డిస్కు చెక్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 21: పంక్తి 21:
===కవాట బిళ్ళ===
===కవాట బిళ్ళ===
ఇది గుండ్రంగా వృత్తాకారంగా బిళ్ళ ఆకారంలో వుండును. స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును.కవాటరంధ్రంను మూయు బిళ్ళ ఉపరితలం నునుపుగా వుండును. ఇది ఒక స్ప్రింగు వలన కవాట పీఠం పై ఎటువంటి ఖాళి లేకుండా స్ప్రింగు కలుగచేయు ఫోర్సు/బలం/శక్తి/పీడనం వలన కూర్చోనును
ఇది గుండ్రంగా వృత్తాకారంగా బిళ్ళ ఆకారంలో వుండును. స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును.కవాటరంధ్రంను మూయు బిళ్ళ ఉపరితలం నునుపుగా వుండును. ఇది ఒక స్ప్రింగు వలన కవాట పీఠం పై ఎటువంటి ఖాళి లేకుండా స్ప్రింగు కలుగచేయు ఫోర్సు/బలం/శక్తి/పీడనం వలన కూర్చోనును
===స్ప్రింగు===


==మూలాలు/ఆధారాలు==
==మూలాలు/ఆధారాలు==

08:42, 9 మార్చి 2018 నాటి కూర్పు

డిస్కు చెక్ వాల్వు అనునది ఒక ఏకదిశ ప్రవాహ కవాటం. ఏకదిశ ప్రవాహ కవాటంలో ప్రవాహం ఒకదిశలో మాత్రమే ప్రవహిస్తుంది.

కవాటం

కవాటం అనగా ఒక వ్యవస్థ లేదా గొట్టంలో ప్రవహిస్తున్న ఒక ద్రవం లేదా వాయువు యొక్క ప్రవాహాన్ని పూర్తిగా నిలిపి వేయునది, లేదా పాక్షికంగా ప్రవహించునటుల నియంత్రణ చేయునది,లేదా ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో గొట్టంలో ప్రవహించునటుల చేయు పరికరం[1]. ఇందులో ప్రవాహాన్ని నియంత్రణ చేయు కవాటబిళ్ళ యొక్క కాడ పిడి కల్గి వుండి, ప్రవాహం వెళ్ళునపుడు పిడిని ఒకదిశలో తిప్పడం వలన వాల్వు తెరచు కొనును. గొట్టం నుండి ద్రవ/వాయు ప్రవాహం /ప్రసరణ లేనప్పుడు,కవాటం తనకు తానుగా మూసుకోదు. తిరిగి కవాటం పిడిని వ్యతి రేకదిశలో తిప్పినపుడు మాత్రమే మూసుకొనును.

ఏకదిశ ప్రవాహ కవాటం

ఏకదిశ ప్రవాహ కవాటం లో ద్రవం లేదా వాయువులు కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును[2].ఏకదిశ ప్రవాహ కవాటంను ఆంగ్లంలో చెక్ వాల్వు అనియు మరియు నాన్ రిటర్నువాల్వు అందురు.వ్యతిరేక దిశలో ప్రవహించుటను తనకు తాను స్వయం ప్రీరితంగా నిరోధించును. ఏకదిశ ప్రవాహ కవాటంఒక విధంగా రక్షణ కవాటం/సేఫ్టి వాల్వుగా పనిచేయును. ఉదాహరణకుగ్లోబ్ వాల్వు లేదాప్లగ్ వాల్వు లేదా బాల్ వాల్వు లలో రెండు వైపులా ప్రవహించును. పైన పేర్కొన్న వాల్వులు అటోమాటిగా మూసుకోవు. గొట్టంలో ఒకద్రవం కొంతపీడనంతో ఒకదిశలో ప్రవహిస్తూ, ఏదైనా కారణం చేత ప్రవాహం ఆగిన, ప్రవాహం వెళ్ళిన దిశలో/మార్గంలో పీడనం ఎక్కువ ఉండుటచే, ద్రవం వెనక్కి ప్రవహించడం మొదలు పెట్టును.ఒక పంపు ద్వారా ద్రవం వెళ్ళుచు, పంపు ఆగిన గొట్టంలోని ద్రవం వ్యతిరేక దిశలో వెనక్కి పంపులోకి రావడం వలన పంపు/తోడు యంత్రం పాడై పో వును. ఒకవేళ కంప్రెసరు (వాయు సంకో చక యంత్రం)నుండి వాయువు పీడనంతో ప్రవహిస్తూ కంప్రెసరు ఆగిన, వాయువు ఎక్కువ పీడనం మరియు త్వరణంతో వెన్నక్కి ప్రవహించడం వలన కంప్రెసరు పాడగును.బాయిలరు పని చేయునపు డు అందులో తయారగు స్టీము అధిక పీడనం కల్గి వుండును. కావున బాయిలరులో వున్న పీడనం కన్న ఎక్కువ పీడనంతో నీటిని పంపు ద్వారా పంపిస్తారు. ఎప్పుడైతే పంపు ఆపిన వెంటనే, బాయిలరులో పీడనం ఎక్కువగా వుండటం వలన స్టీము + నీరు వెనక్కి పంపులోకి,మరియు ఫీడ్ వాటరు టాంకులోకి ప్రవేశించి నష్టం వాటిల్లును.

అందువలన ఎక్కువ పీడనం మరియు వేగంతో ఒక వ్యవస్థలో ద్రవం లేదా వాయువు ప్రవహిస్తున్నపుడు, ద్రవాన్ని లేదా వాయువును తోడుయంత్రం /పంపు ఆగినపుడు ప్రవాహం వెనక్కి ప్రవహించడం కుండా ఈ ఏకదిశ కవా ట లు నిరోధించును. పంపుల ద్వారా నదులు,కాలువల నుండి నీటిని ఒవర్ హెడ్ ట్యాంకులను నీరును తోడునపుడు, పంపు ఆగిన,ఈ ఏకదిశ కవాటం లేనిచో ఒవర్ హెడ్ ట్యాంకులోని నీరంతా మరల కిందికి వచ్చును. బావుల నుండి, కాలువల నుండి నీటిని తోడు పంపుల సక్షను పైపు కింది భాగంలో వుండు ఫూట్ వాల్వ్ కూడా ఒకరకమైన ఏకదిశ కవాటమే.

డిస్కు చెక్ వాల్వు నిర్మాణం

డిస్కు ఏకముఖ కవాటం సరళమైన, సాదా ఆకృతి కల్గిన కవాటం. మిగతా ఏకముఖ కవాటాల కన్నా తక్కువ స్థాలాన్ని ఆక్రమిస్తుంది. బటరుఫ్లై వాల్వు లా చక్కగా పైపుల యొక్క రెండు ఫ్లాంజిల మధ్య ఇమిడి పోతుంది.డిస్కు చెక్ వాల్వుకు ప్రత్యేకంగా ఫ్లాంజిలు అవసరం లేదు.వాల్వు బాడీ గుండ్రంగా తక్కువ మందంతో వుండటం వలన ఇదే సైజు ఇతర వాల్వులకన్న తక్కువ బరువు కల్గివుండును. వాల్వు మొత్తం స్టెయిన్ లెస్ స్టీలు (తుప్పుపట్టని ఉక్కు)తో చెయ్యడం వలన ఎక్కువ కాలం ఎటువంటి మరమత్తులు లేకుండా పనిచేయును.వాల్వు ను అన్ని రకాల స్థితులలో (position) వాడవచ్చు అనగా క్షితిజసమాంతరంగా,నిలువుగా మరియు ఏటవాలుగా కూడా వాడవచ్చును.

డిస్కు చెక్ వాల్వులోని ప్రధాన భాగాలు

  • 1.బాడీ
  • 2.కవాట బిళ్ళ /డిస్కు
  • 3.స్ప్రింగు
  • 4.స్ప్రింగు రిటైనరు

బాడీ

ఇది తుప్పుపట్టని ఉక్కు అనగా స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును.ఇది గుండ్రంగా వుండి కంకణం లేదా కడియం వంటి ఆకృతిలో వుండును.అనగా మధ్యలో వాల్వు సైజును అనుసరించి బెజ్జం/రంధ్రం వుండును. ఉదాహరణకు 25 మీ.మీ(1”అంగుళం) వాల్వు అనగా బాడీలో రంధ్రం యొక్క వ్యాసం 25 మీ.మీ(1”అంగుళం)వుండును.బాడీ వృత్తాకార మందం వాల్వు/కవాటం సైజును బట్టి పెరుగును. బాడిలో ప్రవాహం బెజ్జం ఒక చివర నుండి మరో చివరకు నేరుగా ప్రవహించును.బాడిలో కవాట బిళ్ళ మూసి వుంచు రంధ్రాన్ని కవాట పీఠం /సీట్ అందురు.ఇది నునుపుగా వుండును.కవాట బిళ్ళ కవాట పీఠం మీద ఆనినపుడు వాటి అంచులు దగ్గరగా అతుక్కుపోయి మధ్యనుండి ద్రవం లేదా వాయువు బయటికి కారదు.బాడీ చివర వర్తుల /వృత్తాకార అంచుల మీద వృత్తాకార గాడులు వుండును.వాల్వును పైపు ఫ్లాంజిలకు బిగించునపుడు ,పైపు ఫ్లాంజిల,మరియు బాడీ మద్య ఆస్బెస్టాస్ ప్యాకింగును వుంచి, బిగించినపుడు ఈ వృత్తాకార గాడులు ప్యాకింగును బలంగా నొక్కడం వలన వాల్వు మరియు పైపు ఫ్లాంజిల మధ్యనుండి ప్రవహించు ద్రవం లేదా వాయువు బయటికికారదు.

కవాట బిళ్ళ

ఇది గుండ్రంగా వృత్తాకారంగా బిళ్ళ ఆకారంలో వుండును. స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును.కవాటరంధ్రంను మూయు బిళ్ళ ఉపరితలం నునుపుగా వుండును. ఇది ఒక స్ప్రింగు వలన కవాట పీఠం పై ఎటువంటి ఖాళి లేకుండా స్ప్రింగు కలుగచేయు ఫోర్సు/బలం/శక్తి/పీడనం వలన కూర్చోనును

స్ప్రింగు

మూలాలు/ఆధారాలు

  1. "valve Read more: http://www.businessdictionary.com/definition/valve.html". businessdictionary.com. Retrieved 06-03-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help); External link in |title= (help); line feed character in |title= at position 6 (help)
  2. "UNDERSTANDING CHECK VALVES". waterworld.com. Retrieved 03-02-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)