తెలంగాణ విముక్తి పోరాట కథలు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
22 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
{{సమాచారపెట్టె పుస్తకం|name=తెలంగాణా విముక్తి పోరాట కథలు|editor=[[వాసిరెడ్డి నవీన్]]|author=[[అడ్లూరి అయోధ్యరామకవి]], [[వట్టికోట ఆళ్వారుస్వామి]], వేనేపల్లి ఆంజనేయులు,
కిరణ్, [[సి.వి.కృష్ణారావు]],[[నెల్లూరి కేశవస్వామి]],
పి.కె.ఆర్.శాస్త్రి,[[కాంచనపల్లి చిన వెంకటరామారావు|కె.వి.రామారావు]],[[పర్చా దుర్గాప్రసాదరావు|పి.డి.ప్రసాదరావు]],
[[పి.వి.నరసింహారావు]],[[రాంషా]],[[పొట్లపల్లి రామారావు]],
[[భీమిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]],[[ఉప్పల లక్ష్మణరావు]],[[లక్ష్మీకాంత మోహన్]],
ఎం.వెంకటరావు,[[గంగినేని వెంకటేశ్వరరావు]],పి.వెంకటేశ్వరరావు,
[[తుమ్మల వెంకటరామయ్య]], [[శారద యస్. నటరాజన్|శారద (ఎస్.నటరాజన్)]], [[తెన్నేటి సూరి]]|publisher=[[డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్]]|release_date=సెప్టెంబరు, [[2008]]|pages=240|isbn=978-0-9766514-1-6|subject=కథాసంకలనం|country=[[భారత దేశము ]]|language=[[తెలుగు]]|price=రూ.65| illustrator = [[చిత్తప్రసాద్]], మోహన్, చంద్ర | cover_artist = అన్వర్

తెలంగాణా విముక్తి పోరాట కథలు ప్రముఖ కథావిమర్శకుడు [[వాసిరెడ్డి నవీన్]] సంపాదకత్వంలో ప్రచురితమైన కథాసంకలనం. 1940 దశకంలో [[నిజాం]] రాజ్యానికి వ్యతిరేకంగా చెలరేగిన తెలంగాణా విముక్తి పోరాటం(దీనికి [[తెలంగాణా సాయుధ పోరాటం]] వంటి ఇతర పేర్లూ ఉన్నాయి) వస్తువుగా పలువురు రచయితలు రాసిన కథలను ఈ పుస్తకంగా సంకలనం చేశారు.
== రచన నేపథ్యం ==
తెలంగాణా విముక్తి పోరాట [[కథలు]] సంకలనంలోని పలు కథలు [[1945]] నుంచి [[1973]] వరకూ ప్రచురితమైన తెలంగాణా సాయుధ పోరాటాన్ని వస్తువుగా స్వీకరించిన కథలు. ఈ సంకలనంలో[[సంకలనం]]<nowiki/>లో చేరిన 32 కథలను 23మంది రచయితలు రాశారు. ప్రముఖ కథావిమర్శకుడు వాసిరెడ్డి నవీన్ వివిధ పత్రికల్లో, పలు సంకలనాల్లో ప్రచురింపబడిన ఈ కథలను ఏర్చికూర్చి 2008లో ప్రచురించారు. డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ ఈ పుస్తకానికి ప్రచురణకర్తగా వ్యవహరించింది. 1981లో [[ప్రజాసాహితి]] పత్రిక ప్రత్యేకసంచిక సంపాదకునిగా వ్యవహరించిన కాలంలో నవీన్ తెలంగాణా రైతాంగ సాయుధ ప్రత్యేక సంచికగా తీర్చిదిద్దారు. ఆ క్రమంలో సేకరించిన పోరాట కథలను చారిత్రిక నేపథ్యంతో కలిపి '''తెలంగాణా పోరాట కథలు''' సంకలనంగా నవీన్ సంపాదకత్వంలో వెలువరించారు. అనంతర కాలంలో సేకరించిన మరిన్ని కథలతో ఇంకా సమగ్రంగా ఈ పుస్తకాన్ని వెలువరించారు.<ref>తెలంగాణా విముక్తి పోరాట కథలు(పుస్తకం):సంపాదకుని ముందుమాట:వాసిరెడ్డి నవీన్:పే.5-7</ref>
== రూపకల్పన ==
తెలంగాణా విముక్తి పోరాట కథలు సంకలనాన్ని పోరాట కథలతో పాటు సాయుధ పోరాటాన్ని ప్రతిబింబించిన ఆనాటి చిత్రాలు, ఛాయాచిత్రాలు జతచేశారు. [[తెలంగాణా సాయుధ పోరాటంతోపోరాటం]]<nowiki/>తో అవినాభావ సంబంధాన్ని కలిగిన [[బెంగాలీ]] చిత్రకారుడు చిత్తప్రసాద్ పోరాటాన్ని చిత్రీకరిస్తూ వేసిన చిత్రాలు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ సునీల్ జెనా ఆ సమయంలో నైజాంలో విస్తృతంగా తీసిన ఫోటోలు సంకలనంలో ఉపయోగించారు. తెలంగాణా పోరాటాన్ని నేపథ్యంగా స్వీకరించి తీసిన సినిమా [[మా భూమి]] స్టిల్స్‌ని, ప్రముఖ చిత్రకారులు చంద్ర, మోహన్‌లు వివిధ సందర్భాల్లో గీసిన బొమ్మలను కూడా వాడారు.
== కథల వివరాలు ==
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రచురితమైన కథలు ఎక్కువ సంఖ్యలో, అనంతర కాలంలో ప్రచురితమైనవి కొద్ది సంఖ్యలో ఈ సంకలనంలో చేరాయి. 1945లో వెలువడ్డ [[వట్టికోట ఆళ్వారుస్వామి]] '''చిన్నప్పుడే''', [[పొట్లపల్లి రామారావు]] '''న్యాయం''' కథలు, 1946లో ప్రచురితమైన కథల్లో వేనేపల్లి ఆంజనేయులు రచించిన '''పాడియావు''', ఆవుల పిచ్చయ్య రాసిన '''ఊరేగింపులు''', '''దౌరా''', పి.వెంకటేశ్వరరావు రచన చేసిన '''రహీంభాయి''', '''అదిపంట కాదా''' కథలు సంకలనంలో చేరాయి. 1947లో పర్చా దుర్గాప్రసాదరావు రచించిన '''పన్నులు ఇవ్వం''', 1948లో ప్రచురితమైన [[ప్రయాగ కోదండరామశాస్త్రి]] రాసిన '''నవజాగృతి''', [[పి.వి.నరసింహారావు]] రచించిన '''గొల్ల రామవ్వ''', [[అట్లూరి పిచ్చేశ్వరరావు]] '''విముక్తి''', [[రాంషా]] '''మత్తానయ్య మరణం''', లక్ష్మీకాంతమోహన్ '''మహాశక్తి''', ఎం.వెంకటరావు '''జీవకార్యుణ్యచర్య''', [[తుమ్మల వెంకటరామయ్య]] రాసిన '''మీరు గెలుస్తారు''', '''పెళ్ళి చేశారు''', [[శారద(ఎస్.నటరాజన్)]] రచించిన '''కొత్త వార్త''', '''గెరిల్లా గోవిందు''', [[తెన్నేటి సూరి]] '''సంధిలేదు''' కథలు ఈ సంపుటాల్లో ఉన్నాయి. 1949లో ప్రచురించిన కథల్లో ఎన్.వెంకటేశ్వర్లు రాసిన '''భూతాలు''' కథ, అనంతర కాలంలో ప్రచురితమైన [[నెల్లూరి కేశవస్వామి]] '''యుగాంతం'''(1982), బి.ఎన్.రెడ్డి రాసిన '''ఆయువుపట్టు''', [[వుప్పల లక్ష్మణరావు]] రాసిన '''గెరిల్లా'''(1975) కథలు సంకలనంలో చోటుచేసుకున్నాయి.

== మూలాలు ==
1,96,471

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2132581" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ