శాసన మండలి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 13: పంక్తి 13:


[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]

[[en:Vidhan Parishad]]
[[en:Vidhan Parishad]]
[[mr:विधान परिषद]]

20:44, 3 నవంబరు 2007 నాటి కూర్పు

భారతదేశం

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం



భారత ప్రభుత్వ పోర్టల్


భారత దేశము యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలో రెండవ సభను శాసనమండలి అంటారు. 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే ప్రస్తుతం శాసనమండలి ఉన్నది. అవి ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు,ఆంధ్ర ప్రదేశ్. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఇది శాశ్వత సభ. అనగా శాసన సభ వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు.

సభ్యుల అర్హతలు

  • శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి.
  • కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి.
  • మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
  • దివాళా తీసి ఉండరాదు.

సభా సభ్యత్వం

శాసన మండలి సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల శాసన సభ్యుల సంఖ్యలో మూడో వంతు కంటే మించరాదు. కానీ సభ్యుల సంఖ్య 40 కి తగ్గరాదు. (జమ్మూ కాశ్మీరు శాసన మండలిలో 32 మంది సభ్యులే ఉండటం చేత ప్రత్యేక పార్లమెంటు చట్టము వలన అనుమతించబడినది). శాసన మండలి సభ్యులలో ఆరోవంతు (1/6) మంది సభ్యులు గవర్నరు చే నియమించబడతారు. వీరు శాస్త్రము, కళలు, సామాజిక సేవ మరియు ఇతర రంగములలో రాణించినవారై ఉంటారు. ఇంకొక మూడోవంతు (1/3) మందిని స్థానిక ప్రభుత్వ సంస్థలు ఎన్నుకుంటాయి. పన్నెండో వంతు (1/12) మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకొంటారు. మరో పన్నెండో వంతు (1/12) మందిని పట్టభద్ర్హులు ఎన్నుకొంటారు.