గోల్డెన్ త్రెషోల్డ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ప్రస్తుత చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, నవంబర్ → నవంబరు using AWB
పంక్తి 6: పంక్తి 6:


==ప్రస్తుత చరిత్ర==
==ప్రస్తుత చరిత్ర==
గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం [[హైదరాబాదు విశ్వవిద్యాలయము|హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] వారి ఆధీనంలో ఉంది.<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-04-22/hyderabad/31382402_1_intach-heritage-property-heritage-monument</ref> 1975 నవంబర్ 17న అప్పటి ప్రధాని [[ఇందిరాగాంధి]] గారు... [[పద్మజా నాయుడు]] గారి ప్రోత్సాహంతో దీనిని జాతికి అంకితమిచ్చారు. [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] ఈ ప్రాంగణంలోనే ప్రారంభించబడింది. దీనిని గుర్తిస్తూ హైదరాబాదు విశ్వవిద్యాలయము వారు తదనంతరం సరోజినీ నాయుడు గారి పేరిట 1988లో '''సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్మూనికేషన్''' ను గోల్డెన్ త్రెషోల్డ్ లో ప్రారంభించారు. ఆగష్టు 2012 నుండి [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)|థియేటర్ ఔట్రీచ్ యూనిట్]]‌ని నడుపుతున్నారు.
గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం [[హైదరాబాదు విశ్వవిద్యాలయము|హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] వారి ఆధీనంలో ఉంది.<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-04-22/hyderabad/31382402_1_intach-heritage-property-heritage-monument</ref> 1975 నవంబరు 17న అప్పటి ప్రధాని [[ఇందిరాగాంధి]] గారు... [[పద్మజా నాయుడు]] గారి ప్రోత్సాహంతో దీనిని జాతికి అంకితమిచ్చారు. [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] ఈ ప్రాంగణంలోనే ప్రారంభించబడింది. దీనిని గుర్తిస్తూ హైదరాబాదు విశ్వవిద్యాలయము వారు తదనంతరం సరోజినీ నాయుడు గారి పేరిట 1988లో '''సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్మూనికేషన్''' ను గోల్డెన్ త్రెషోల్డ్ లో ప్రారంభించారు. ఆగస్టు 2012 నుండి [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)|థియేటర్ ఔట్రీచ్ యూనిట్]]‌ని నడుపుతున్నారు.


== మూలాలు ==
== మూలాలు ==

03:27, 23 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

గోల్డెన్ త్రెషోల్డ్

గోల్డెన్ త్రెషోల్డ్ అనే భవనం శ్రీమతి సరోజినీ నాయుడు నివాస గృహం. హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో ఉన్న ఈ చారిత్రాత్మక బంగళాలో సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ్ చటోపాథ్యాయ నివాసముండేవారు. అఘోరనాథ్ చటోపాధ్యాయ అప్పటి హైదరబాద్ కాలేజి (ప్రస్తుతం నిజాం కాలేజి) కి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఈ బంగళాని సరోజినీ నాయుడు తదనంతరం ఆమె ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్ గా పేరు మార్చి గుర్తించసాగారు.

వివాహం, విద్య, మహిళా సాధికారత, సాహిత్యం మరియు జాతీయవాదం వంటి ఎన్నో సంఘ సంస్కరణ భావాలకు, హైదరాబాదులో ఈ గృహం, కేంద్ర బిందువుగా ఉండేది. ఈ విశాల ప్రాంగణం ఛటోపాధ్యాయ కుటుంబం యొక్క ఎంతో మంది క్రియాశీలక సభ్యులకు నివాస స్థానం. గోల్డెన్ త్రెషోల్డ్ లో సరోజినీ నాయుడు మాత్రమే కాకుండా, ఇంగ్లాండు సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ వీరుడు బీరేంద్రనాథ్, కవి నటుడు మరియు సంగీత నృత్య కళాకారుడైన హరీంద్రనాథ్, నటి మరియు నర్తకి సునాలిని దేవి, కమ్యూనిస్ట్ నాయకురాలు సుహాసిని దేవి నివాసమున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ కూడా గోల్డెన్ త్రెషోల్డ్ కు వచ్చినట్టు, ఆ సందర్భంలో ఒక ఆసుపత్రికి పునాది వేసినట్టు, ఒక మొక్కను నాటినట్టు ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. గాంధీజీ గారు పునాది వేసిన ఆసుపత్రిని గోపాల్ క్లినిక్ అని ఇప్పటికీ సంభోదిస్తారు. పునాది వేసిన తేది ఈ బంగాళా శిలాఫలకంపై కనిపిస్తాయి.

ప్రస్తుత చరిత్ర

గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారి ఆధీనంలో ఉంది.[1] 1975 నవంబరు 17న అప్పటి ప్రధాని ఇందిరాగాంధి గారు... పద్మజా నాయుడు గారి ప్రోత్సాహంతో దీనిని జాతికి అంకితమిచ్చారు. హైదరాబాదు విశ్వవిద్యాలయము ఈ ప్రాంగణంలోనే ప్రారంభించబడింది. దీనిని గుర్తిస్తూ హైదరాబాదు విశ్వవిద్యాలయము వారు తదనంతరం సరోజినీ నాయుడు గారి పేరిట 1988లో సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్మూనికేషన్ ను గోల్డెన్ త్రెషోల్డ్ లో ప్రారంభించారు. ఆగస్టు 2012 నుండి థియేటర్ ఔట్రీచ్ యూనిట్‌ని నడుపుతున్నారు.

మూలాలు

చిత్రమాలిక

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ఇతర లంకెలు