"ఏ.వి.సుబ్బారావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
[[పద్యం]] కమ్మగా పాడేవాడు. వింటున్నవారు అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు. [[ముక్కామల రాఘవయ్య]], [[వల్లూరి వెంకట్రామయ్య చౌదరి]], [[ కుప్పా సూర్యనారాయణ]], [[వేమూరి సీతారామశాస్త్రి]], [[గుళ్లపల్లి ఆదిశేషయ్య]], హార్మోనిస్టు [[విష్ణుబొట్ల వెంకటేశ్వర్లు]] ఇతన్ని తీర్చిదిద్దారు.
 
[[శ్రీకృష్ణ రాయబారం]], [[ గయోపాఖ్యానం]], [[కురుక్షేత్రం]], [[శ్రీకృష్ణ తులాభారం]], [[రామాంజనేయయుద్ధం]], [[చింతామణి]] వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు. [[జంధ్యాల పాపయ్యశాస్త్రి]] ''[[గానకోకిల]]'' బిరుదుతో సత్కరించారు. ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి. ఆయన కుమారులు ముగ్గురు ([[ఆరాధ్యుల కోటేశ్వరరావు]], [[ఆరాధ్యుల వెంకటేశ్వరరావు]]) రంగస్థల నటులుగానే జీవితాన్ని సాగిస్తున్నారు. సుబ్బారావుకు ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సుబ్బారావు పెద్దగా చదువుకోలేదు. పొలం పనులకు వెళుతుండేవాడు. 1960లో సుబ్బారావు శ్రీ పూర్ణశ్రీ నాట్యకళాసమితిని స్థాపించి 30 ఏళ్లపాటు నాటక ప్రదర్శనలిచ్చారు. [[ఈలపాట రఘురామయ్య]], [[పీసపాటి నరసింహమూర్తి]], [[షణ్ముఖి ఆంజనేయ రాజు]] వంటి హేమాహేమీలతో శ్రీకృష్ణుడి పాత్రను ఒకే వేదికపై పంచుకున్నారు. శ్రీకృష్ణుడిగా ఆయన నటనకు గుంటూరు డ్రస్ కంపెనీ అధినేత వెండి కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. గయోపాఖ్యానంలో ఆయన వేసిన కృష్ణ పాత్రను, [[రామాంజనేయ యుద్ధం]]లో రామ పాత్రను, రాయబారంలో శ్రీ కృష్ణుని పాత్రను [[హెచ్ఎంవి]] గ్రామఫోను కంపెనీ రికార్డు చేసింది. [[భూలోకంలో యమలోకం]], [[ముత్యాల పల్లకి]] సినిమాలలో ప్లేబ్యాక్ పద్యాలు పాడారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2165813" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ