"అనూరుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
46 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
[[File:Surya in his chariot.jpg|thumb|సూర్యుని రథం నడుపుతున్న అనూరుడు.]]
'''[[అనూరుడు]]''' అంటే ఊరువులు (అంటే [[తొడ]]లు) లేనివాడు అని అర్థం. ఇతడు కాళ్ళు, [[తొడలు]] లేకుండా పుట్టడం వల్ల అనూరుడనే పేరు వచ్చింది. అనూరునికే [[అరుణుడు]] (ఎర్రని వాడు) అని కూడా ఇంకొక పేరు ఉంది. ఇతడి తండ్రి [[కశ్యపుడు|కశ్యప ప్రజాపతి]], తల్లి [[వినత]]. ఈమె సవతి [[కద్రువ]]. వినత, కద్రువ [[నెలలు]] నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవించారు. [[వినత]]కు రెండు గుడ్లు పుట్టాయి. కద్రువ కన్న గుడ్లు సకాలంలో పగిలి [[పిల్లలు]] బయటకు వచ్చారు. వాళ్ళే [[నాగ]] సంతతి. ఇక ఎంతకాలం గడిచినా వినత కన్న గుడ్లు పగలలేదు. లోపల అసలు పిల్లలున్నారో లేదో కూడా తెలియక వినత తల్లడిల్లిపోయింది. ఇంకొకవైపు తన సవతిపిల్లలు కళ్ళముందు తిరుగుతూ ఉంటే ఆమె ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పొడిచి చూసింది. ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని నవయవ్వనుడైన కుమారుడు కనిపించాడు. అతడే అనూరుడు. అతడు తనకు అలాంటి దుస్థితి కలిగించినందుకు [[తల్లి]] మీద కోపించి వెయ్యేళ్ళపాటు సవతి ఐన కద్రువకు [[బానిసత్వం|దాసి]]<nowiki/>గా ఉండమని శపిస్తాడు. "రెండవ గుడ్డులో మహా బలఢ్యుడైన [[గరుత్మంతుడు]] ఉన్నాడని, తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్ద"ని చెప్తాడు. అప్పుడే [[సూర్యుడు]] వచ్చి అనూరుణ్ణి తన సారథిగా చేసుకుంటాడు. అనూరుడికి ఇక ఎప్పటికీ ఆ రథం దిగి నడవవలసిన అవసరం రాదు. తర్వాత కొంతకాలానికి రెండో గుడ్డును పగలగొట్టుకుని వచ్చిన గరుత్మంతుణ్ణి [[విష్ణువు]] తన వాహనంగా చేసుకుంటాడు. [[గరుత్మంతుడు|గరుత్మంతు]]<nowiki/>డినే గరుడుడు అని కూడా అంటారు.
 
అనూరుడి భార్య శ్యేని. రామాయణంలో[[రామాయణము|రామాయణం]]<nowiki/>లో కీలకపాత్ర పోషించిన [[సంపాతి]], [[జటాయువు]]లు వీరి కుమారులు.
 
==ఇవికూడా చూడండి==
1,88,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2181908" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ