ఆడవారి మాటలకు అర్థాలే వేరులే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 51: పంక్తి 51:
[[వర్గం:నంది ఉత్తమ విజయవంతమైన చిత్రాలు]]
[[వర్గం:నంది ఉత్తమ విజయవంతమైన చిత్రాలు]]
[[వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు]]
[[వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు]]
[[వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు]]

18:01, 15 మే 2017 నాటి కూర్పు

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీ రాఘవ
నిర్మాణం ఎన్‌.వి.ప్రసాద్‌, శానం నాగ అశోక్‌కుమార్‌
కథ శ్రీ రాఘవ
చిత్రానువాదం శ్రీ రాఘవ
తారాగణం వెంకటేష్, త్రిష, కె.విశ్వనాథ్‌, శ్రీరామ్‌, సునీల్‌, సుమన్‌శెట్టి, వినయప్రసాద్‌, మేఘనా నాయుడు, జీవా, ప్రసాద్‌బాబు, అనంత్‌, స్వాతి
సంగీతం యువన్‌ శంకర్‌ రాజా
సంభాషణలు రమేష్ గోపి
ఛాయాగ్రహణం బాల మురుగన్
నిర్మాణ సంస్థ శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ 27 ఏప్రిల్, 2007
భాష తెలుగు

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,వెంకటేష్ కథానాయకుడుగా 2007లో విడుదలైనది. ఈ సినిమా పేరు ప్రఖ్యాత పాత సినిమా మిస్సమ్మలోని ఒక పాట చరణం నుండి తీసుకొన్నారు. 267 థియేటర్లలో (కర్ణాటకలో 15, ఒరిస్సాలో3, విదేశాలలో 21 హాళ్ళతో కలిపి) విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.[1] బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్లు వసూలు చేసింది.[2]. 200 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. 21 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.[3]

కథాగమనం

మధ్య తరగతి యువకుడు గణేష్‌ (వెంకటేష్‌) జీవితానికి సంబంధించిన కథ ఇది. ఉద్యోగం లేకుండా నిరుద్యోగిగా తిరుగుతూ అందరికీ చులకనవుతూ తండ్రి (కోట శ్రీనివాసరావు) తో కూడా తిట్లు తింటూ ఉండే గణేష్ అనే యువకుడు కీర్తి (త్రిషా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె సాప్టువేర్ కంపెనీలో పని చేస్తుందని తెలుసుకొని ఆ కంపెనేలో ఉద్యోగానికి ప్రయత్నిస్తాడు. అక్కడ ఆమెకు తన ప్రేమను తెలియచేయగా ఆమె తన పెళ్ళి మరొక నెలరోజుల్లో వేరే వాళ్ళతో అని చెప్తుంది. గణేష్ బాధ పడటం చూసి అతని తండ్రి వెళ్ళి కీర్తిని అడుగుతాడు తన కొడుకుని పెళ్ళి చేసుకోమని. ఆ సందర్భంలో అయనపై అనుకోకుండా చేయి చేసుకుంటుంది కీర్తి. ఆ బాధలో అదే రాత్రి గుండె పోటుతో ఆయన మరణిస్తాడు. ఇంట్లో బాధపడుతున్న గణేషును తనతో తన ఊరు రమ్మని తీసుకెళతాడు గణేష్ స్నేహితుడు శ్రీరాం. అక్కడ అతనికి తెలుస్తుంది కీర్తి పెళ్ళి చేసుకోబోయేది శ్రీరాంనేనని. తరువాత జరిగే కొన్ని సన్నివేశాలతో కీర్తి గణేష్ను ప్రేమించుట మొదలెడుతుంది. అటుపై ఇంట్లో అందరికీ తెలియడంతో గణేష్ను అపార్ధం చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళగొడతారు. ఆ కుటుంబానికి సంభందించిన ఒక విషయంలో గణేషును వేరే వాళ్ళు పొడిచేయడంతో అతడిని హాస్పిటల్లో చేరుస్తారు. విషయం తెలిసిన కీర్తి కుటుంబం మొత్తం ఒకరొకరుగా అతడిని చూసేందుకు వస్తారు. కొద్ది రోజుల తరువాత కీర్తిని అతడికే ఇచ్చి పెళ్ళి చేసేయడంతో కథ సుఖాంతం అవుతుంది.

చిత్ర విశేషాలు

యువన్ శంకర్ రాజా సంగీతం ఆడియోపరంగా మంచి విజయం సాదించింది.. చిత్రంలో చిత్రణ బాగుంది. భారీ బంధుగణం, పెద్ద లోగిళ్ళు, పల్లె అందాలు లాంటి వాటిని బాగా చూపించారు.

నటీనటులు

ఈ సినిమాలో వెంకటేష్ నటనకు గాను నంది అవార్డ్ వరించింది. చిన్నపాత్ర అయినప్పటికీ కథా మూలమైన పాత్రలో కోట శ్రీనివాసరావు మంచి నటన కనబరచారు.

పాటలు

ఇందులోని ఆరు పాటలకు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చాడు.

  • చెలి చమక్కు -అదనాన్ సామి, (వివా బాండ్) అనుష్క మంచందాని, శ్వేత
  • అల్లంత దూరాల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • నా మనసుకి - కార్తీక్, గాయత్రి అయ్యర్
  • ఓ బేబీ - హరిహరన్, భార్గవి పిళ్లై
  • మనసా మన్నించమ్మా - కార్తీక్
  • ఏమైంది ఈ వేళ - ఉదిత్ నారాయణ్

విశేషాలు

  • ఈ చిత్రాన్ని తమిళంలో యారడీ నీ మోగినీ (ఎవ్వరే నువు మోహినీ) గా రీ-మేక్ చేశారు. ధనుష్, నయనతార నటించారు.

మూలాలు

బయటి లింకులు