మూసీ నది: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
58 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
చి
లింకు సరిచేశాను, అది విశాఖ జిల్లా అనంతగిరి మండలానికి వెళ్తోంది.
(+వరదలు విభాగం)
చి (లింకు సరిచేశాను, అది విశాఖ జిల్లా అనంతగిరి మండలానికి వెళ్తోంది.)
'''మూసీ నది''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని దక్కన్ ప్రాంతములో [[కృష్ణా నది]] యొక్క ఉపనది. [[హైదరాబాదు]] నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ''ముచుకుందా నది'' అని పిలిచేవారు.<ref>''కాశీయాత్రా చరిత్ర'' - ఏనుగుల వీరాస్వామయ్య</ref> హైదరాబాదు యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మించబడింది.
 
మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన [[రంగారెడ్డి జిల్లా]], [[వికారాబాదు]] వద్ద [[అనంతగిరి (వికారాబాదు)|అనంతగిరి]] కొండల్లో పుట్టి [[నల్గొండ]] జిల్లా, [[వాడపల్లి (దామరచర్ల మండలం)|వాడపల్లి]] (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది మరియు అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. ఆ తరువాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యములో 4.35%<ref>http://www.irrigation.ap.gov.in/volume1.pdf</ref> సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు భీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర కలదు.
 
మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నప్పటికీ ''పురానా పూల్'' (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీలు]] 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ వంతెన వాడుకలో ఉంది. నయా పూల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉన్నది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్ మరియు ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నవి. [[విజయవాడ]] వెళ్ళే జాతీయ రహదారి 7, [[వరంగల్]] వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర మరియు దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.
37,800

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/229467" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ