కొలనుపాక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 132: పంక్తి 132:
|area_code =
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info =
|blank_info = 08685
|blank1_name =
|blank1_name =
|website =
|website =

12:49, 23 జూన్ 2018 నాటి కూర్పు

Kulpakji Tirtha
కొలనుపాక జైన ఆలయం
కొలనుపాక జైనమందిరము
మతం
జిల్లానల్గొండ జిల్లా
ప్రదేశం
ప్రదేశంకొలనుపాక
దేశంభారత దేశం
కొలనుపాక జైనమందిర గోపురం
కొలనుపాక జైనమందిర ప్రవేశ ద్వారం

కొలనుపాక (Kolanupaka), నల్గొండ జిల్లా, ఆలేరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 508102.

కొలనుపాక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం ఆలేరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 4,431
 - స్త్రీల సంఖ్య 4,429
 - గృహాల సంఖ్య 2,289
పిన్ కోడ్ 508102
ఎస్.టి.డి కోడ్ 08685

కొలనుపాక గ్రామము భువనగిరి డివిజన్ లో మేజరు గ్రామ పంచాయితి. వరంగల్ - హైదరాబాదు మార్గంలో హైదరాబాదుకు 65 కి.మీ, ఆలేరుకు సుమారు 6 కి.మీ. దూరంలో ఉంది[1][2]. ఈ గ్రామములో సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మంది జనాభా ఉంది. అందులో సుమారుగా ఆరు వేల ఓటర్లు ఉన్నారు.

రవాణ సదుపాయాలు

తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు నుండి బస్ మరియు రైలుబండి సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాదు మహాత్మా గాంధీ బస్ స్టాప్/ జూబ్లి బస్ స్టేషను నుండి వరంగల్ లేదా హన్మకొండ మరియు జనగాం వెళ్ళే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. ఉప్పల్ రింగ్ రోడ్డ్ నుండి మరియు కూకట్ పల్లీ నుండి నేరుగా కొలనుపాకకు సిటీ బస్సుల సదుపాయము కలదు, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని ఆటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామము చేరుకుంటారు.

గ్రామ చరిత్ర

ఈ గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది.పూర్వము " కాశీ కొలనుపాక బింభావతి పట్టణం "గా పిలువబడేను, మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు కొల్లిపాకై. అలాగే సోమేశ్వరస్వామి ఆలయం దగ్గర వాగులో ఇసుక మేటలో దొరకిన గంటపై స్వస్తి శ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ అని ఉంది. కాకతీయ రుద్రదేవుని కాలంనాటి శాసనంలో కూడా కొల్లిపాక అని ప్రస్తావించబడింది. విజయనగర రాజుల కాలంనాటికి కొల్‌పాక్'‌'గా మారింది. ప్రస్తుతం కూల్‌పాక్ లేదా కొలనుపాక అని పిలువబడుతున్నది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామనామ వివరణ

కొలనుపాక అనే గ్రామనామం కొలను అనే పూర్వపదం, పాక అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కొలను అనే పదం జలసూచి, చిన్న లేదా మధ్యపాటి చెరువు అన్న అర్థం వస్తోంది. పాక అనేది గృహసూచి.[3]

గ్రామ చరిత్ర, విశేషాలు

  • ఈ గ్రామము చాల చరిత్రాత్మక ప్రదేశము మరియు సుప్రసిద్ద పుణ్యక్షేత్రము, కొటొక్క (కొటి ఓక్కటి ) లింగము నూట ఓక్క చెరువు - కుంటలు ఉన్నాయి.ముఖ్యంగా స్వయంభూ లింగము వెలసి, శ్రీ శ్రీ సొమేశ్వరస్వామిగా అవతరించాడు, రేణుకా చార్యుని జన్మ స్థలము (సోమేశ్వర ఆలయం) వీరనారాయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ముఖ్యంగా జైన దేవాలయము (జైన మందిరము, వివిధ కమ్యునిటిలకు (కులాలకు) చెందిన 22 రకాల మఠాలు (వీరశైవ ఆలయాలు) ఉన్నాయి. అదేవిధంగా సకుటుంబ సమేతంగా సందర్శించదగిన ప్రదేశము. 2వేల సంవత్సరాల పురాతనమైన జైన మందిరములో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది.

కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి క్షేత్రం

నల్గొండజిల్లా ఆలేరుమండలంలోని కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవమతస్థాపకుడుగా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది వేయి సంవత్సరాలు భూమండలం మీద శైవ మతప్రచారము చేసి, మళ్ళీ ఇక్కడే లింగైక్యంపొందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి వుందని స్థలపురాణం. దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి. దేవాలయ ప్రాంగణాన్ని, ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఏర్పాటుచేశారు పురావస్తుశాఖ వారు. ఈ ఆలయం క్రీ.శ 1070 - 1126 మధ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడి ఉంటుందని చరిత్ర కారులు భావిస్తున్నారు.

పూర్వచరిత్ర

ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణకాశి, బింబావతి పట్నం, పంచకోశ నగరంగా పిలిచేవారట. దీనినే కొలియపాక, కొల్లిపాక, కల్లియపాక, కుల్యపాక, కొల్లిపాకేయ మొదలైన పేర్లతో పిలిచే వారట. ఇప్పడు కొలనుపాక, కుల్పాక్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సోమేశ్వర లింగం పంచ పీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు. 1. సోమేశ్వరస్వామి – కొలనుపాక 2. సిద్దేశ్వర స్వామి - ఉజ్జయిని 3. భీమనాథస్వామి - కేదారనాథ్ 4. మల్లికార్జునస్వామి – శ్రీశైలమ్ 5. విశ్వేశ్వరస్వామి – కాశి

  • క్రీ.శ. 11వ శతాబ్దంలో ఇది కళ్యాణి చాళుక్యుల రాజధాని. ఆ కాలంలో ఇది జైన సంప్రదాయానికీ, శైవ సంప్రదాయానికీ కూడా ప్రముఖ కేంద్రము. ప్రసిద్ధ శైవాచార్యుడైన రేణుకాచార్యుడు ఇక్కడే జన్మించాడని సాహిత్యం ఆధారాలు చెబుతున్నాయి. తరువాత ఈ పట్టణం చోళుల అధీనంలోకి, తరువాత కాకతీయుల అధీనంలోకి వెళ్ళింది.
  • క్రీ.శ.11వ శతాబ్దం నాటికి ఇది ఎల్లోరా, పటాన్‌చెరువు, కొబ్బల్ వంటి జైన మహా పుణ్య క్షేత్రాల స్థాయిలో వెలుగొందింది. కొద్దికాలం క్రితమే ఒక జైన శ్వేతాంబరాలయం పునరుద్ధరించబడింది.
  • మధ్య యుగం - క్రీ.శ. 1008 - 1015 అయిదవ విక్రమాదిత్యుని కాలం - నాటికి కొలనుపాక ఒక దుర్భేద్యమైన కోటగా విలసిల్లింది. చోళరాజులు (రాజేంద్ర చోళుడు క్రీ.శ. 1013-1014) తాత్కాలికంగా దీనిని జయించినా మళ్ళీ ఇది చాళుక్యుల అధీనంలోకి వచ్చింది. కళ్యాణీ చాళుక్యుల పాలన క్షీణించిన తరువాత ఇది కాకతీయుల పాలనలోకి వచ్చింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు దీనికి సమీపంలోనే ఉన్నందున ఈ కాలంనుండి కొలనుపాక ప్రాముఖ్యత పలుచబడింది.

ముఖ్యమైన వ్యక్తులు

ఈ గ్రామములో ముఖ్యులు కామ్రేడ్ ఆరుట్ల రాంచంద్రా రెడ్డి-కమలాదేవి (రజాకర్ల వ్యతిరేఖ ఉద్యమ పోరాట యోధులు, బి.మాధవులు

గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 8, 860 - పురుషుల సంఖ్య 4, 431 - స్త్రీల సంఖ్య 4, 429 - గృహాల సంఖ్య 2, 289

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. The Hindu : Andhra Pradesh / Hyderabad News : Kolanupaka temple to be re-opened
  2. The Hindu : Andhra Pradesh / Hyderabad News : School toppers feted
  3. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 251. Retrieved 10 March 2015.

వనరులు, బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కొలనుపాక&oldid=2397026" నుండి వెలికితీశారు