"యవ్వనం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
12 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎వికాస క్రమం: clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB)
చి
యవ్వనం అనగా కౌమారదశ. యవ్వనంను ఇంగ్లీషులో Adolescence అంటారు.
Adolescence లాటిన్ పదం. లాటిన్ భాషలో Adolescence అనగా పెరుగుట.
ఈ యవ్వన దశలో మానవుడు శారీరకంగా మానసికంగా మార్పు చెందుతాడు. యవ్వన మార్పులు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. దీనంతటికీ శరీరంలో[[శరీరం]]లో హార్మోన్లు అత్యంత కీలకం. మన మెదడులో ఉండే 'హైపోథాలమస్' 'పిట్యూటరీ గ్రంథి'ని నియంత్రిస్తుంటుంది. ఈ పిట్యూటరీ [[గ్రంథి]] శరీరంలోని ఇతర గ్రంథులన్నింటినీ నియంత్రిస్తుంటుంది. యవ్వన మార్పులకు మూలమైన సెక్స్ హార్మోన్లను స్రవించేవి మగపిల్లల్లో వృషణాలు, ఆడపిల్లల్లో అండాశయాలు. వీటిని కూడా పిట్యూటరీ గ్రంథే పర్యవేక్షిస్తుంటుంది. ఇవన్నీ సమన్వయంతో పని చేస్తుంటేనే ఎదుగుదల అంతా సజావుగా సాగుతుంది. ఈ సమన్వయాన్నే 'హైపోథాలమో-పిట్యూటరీ-గొనాడల్ యాక్సిస్' అంటారు. యవ్వన మార్పులు మొదలవ్వటానికి ముందు వరకూ కూడా ఈ ప్రేరణ ప్రక్రియ.. నిద్రాణంగా ఉండిపోతుంది. 'హైపోథాలమస్' మన ఎముకల వయసును ఆధారంగా చేసుకుని.. పాప/బాబు ఒక వయసుకు రాగానే పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపించే కార్యక్రమం ఆరంభిస్తుంది. అది ఆడపిల్లల్లో అండాశయాలను, మగపిల్లల్లో వృషణాలను ప్రేరేపించి.. యవ్వన మార్పులకు శ్రీకారం చుడుతుంది. ఇక మార్పుల పరంపర ఆరంభమవుతుంది. కాబట్టి ఈ పరంపరకు ఎముక వయసు ముఖ్యమని గుర్తించాలి. సాధారణంగా మన వయసు, [[ఎముక]] వయసు.. ఒకే తీరుగా ఉంటాయి. కానీ ఏదైనా కారణాన- ఒక పిల్లవాడికి సాధారణ వయసు 10 ఏళ్లు ఉండి, ఎముకలను బట్టి ఎక్స్‌రేల్లో మాత్రం 8 ఏళ్లే ఉందనుకుందాం.. అప్పుడు హైపోథాలమస్ ఎముక వయసునే గుర్తిస్తుంది. దాని ఆధారంగానే యవ్వన మార్పులు మొదలవుతాయి. ఎముక వయసు ఎప్పుడు అదనుకు వస్తే అప్పుడే యవ్వన మార్పులు మొదలవుతాయి.
 
యవ్వన మార్పుల్లో ప్రధానంగా- మొత్తం మార్పులకు శ్రీకారం చుట్టే హైపోథాలమస్ స్రవించే గొనడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్(జీఎన్ఆర్‌హెచ్), అండాలు/శుక్రకణాల కుదుళ్లను, హార్మోన్ ఉత్పాదక కణాలను ప్రేరేపించే 'ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్(ఎఫ్ఎస్‌హెచ్), లూటినైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్) కీలక పాత్ర పోషిస్తాయి. ఎఫ్ఎస్‌హెచ్ వల్ల మగపిల్లల్లో వృషణాల సైజు పెరుగుతుంది, శుక్రకణాలు పెరుగుతాయి. వృషణాల్లో ప్రధానంగా రెండు రకాల కణాలుంటాయి. ఒకటి- జెర్మ్ సెల్స్. ఇవి శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. రెండు- లిడిగ్ కణాలు. ఇవి పురుష హార్మోనైన టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని ప్రేరేపించే పాత్ర ఎల్‌హెచ్‌ది. వీటి మధ్య చక్కటి సమన్వయం ఉంటుంది. ఆడపిల్లల్లోనూ దాదాపుగా ఇదే క్రమం కొనసాగుతుంది. ఆడ, మగ పిల్లలిద్దరిలోనూ యవ్వన మార్పులకు ముందు అంతా ఎఫ్ఎస్‌హెచ్ ప్రధాన పాత్ర పోషిస్తే ఆ తర్వాత ఎల్‌హెచ్ ప్రధానంగా ఉంటుంది. అందుకే యవ్వన మార్పులకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పడు వైద్యులు ప్రధానంగా జీఎన్ఆర్‌హెచ్, ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ పరీక్షలు చేయిస్తారు.
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2058265" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ