శ్రీమతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
}}
}}


'''శ్రీమతి''' 1966, డిసెంబర్ 9న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=19|edition=కళా ప్రింటర్స్|accessdate=25 July 2017}}</ref>
'''శ్రీమతి''' 1966, డిసెంబర్ 9న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రాలు|publisher=గోటేటి బుక్స్|page=19|edition=కళా ప్రింటర్స్|accessdate=25 July 2017}}</ref>[[శారద]] కథానాయికగా నటించిన తొలి తెలుగు సినిమా ఇది.
==సంక్షిప్త చిత్రకథ==
==సంక్షిప్త చిత్రకథ==
హైదరాబాద్‌లో కాలేజీలో రవి, సరోజ, వెంకట్ చదువుతూ వుంటారు. రవి సాహిత్యాభిరుచి కలవాడు. తల్లి అప్పులు చేసి అవస్థలుపడి అతడిని చదివిస్తూ వుంటుంది. సరోజ లక్షాధికారి పరంధామయ్య ఏకైక పుత్రిక. సరోజ రవిని ప్రేమిస్తే, సరోజ సవతి తల్లి ప్రభావతి సరోజను తన తమ్ముడు శేషుకు ఇచ్చి పెళ్ళి చేయమని భర్తను కోరుతుంది. సరోజ హృదయం తెలుసుకున్న తండ్రి ఆమె వివాహం రవితోనే జరగాలనే నిర్ణయం స్పష్టంగా ప్రకటిస్తాడు.
హైదరాబాద్‌లో కాలేజీలో రవి, సరోజ, వెంకట్ చదువుతూ వుంటారు. రవి సాహిత్యాభిరుచి కలవాడు. తల్లి అప్పులు చేసి అవస్థలుపడి అతడిని చదివిస్తూ వుంటుంది. సరోజ లక్షాధికారి పరంధామయ్య ఏకైక పుత్రిక. సరోజ రవిని ప్రేమిస్తే, సరోజ సవతి తల్లి ప్రభావతి సరోజను తన తమ్ముడు శేషుకు ఇచ్చి పెళ్ళి చేయమని భర్తను కోరుతుంది. సరోజ హృదయం తెలుసుకున్న తండ్రి ఆమె వివాహం రవితోనే జరగాలనే నిర్ణయం స్పష్టంగా ప్రకటిస్తాడు.
పంక్తి 24: పంక్తి 24:


==నటీనటులు==
==నటీనటులు==
* కాంతారావు - రవి
* [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]] - రవి
* శారద - సరోజ
* [[శారద]] - సరోజ
* వాసంతి - పద్మ
* [[వాసంతి]] - పద్మ
* కైకాల సత్యనారాయణ - శేషు
* [[కైకాల సత్యనారాయణ]] - శేషు
* చలం - వెంకట్
* [[చలం (నటుడు)|చలం]] - వెంకట్
* మీనాకుమారి - పాప
* [[మీనాకుమారి (నటి)|మీనాకుమారి]] - పాప
* గీతాంజలి - నర్తకి
* [[గీతాంజలి (నటి)|గీతాంజలి]] - నర్తకి
* అల్లు రామలింగయ్య
* [[అల్లు రామలింగయ్య]]
* పేకేటి శివరాం
* [[పేకేటి శివరాం]]
* నిర్మలమ్మ - రవి తల్లి
* [[నిర్మలమ్మ]] - రవి తల్లి
* కె.వి.ఎస్.శర్మ - పరంధామయ్య
* [[కె.వి.ఎస్.శర్మ]] - పరంధామయ్య
* రామన్న పంతులు - ఏకాంబరం
* [[రామన్న పంతులు]] - ఏకాంబరం
* సూర్యకళ - సరోజ సవతి తల్లి
* [[సూర్యకళ]] - సరోజ సవతి తల్లి


==సాంకేతికవర్గం==
==సాంకేతికవర్గం==
పంక్తి 42: పంక్తి 42:
* స్క్రీన్ ప్లే: విజయారెడ్డి
* స్క్రీన్ ప్లే: విజయారెడ్డి
* దర్శకత్వం: విజయారెడ్డి
* దర్శకత్వం: విజయారెడ్డి
* మాటలు : వీటూరి
* మాటలు : [[వీటూరి]]
* పాటలు : శ్రీశ్రీ, ఆరుద్ర, వీటూరి
* పాటలు : [[శ్రీశ్రీ]], [[ఆరుద్ర]], వీటూరి
* సంగీతం: శ్రీ నిత్యానంద్
* సంగీతం: శ్రీ నిత్యానంద్
* నృత్యం: చిన్ని, సంపత్
* నృత్యం: చిన్ని, సంపత్

00:22, 25 అక్టోబరు 2017 నాటి కూర్పు

శ్రీమతి
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయారెడ్డి
తారాగణం కాంతారావు,
శారద,
చలం,
గీతాంజలి,
వాసంతి
సంగీతం శ్రీ నిత్యానంద్
నిర్మాణ సంస్థ శ్రీనిలయం పిక్చర్స్
భాష తెలుగు

శ్రీమతి 1966, డిసెంబర్ 9న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]శారద కథానాయికగా నటించిన తొలి తెలుగు సినిమా ఇది.

సంక్షిప్త చిత్రకథ

హైదరాబాద్‌లో కాలేజీలో రవి, సరోజ, వెంకట్ చదువుతూ వుంటారు. రవి సాహిత్యాభిరుచి కలవాడు. తల్లి అప్పులు చేసి అవస్థలుపడి అతడిని చదివిస్తూ వుంటుంది. సరోజ లక్షాధికారి పరంధామయ్య ఏకైక పుత్రిక. సరోజ రవిని ప్రేమిస్తే, సరోజ సవతి తల్లి ప్రభావతి సరోజను తన తమ్ముడు శేషుకు ఇచ్చి పెళ్ళి చేయమని భర్తను కోరుతుంది. సరోజ హృదయం తెలుసుకున్న తండ్రి ఆమె వివాహం రవితోనే జరగాలనే నిర్ణయం స్పష్టంగా ప్రకటిస్తాడు.

శేషు తన స్నేహితుడు ఏకాంబరం ద్వారా సరోజకు పెళ్ళి అయిపోయినట్టు దొంగ శుభలేఖలు, ఫోటోలు సృష్టించి నమ్మిస్తాడు. రవి సరోజల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అందకుండా మాయం చేస్తాడు. సరోజ రవి దగ్గరనుంచి జవాబు లేకపోవడం చూసి రవి వూరికి స్వయంగా బయలుదేరుతుంది. శేషు ప్లాన్ ప్రకారం ఏకాంబరం రవిని, తల్లిని ఊరు దాటించి సరోజకు కూడా రవికి మరొకరితో పెళ్ళి అయినట్లు నమ్మిస్తాడు. సరోజ పెండ్లి విషయంలో తామూహించినంత మార్పు లేకపోవడం చూసి రవి చనిపోయినట్లు పత్రికలో ప్రకటన వేయిస్తాడు. ఈ మంత్రాంగం కూడా పారదు. వైరాగ్యంతో తండ్రిని ఒప్పించి రవి పేర ఒక అనాథ శరణాలయం నడుపుతుంది సరోజ.

వెంకట్ పాప అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె తండ్రి తిమ్మయ్యకు కూతుర్ని సినిమా స్టార్ చెయ్యాలనే పిచ్చి వుందని గ్రహించి తిమ్మయ్య చేత నాటకాల కంపెనీ పెట్టించి తాను డైరెక్టరుగా పాపతో ప్రేమాయణం సాగిస్తూ నాటకాలు ఆడుతూ వుంటాడు. ఊరూరు తిరుగుతూ వుండగా ఆత్మహత్య చేసుకోబోతున్న పద్మ అనే అమ్మాయిని కాపాడి రక్షిస్తాడు. ఆమె వీళ్ళతోనే వుండిపోతుంది.

సరోజ మరొకరిని పెళ్ళి చేసుకుందని నమ్మి మతిభ్రమణంతో రవి తిరుగుతూ వుంటాడు. తల్లి నానా అవస్థలు పడుతూ అతడిని చూచుకుంటూ వుంటుంది. వెంకట్ బృందానికి రవి కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న మిత్రుడు ఈ స్థితిలో వుండడం చూసి అతన్ని మామూలు స్థితికి తీసుకురావడానికి వెంకట్ పద్మ సహాయం కోరతాడు.

బీదవాడైన రవి పిచ్చివాడైపోతే దగా పడి సంఘంచే వెలివేయబడ్డ పతిత పద్మ ఓపికతో, కరుణతో రవికి పునర్జన్మ ఇస్తుంది. ప్రతిఫలంగా సంఘాన్ని సైతం ధిక్కరించి రవి తల్లి పద్మను కోడలుగా స్వీకరించడానికి సిద్ధపడ్డా పద్మ మాత్రం అంగీకరించదు. పద్మ శేష జీవితాన్ని అనాథల సేవలో గడుపుతుంది.

చివరకు శేషు ఆడిన కపటనాటకం బయట పడి సరోజకు, రవికి వివాహం అవుతుంది[2].

నటీనటులు

సాంకేతికవర్గం

  • కథ : బి.ఎస్.రాయుడు
  • స్క్రీన్ ప్లే: విజయారెడ్డి
  • దర్శకత్వం: విజయారెడ్డి
  • మాటలు : వీటూరి
  • పాటలు : శ్రీశ్రీ, ఆరుద్ర, వీటూరి
  • సంగీతం: శ్రీ నిత్యానంద్
  • నృత్యం: చిన్ని, సంపత్
  • ఛాయాగ్రహణం: వరదరాజన్, శ్రీకాంత్
  • నిర్మాత: నాగిరెడ్డి

పాటలు

  1. ఎవరిదీ విజయం ఏది విజయం - ఘంటసాల, పిఠాపురం, వి.సూర్యనారాయణ బృందం - రచన: శ్రీశ్రీ
  2. కోరికలా కుటీరములో చేరి ఉందము ప్రియా - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
  3. మ్రోగింది గుడిలోని గంట మురిసింది హృదయాల జంట - సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
  4. అరుణాం కరుణాంతరంగితాక్షిం ధృతపాశాంకశ (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్
  5. ఈ రోజు మళ్ళారాదు ఈ హాయి సాటిలేదు జల్సాలు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
  6. చెలరేగు చీకటిలోనే ప్రకాశించు దీపము పరీక్షించే - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
  7. తమాషాలకే కోపాలా బావా కులాసాల వేళా రోషాలు - ఎస్.జానకి - రచన: శ్రీశ్రీ
  8. మన్నించవే ఇవేళా హలో మై డార్లింగ్ - పిఠాపురం,స్వర్ణలత - రచన: వీటూరి
  9. మ్రోగింది గుడిలోన గంట మురిసింది హృదయాల జంట - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
  10. అల్లుడా డియర్ మేనల్లుడా అను అత్తను (పద్యం) - పిఠాపురం - రచన: వీటూరి
  11. పేరయ్య భార్యకు ప్రేమలేఖలు వ్రాయ నలుగురు (పద్యం) - మాధవపెద్ది - రచన: వీటూరి

మూలాలు

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19. {{cite book}}: |access-date= requires |url= (help)
  2. ఎ.హెచ్.వి (11 December 1966). "చిత్ర సమీక్ష: శ్రీమతి". ఆంధ్రజ్యోతి దినపత్రిక. No. 160. కె.ఎల్.ఎన్.ప్రసాద్. Retrieved 24 October 2017.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీమతి&oldid=2236367" నుండి వెలికితీశారు