సంగమ వంశము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
19 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
సంగమ వంశ రాజ్యము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ [[కాలము]] [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యాని]]కి అంకురార్పణ జరిగిన [[సమయము]].
 
సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా [[గుంటూరు]] ప్రాంతము వారు అయిఉండవచ్చును. ఢిల్లీ సుల్తానుల కొలువులో ఉన్న 14వ శతాబ్దపు ముస్లిం చరిత్రకారుడు జియాఉద్దీన్ బారని, హంపి రాజు హరిహర రాయలు మరియు ముసునూరి కమ్మ ప్రభువు కాపయ నాయుడు ఇద్దరూ బంధువులు అని చెప్పినారు. వారు [[ఓరుగల్లు]] ప్రతాప రుద్రుని కోశాగార ఉద్యోగులు. 1323 లో [[ఓరుగల్లు]]<nowiki/>ను [[ఢిల్లీ]] సుల్తాను ఆక్రమించగా ఈ సోదరులు కర్ణాటక ప్రాంతపు ఆనెగొంది రాజు కొలువులో చేరిరి. 1334 లో ఆనెగొందిని ఆక్రమించిన సుల్తాను మాలిక్ ను తన ప్రతినిధిగా నిఐమించెను. కాని ప్రజల తిరుగుబాటుచేయగా, మాలిక్ బదులు హరిహర బుక్క సోదరులను రాజు, మంత్రులుగా నియమించెను. వారు తరువాత స్వాతంత్ర్యము ప్రకటించిరి (ఇందుకు భిన్నముగా కూడా కొన్ని చరిత్రలలో ఉన్నది).
 
వీరికి విద్యారణ్య స్వామి వారి సహాయమూ, మార్గ దర్శకత్వమూ లభించాయి. వారి సలహాతో వీరు [[హంపి|విజయనగరము]]<nowiki/>ను పటిష్ఠమైన నగరముగా నిర్మించారు. ఏడుప్రాకారాలతో, మూడుప్రక్కలఅ కొండలతో, ఒకవైపు అగడ్తతో, ఉత్తరాన తుంగభద్రా నదితో ఇది 14 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు ఉండి, విద్యలకు, ఐశ్వర్యానికి నిలయమై, [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో సాటిలేని నగరంగా ప్రకాశించింది.
326

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2292564" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ