లారీ డ్రైవర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 62: పంక్తి 62:
* మావా మంచమెక్కు
* మావా మంచమెక్కు
* కన్నె చిలకా
* కన్నె చిలకా
* బాలయ్య బాలయ్య
* బాలయ్య బాలయ్య
* అబ్బనీ పట్టెంద గట్టిదయ్యో


== మూలాలు ==
== మూలాలు ==

13:16, 13 అక్టోబరు 2017 నాటి కూర్పు

లారీ డ్రైవర్
దర్శకత్వంబి.గోపాల్
నిర్మాతఎస్. జయరామారావు
తారాగణంబాలకృష్ణ ,
విజయశాంతి,
శారద,
జయలలిత (నటి)
ఛాయాగ్రహణంస్వామి
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంబప్పీ లహరి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1990
భాషతెలుగు

లారీ డ్రైవర్ 1990 లో బి. గోపాల్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రధారులు.

కథ

కనకదుర్గ లారీ ట్రాన్స్ పోర్టు యజమాని రంగనాయకులు డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. తన దగ్గర 20 ఏళ్ళుగా పనిచేస్తున్న లారీ డ్రైవరు గురుమూర్తి స్వంతంగా లారీ కొనుక్కుంటాడు. తన యజమానినే దాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళు ఎదగడం చూడలేని రంగనాయకులు పోలీస్ ఎస్. ఐ నేతాజీని లొంగ దీసుకుని గురుమూర్తిని, మరో డ్రైవరును అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేయిస్తాడు. ఆ లారీ డ్రైవర్లకు నాయకుడు బాలమురళి. బాలమురళి ఆ అన్యాయాన్ని చూడలేక నేతాజీ చేతికి సంకెళ్ళు వేసి పోలీస్ స్టేషన్లో పెడతాడు. కిళ్ళీకొట్టు జయమ్మ కొంతకాలం లారీని అద్దెకు తీసుకుని తర్వాత బ్యాంకు లోను సహాయంతో తానే ఒక లారీ కొనుక్కుంటుంది. తనలాగే మిగతా డ్రైవర్లను కూడా లోన్లు ఇమ్మని బ్యాంకు మేనేజరు సుబ్రహ్మణ్యంతో మాట్లాడుతుంది. అందరూ తమ భార్య దగ్గర ఉన్న పుస్తెలతో సహా అమ్మి చింతా చేతిలో పెడతారు. అయితే సుబ్రహ్మణ్యం రంగనాయకులుతో కుమ్ముక్కై డ్రైవర్లిచ్చిన సొమ్మునంతా వారి చేతిలో పోస్తాడు. డ్రైవర్లతో తనకేమీ ఇవ్వలేదని అబద్ధం చెబుతాడు. బాలమురళి వెళ్ళి అతనికి ఎదురు తిరుగుతాడు. అతను తప్పించుకుని పారిపోబోతాడు కానీ బాలమురళి, డ్రైవర్లందరూ కలిసి లాయరు సహాయంతో కేసు పెడతారు. సుబ్రహ్మణ్యం వెళ్ళి రంగనాయకులు సహాయం కోరతాడు. కానీ అతను ఏమీ చేయలేనంటాడు. సుబ్రహ్మణ్యం అప్రూవరుగా మారిపోతానని వెళ్ళిపోతుండగా రంగనాయకులు దగ్గరున్న శీను అతన్ని హత్య చేస్తాడు.

శీను సుబ్రహ్మణ్యం శవాన్ని పూడ్చి పెడుతుండగా కలెక్టరు లలిత, ఆమె పిల్లలు చూస్తారు. శీను వాళ్ళని వెంబడించి లారీతో గుద్ది చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ సమయానికి బాలమురళి వచ్చి ఆమెను పిల్లలను కాపాడతాడు. రంగనాయకులు శీనును అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోమంటాడు. లలిత డ్రైవర్లకు జరిగిన అన్యాయాన్ని విచారిస్తూ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళుతుంది. ఆమె చూసింది సుబ్రహ్మణ్యం శవాన్నే అని గుర్తు పడుతుంది. దీని వెనుక రంగనాయకుల హస్తం కూడా ఉందని తెలుసుకున్న లలిత అతన్ని పిలిచి శీను ఆచూకీ తో పాటు నిజం చెప్పమంటుంది. రంగనాయకులు భయపడి శీనుని దేశం విడిచి పారిపోమని చెబుతాడు. కానీ శీను రంగనాయకులు పాత టైర్లలో దాచిన నల్లధనాన్ని తీసుకుని పారిబోతుంటే బాలమురళి వచ్చి అడ్డుకుంటాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన రంగనాయకుల్ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టిస్తాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన రంగనాయకులు పోలీసు కస్టడీలో ఉన్న శీనును చంపడానికి గుడివాడ రాయుడు అనే రౌడీ తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అందరూ దసరా సంబరాల్లో మునిగి ఉండగా రాయుడు పోలీస్ స్టేషన్లో ఉన్న శీనును హత్య చేస్తాడు. పైగా శీనును పోలీసులే హత్య చేశారని నిరాహార దీక్ష చేయబోతాడు. లలిత వచ్చి ఆ శిబిరం మీద లాఠీ చార్జీ చేయించి రాయుడు అనుచరులందరినీ జైల్లో వేయిస్తుంది. రాయుడు ఆమె మీద పగబట్టి ఆమెను అందరూ చూస్తుండగా చెంపదెబ్బ కొడతాడు. ఇది తట్టుకోలేని బాలమురళి రాయుడి మీద తిరగబడతాడు. పోలీసులు రాయుడుని అరెస్టు చేసి జైల్లో ఉంచుతారు. తన భార్యను అవమానించిన రాయుడిని జైల్లోనే చంపేయడానికి బయలుదేరబోతున్న ఎస్. పి ని లలిత వారిస్తుంది.

తారాగణం

సాంకేతికవర్గం

పాటలు

ఈ సినిమాకు బప్పీలహరి సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశాడు.

  • దసరా వచ్చిందయ్యా
  • రింగు రింగు జాణా
  • మావా మంచమెక్కు
  • కన్నె చిలకా
  • బాలయ్య బాలయ్య
  • అబ్బనీ పట్టెంద గట్టిదయ్యో

మూలాలు