకాలీన పరిస్థితులపై దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు లోతైన మరియు క్లిష్టమైన విశ్లేషణలు అందించే కార్యక్రమం ఇది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాల గురించిన చర్చలు ఉంటాయి.

స్టూడియో డిస్కషన్: ఇది ఉదయం సాయంత్రం ప్రసారమయ్యే రాజకీయ చర్చ. ఇందులో రాజకీయ పార్టీ నేతలు మరియు విశ్లేషకులు మధ్య చర్చలు జరుగుతాయి.

పంపిణీ

వి6 న్యూస్ ఛానల్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ పంపిణీ మాధ్యమాల ద్వారా ప్రసారం అవుతుంది. అనలాగ్, డిజిటల్ కేబుల్, మొబైల్ మరియు Yupp టీవీ వంటి అన్ని ప్రధాన డిజిటల్ మాధ్యమాలలో వి6 న్యూస్ ఛానల్ ను చూడవచ్చు.

నెంబర్ 1 న్యూస్ ఛానెల్

ఈ ఛానల్ యొక్క వార్తా వెబ్ సైట్ ఇంటర్నెట్ లో నం .1 వార్తా ఛానల్ వెబ్సైట్ గా మారింది.

మూలాలు

  1. తెలుగు టివి ఇన్ఫో. "రెండు రాష్ట్రాల్లో నెం.1 న్యూస్ చానల్ టీవీ9 హైదరాబాద్ లో రెండో స్థానంలో టీ న్యూస్". telugutv.info. Retrieved 3 January 2017.
  2. "V6 News Live". IndianInfo.
  3. సారంగ సాహిత్య వార పత్రిక, చిత్రయాత్ర. "బిత్తిరి సత్తీ, సిమ్మాద్దిరీ". magazine.saarangabooks.com. Retrieved 3 January 2017.

ఇతర లంకెలు