Coordinates: 22°11′57″N 85°50′16″E / 22.19917°N 85.83778°E / 22.19917; 85.83778

భృంగేశ్వర శివాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 37: పంక్తి 37:

iv) శిల్పాలంకారాలు
iv) శిల్పాలంకారాలు

ద్వారము: ద్వారాలను పాక్షికంగా పునర్నిర్మించారు. ఇవి 2.38 మీటర్ల ఎత్తు, 1.10 మీటర్ల వెడల్పు కలిగి వున్నాయి. వీటిపై శాఖలు, పుష్పాలు, లతలు చెక్కబడి వున్నాయి. ద్వారాలకు ఆనుకుని నేలపై చంద్రశిలలు ఉన్నాయి.వాటిపై శంఖువులను అందంగా అలంకంరించారు. ద్వారాల క్రింది భాగంలో ఇరువైపులా ద్వారపాలకుల గూళ్ళు ఉన్నాయి. వీటిలో త్రిశూలాలను ధరించిన ద్వారపాలకులతోపాటు గంగ, యమున దేవతలు చెరోవైపు ఉన్నారు.

03:14, 4 నవంబరు 2017 నాటి కూర్పు

భృంగేశ్వర శివాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఒడిషా
ప్రదేశం:భుబనేశ్వర్
భౌగోళికాంశాలు:22°11′57″N 85°50′16″E / 22.19917°N 85.83778°E / 22.19917; 85.83778

భృంగేశ్వర శివాలయం ధౌలీ పర్వతాల అడుగున, దయానది ఒడ్డున, భుబనేశ్వర్ పట్టణానికి సమీపంలో ఆగ్నేయదిక్కున ఖటుపాద గ్రామంలో నెలకొని ఉంది. ఈ ఆలయంలో లింగాకృతిలో ఉన్న ఈశ్వరుడు పశ్చిమాభిముఖుడై ఉన్నాడు. ఈ దేవాలయం లేతబూది రంగు ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఈ ఆలయనిర్మాణానికి పూర్వం వాడిన వస్తువులతోనే యథాతథంగా పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ దేవాలయం ఒడిషా ప్రభుత్వ పురావస్తుశాఖ సంరక్షణలో ఉంది.

ఇతర పేర్లు

ఈ దేవుడిని భైరంగేశ్వరుడని కూడా పిలుస్తారు.

ప్రత్యేకత

i) చారిత్రక ప్రత్యేకత: —

ii) సాంస్కృతిక ప్రత్యేకత: శివరాత్రి, కార్తీకపౌర్ణిమ, మిథున సంక్రాంతి మొదలైన పండుగలు, తెప్పోత్సవం వంటి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.

iii) సామాజిక ప్రత్యేకతలు:భక్తులు ఇక్కడ ఉపనయనము, శిరోముండనము, వివాహాది కార్యాలు జరుపుకుంటారు.

iv) సంస్థాగత ప్రత్యేకతలు: ఈ గుడి ప్రాంగణంలోనే గ్రామ సభలు మొదలైనవి నిర్వహిస్తారు.

భౌతిక నిర్మాణం

i) ఎల్లలు: ఈ దేవాలయం తూర్పు దిక్కున ధౌలి పర్వతం చుట్టివుంది. దక్షిణ దిక్కులో దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒక రోడ్డు ఖటుపాద గ్రామానికి దారితీస్తుంది. దక్షిణ ఉత్తర దిక్కులు కూడా ధౌలి పర్వతం చుట్టుముట్టి ఉంది.

ii) నిర్మాణ విశేషాలు: ఈ దేవాలయం ఎత్తైన తిన్నెపై 26.5 మీటర్ల పొడవు, 22.1 మీటర్ల వెడల్పు,2 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ దేవాలయం చతురస్రాకారపు విమానం కలిగి ఉంది. విమానం మరియు ద్వారమంటపం 8.35మీటర్ల ఎత్తు కలిగి ఉంది.

iii) పార్శ్వదేవతలు: పార్శ్వదేవతల గూళ్ళు ఉత్తర, పశ్చిమ, దక్షిణ దిశలలో మూడువైపులా 1.06మీటర్ల ఎత్తు, 0.57 మీటర్ల వెడల్పు, 0.39 మీటర్ల లోతు కలిగి వున్నాయి. ఉత్తరం వైపు ఉన్న గూటిలో గణపతి, మహిషాసుర మర్దిని విగ్రహాలున్నాయి. దక్షిణం వైపు ఉన్న గూడు ఖాళీగా ఉంది. గణపతి త్రిభంగ ముద్రలో కమలపీఠంపై నిలబడి ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో చామరము ఉన్నట్లు చెక్కబడి వుంది. మిగిలిన రెండు చేతులు భిన్నమై ఉన్నాయి. వెనుకవైపు ఇద్దరు భక్తులు ఫలాలను సమర్పిస్తున్నట్లు, దేవతలు చేతులలో పూమాలలను పట్టుకుని ఎగురుతున్నట్లు చెక్కబడి ఉన్నాయి. మహిషాసుర మర్ధిని నాలుగు చేతులు కలిగి ఎడమ చేతితో మహిషాసురుని తలను పట్టుకుని, కుడి కాలితో ఆ రాక్షసుణ్ణి తొక్కుతున్నట్లు ఉంది. ఇది 8వ శతాబ్దానికి చెందిన విగ్రహంగా చరిత్రకారులు భావిస్తున్నారు.

iv) శిల్పాలంకారాలు

ద్వారము: ద్వారాలను పాక్షికంగా పునర్నిర్మించారు. ఇవి 2.38 మీటర్ల ఎత్తు, 1.10 మీటర్ల వెడల్పు కలిగి వున్నాయి. వీటిపై శాఖలు, పుష్పాలు, లతలు చెక్కబడి వున్నాయి. ద్వారాలకు ఆనుకుని నేలపై చంద్రశిలలు ఉన్నాయి.వాటిపై శంఖువులను అందంగా అలంకంరించారు. ద్వారాల క్రింది భాగంలో ఇరువైపులా ద్వారపాలకుల గూళ్ళు ఉన్నాయి. వీటిలో త్రిశూలాలను ధరించిన ద్వారపాలకులతోపాటు గంగ, యమున దేవతలు చెరోవైపు ఉన్నారు.

ద్వారబంధము: ద్వారం పైభాగంలో నవగ్రహాలు పద్మాసనం వేసుకుని ఉన్నట్లు చెక్కబడి వుంది.

ఇంకా చూడండి

మూలాలు

గ్రంథసూచి

1. లెస్సర్ నోన్ మాన్యుమెంట్స్ ఆఫ్ భుబనేశ్వర్ - డా.సదాశివ ప్రధాన్

2. బెంగాల్ డిస్ట్రిక్ట్ గెజిటీర్ పూరి - ఎల్.ఎస్.ఎస్.ఓ'మల్లే, కలకత్తా 1908, పేజీ.243

3. ఒరిస్సా అండ్ హర్ రిమెయిన్స్, ఎం.ఎం.గంగూలీ, కలకత్తా,1912 పేజీ.269

4. ఎ హిస్టరీ ఆఫ్ ఒరిస్సా, సంపుటి II, ఎన్.కె.సాహు (సం), ఢిల్లీ, 1980, పేజీ.270

5. ఆర్కియాలజీ ఇన్ ఒరిస్సా, సంపుటి I, ఆర్.పి.మహాపాత్ర, ఢిల్లీ 1986, పేజీ. 82

6. ది యాంటిక్విటీస్ ఆఫ్ ఒరిస్సా, సంపుటి II, ఆర్.ఎల్.మిత్రా, కలకత్తా, 1963 పేజీలు 118-121