"సురవరం ప్రతాపరెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
 
==జీవిత విశేషాలు ==
సురవరం ప్రతాపరెడ్డి [[1896]] [[మే 28]] న [[మహబూబ్ నగర్]] జిల్లాలోని [[ఇటిక్యాలపాడు]]లో జన్మించాడు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనం లోనే మరణించారు. ఆయన చిన్నాన్న రామక్రిష్ణారెడ్డి ఎబియం మిషనరీ పాఠశాలలో ప్రాధమిక విద్యను హైదరాబాద్‌ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్‌, మద్రాస్‌ ప్రెసిడెన్సీ మరదలు పద్మావతిని 1916లో వివాహం చేసుకున్నారు. సంతానం పదిమందికాగా, ఇద్దరు కుమారులు విగతజీవులు. నలుగురు కుమారులు, నలుగురుపుత్రికల సంతానం. సురవరం ప్రతాపరెడ్డి తన చదువు పూర్తికాగానే హైదరాబాద్‌ కొత్వాల్‌గా వున్న రాజబహదుర్‌ వేంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్‌కు ఆయన కోరికపై వచ్చారు. ఇక్కడ ఆయన పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్‌ నిర్వహణను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దారు. నాటి నైవాసిక విద్యార్థులలో దేశభక్తి బీజాలను నాటారు. 1924 ప్రాంతంలో ఈహాస్టల్‌ వదాన్యుల సహకారంతో స్థాపించబడింది. ఆ విధంగా హైదరాబాద్‌లో రెడ్డి సాంఘీక సేవా జీవితం పునాదులు వేసింది. మద్రాస్‌ కళాశాలలో చదువుతున్న ప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం ఆయనపై పడింది. నిజాం రాష్ట్రాంధ్ర దుస్థితి రూపురేఖలను మార్చాలన్న తపన ఆనాటి నుండే సురవరం మనస్సులో నాటుకొని పోయింది. హాస్టల్‌ కార్యదర్శిగా వచ్చాక, వేయి గ్రంథాలున్న హాస్టల్‌ లైబ్రరరీని 11వేల గ్రంథాల వరకు పెంచి, విద్యార్థులలో భాషాభివృద్ధికి కృషి చేశారు. [[చెన్నై|మద్రాసు]] ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించిండు. మంచి [[పండితుడు]]. [[1926]]లో ఆయన నెలకొల్పిన ''[[గోలకొండ పత్రిక]]'' తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. [[గోలకొండ పత్రిక]] సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టిండు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.
 
తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో ''గోలకొండ కవుల సంచిక'' అనే సంకలనాన్ని [[1934]]లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. [[1942]]లో [[ఆంధ్ర గ్రంథాలయ మహాసభ]]కు అధ్యక్షత వహించాడు. [[1943]]లో [[ఖమ్మం]]లో జరిగిన గ్రంథాలయ మహాసభకు, [[1944]]లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2120836" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ