టీ.జి. కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
32 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''టి.జి.కమలాదేవి''' ([[డిసెంబర్‌ 29]], [[1930]] - [[ఆగస్టు 16]], [[2012]]) (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)<ref>http://www.oldtelugusongs.com/cgi-bin/search/search.pl?scode=p85</ref> అసలు పేరు '''తోట గోవిందమ్మ'''. [[వివాహం]] అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె [[తెలుగు సినిమా]] నటి మరియు [[స్నూకర్]] క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు [[చిత్తూరు నాగయ్య]] భార్య జయమ్మకు [[చెల్లెలు]]. ఈవిడ స్వస్థలం [[కార్వేటినగరం]]. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా [[చూడామణి]]. [[మాయలోకం]] అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. [[అక్కినేని నాగేశ్వరరావు]]తో జోడీగా [[ముగ్గురు మరాఠీలు]] సినిమాలో నటించింది. [[అక్కినేని నాగేశ్వరరావు]] హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. [[పాతాళభైరవి]], [[మల్లీశ్వరి]] (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో[[మల్లీశ్వరి]]లో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. [[తెలుగు]]తో పాటు అనేక [[తమిళం|తమిళ]] సినిమాల్లో కూడా ఈమె నటించింది.
 
కమలాదేవి ఆగస్టు 16, 2012 న చెన్నైలో మరణించింది.
పంక్తి 48:
 
==బహుముఖ ప్రఙ్ఞాశాలి==
రంగస్థలం, చిత్రసీమ, [[ఆకాశవాణి]], క్రీడారంగం వంటి నాలుగు మాధ్యమాల్లో నిలదొక్కుకున్న వ్యక్తి కమాలదేవి. నాటక రంగం ఆమె ప్రధాన వ్యాపకం, అభిమాన రంగం. మద్రాసులో ఉన్న ''చెన్నపురి ఆంధ్రమహాసభ'' కార్యక్రమాల వెనుక ఆమె కార్యదీక్ష, దక్షత, ముందుచూపు ఉన్నాయి. [[1950]]లో ఆ సంస్థలో సభ్యత్వం పొంది [[1956]] నుంచి కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో సేవ చేసింది.
 
===సినిమాలు===
పంక్తి 54:
 
===రంగస్థలం===
కమలాదేవికి చిన్నతనం నుండి రంగస్థలం అంటే ఎంతో అభిమానం. ''సతీసావిత్రి'', ''తులాభారం'', ''కీచక వథ'' వంటి నాటకాలు ఈమెను నటిగా నిలబెట్టాయి. పాఠశాలలోనే ''కనకతార'' వంటి నాటకాల్లో నటిస్తూ బాల కళాకారిణి గుర్తింపు పొందింది. [[లవకుశ]] సినిమా గ్రామఫోను రికార్డు ఈమెకి మంచి పేరు తెచ్చింది. వయసు పెరిగే కొద్దీ ''సావిత్రి'', ''వరూధిని'', ''కీచకవధ'' వంటి నాటకాల్లో ఆడుతూ పాడుతూ నటిస్తూ నటిగా పేరుతో పాటు అనుభవమూ గడించింది. అప్పటి ఆంధ్ర సెక్రటేరియట్ నాటక సమాజం ఆంధ్ర రాష్ట్రంలోనేకాక గుజరాత్, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించిన ''అలెగ్జాండర్'' నాటకంలో కమలాదేవి ''రుక్సానా'' పాత్రను 20 మార్లు నటించి, ఆపాత్రకు జీవాన్ని ఇచ్చింది. [[బళ్ళారి రాఘవ]], [[స్థానం నరసింహారావు]], [[బందా కనకలింగేశ్వరరావు]], [[సి.ఎస్.ఆర్‌]], [[ఎ.వి.సుబ్బారావు]], [[రఘురామయ్య]], [[సూరిబాబు]], [[జగ్గయ్య]] వంటి మహానటుల సరసన కథానాయకిగానో, సహనటిగానో నటించి రంగస్థల చరిత్రలో తన స్థానం పదిలం చేసుకుంది. ''అన్నా చెల్లెలు'', ''రోషనార'', ''కబీరు'', ''నూర్జహాన్'', ''పరివర్తన'' వంటి నాటకాలు ఆమెకు ఆంధ్రలోను, ''కబీరు'', ''నూర్జహాన్'' తమిళనాడులోము[[తమిళనాడు]]లోను మంచి పేరు తెచ్చాయి. ఆంధ్ర మహాసభలో ఎన్నో వందల నాటకాలలో నటించింది. నాటకాలలో ఆమెకు ఒక బంగారు పతకం, 25 వెండి పతకాలు లభించాయి. [[1983]]లో [[కర్నూలు]]లో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఈమెకు '''నాటక కళా ప్రపూర్ణ''' బిరుదు ఇచ్చి సత్కరించింది.
 
===ఆకాశవాణిలో===
ఈమె తొలినుండి [[ఆకాశవాణి]] ఆస్థాన గాయని. [[ప్రయాగ నరసింహశాస్త్రి]] ప్రేరణతో రేడియోలో లలిత సంగీతం, నాటకాలు, నాటికలు, సంగీత రూపకాల్లో పాడుతూ శ్రోతల ప్రశంసలందుకుంది. [[1945]] నుంచే ఆకాశవాణిలో 'ఎ' గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది [[బాలాంత్రపు రజనీకాంతరావు]], [[వింజమూరి అనసూయ]], [[వింజమూరి సీత|సీత]], [[రావుబాల సరస్వతీదేవి]], [[మల్లిక్]], [[టంగుటూరి సూర్యకుమారి]] తదితరులతో కలసి చాలా మార్లు గానం చేసింది. ''[[అనార్కలి]]'' నాటకంలో ఆవుల చంద్రబాబునాయుడు అనే మద్రాసు కార్పొరేషన్ వాటర్ వర్క్స్ విభాగం ఇంజినీరుతో కలసి నటించింది. అలా నటిస్తున్నప్పుడే ఇద్దరి పరిచయం, ప్రణయంగా మారి పరిణయంగా రూపుదాల్చింది. [[1946]] అక్టోబర్ లో ఆయనతో పెళ్ళయిన తరువాత కమలాదేవి సినిమాలకు దూరమైంది. మొదట మాంబళంలో వుండే కమలాదేవి దంపతులు 1947లో షెనాయ్ నగర్ వెళ్ళారు. అప్పటినుంచి కమాలాదేవి అక్కడే ఉంటోంది.
 
===ఆటలు===
1947లో సరదాగా ఆమె [[బిలియర్డ్స్]] నేర్చుకుంది. ఇంకో కథనం ప్రకారం 54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్ ఆడటం ప్రారంభించింది<ref name=manikns>లైవ్ స్పేసెస్ లోని [http://manikns.spaces.live.com/blog/cns!FEA72452726CF2A8!144.entry మనీస్ స్పేస్] అనే ఒక బ్లాగులోని పోస్టు నుండి సేకరించారు. ఈ పోస్టులో కమలా చంద్రబాబు 54 సంవత్సరాలప్పుడు స్నూకర్ ఆడటం ప్రారంభించిందని చెప్పారు. [[జూలై 13]] [[2007]]న సేకరించారు.</ref>. [[1956]]లో [[ఆస్ట్రేలియా]] ఛాంపియన్ బాబ్ మార్షల్ తో [[బెంగళూరు]]లో తలపడింది. ఆ తరువాత అఖిలభారత ఛాంపియన్ సెల్వరాజ్ తో క్వార్టర్ ఫైనల్ లో పోటీపడింది. [[1994]], [[1995]]లలో బెంగళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచింది. తిరిగి 1994లో ఓపెన్ బిలియర్డ్స్, స్నూకర్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిక్చింది. [[జమ్మూ కాశ్మీరు|జమ్మూ]]లో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా ఈమె ఆడింది. [[బిలియర్డ్స్]] ఆడి, విజేత అయిన మొదటి భారత స్త్రీ, కమలాదేవి. బిలియర్డ్స్ ఆటలో [[1991]]లో జెంషెడ్ పూర్ లో, ఆ తరువాత 1995 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలచింది. దాదాపు 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ స్నూకర్ పోటీలలో పాల్గొంటుంది<ref>2006 జనవరి 3 [[హిందూ పత్రిక]]లో [http://www.hindu.com/2006/01/03/stories/2006010312131800.htm స్నూకర్ పోటీలపై వచ్చిన వార్త]. జూలై 13 2007న సేకరించారు.</ref>.
 
===ఇతర విశేషాలు===
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2053325" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ