స్వాతి కిరణం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
12 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
→‎చిత్రకథ: చిన్న అక్షర దోషాలు సవరణ
(→‎తారాగణం: లింకులు)
ట్యాగు: 2017 source edit
(→‎చిత్రకథ: చిన్న అక్షర దోషాలు సవరణ)
ట్యాగు: 2017 source edit
 
== చిత్రకథ ==
దేశాలు పట్టి తిరుగుతూ ఉంటే ఒక దేశదిమ్మరి ([[మమ్ముట్టి]]) ని పిల్లలను పట్టుకు పోయేవాడని భ్రమించిన పల్లె వాసులు అతణ్ని పోలీస్ స్టేషన్లో అప్పజెబుతారు. అక్కడ సబ్ ఇన్సపెక్టర్ఇన్‌స్పెక్టర్ ([[అచ్యుత్]]) దేశదిమ్మరిని అనంత రామశర్మగా పోలుస్తాడు.
 
గతంలోకి వెళితే అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్న బాల సంగీత విద్వాంసుడు గంగాధరం (మాస్టర్ మంజునాధ్). అతని తల్లి దండ్రులు (ధర్మవరపు సుబ్రహ్మణ్యం, డబ్బింగ్ జానకి) ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ ఉంటారు. పక్షితీర్ధం మామ్మ (జయంతి) గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉంటాడు గంగాధరం. స్థానిక దేవాలయంలో ఉత్సవాలకు వచ్చిన అనంత రామశర్మకు ఆధిత్యంఆతిథ్యం ఇచ్చే అవకాశం వస్తుంది పక్షితీర్ధం మామ్మగారికి. గంగాధరం ప్రతిభ గమనించిన పక్షితీర్ధం మామ్మగారు గంగాధారాన్ని అనంత రామశర్మకి శిష్యునిగా చేద్దామను కుంటుంది. కానీ బాల చాపల్యంతో, దేవాలయంలో అనంత రామాశర్మగారు మంత్రపుష్పాన్ని చదివిన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష సూక్తాన్ని ఆకతాయి తనంతో పాడతాడు. ఆగ్రహిస్తాడు అనంత రామశర్మ. గణపతి సచ్చినాంద స్వాముల వారు వారి ఆశ్రమంలో ఉన్న సరస్వతీ స్తోత్రాలను స్వర పరిచే అవకాశం అనంత రామశర్మకు దక్కుతుంది. ఇంతలో కాలేజిలో జరిగే ఆడిషన్ కి గంగాధరాన్ని తీసుకు వస్తారు పక్షితీర్ధం మామ్మగారు. ఆ సందర్భంగా అనంత రామశర్మ ఇంటికి వచ్చిన గంగాధరం, అనంత రామశర్మ స్వర పరచిన పాట వింటాడు. కాలేజిలో ఆడషన్ఆడిషన్ లో మరో స్వరంతో అదే పాట వినిపిస్తాడు. అనంత రామశర్మ గంగాధరం దరఖాస్తుని తిరస్కరిస్తాడు. అనంత రామశర్మ నిస్సంతు. అతని భార్య (రాధిక) గంగాధరాన్ని తమ వద్ద ఉంచుకుందామంటుంది. గంగాధరం ప్రతిభకు లోకమంతా నీరాజనం పట్టినా అనంత రామశర్మ గంగాధరానికి ఇంకా శిక్షణ కావాలంటూ ఉంటాడు. అనంత రామశర్మ వలన కాని స్వర రచనను గంగాధరం ప్రయత్నిస్తాడు. ఆ స్వరరచన ఆమోదయోగ్యంగా లేదంటునే ఆ స్వరాలను భద్రపరచుకుంటాడు. తనని అధిగమిస్తాడనే అభద్రతా భావంతో రగిలి పోతున్నాడని పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ఇన్‌స్పెక్టర్ గా సెలక్టైఎంపికై ట్రైనింగ్శిక్షణ అవుతున్నతీసుకుంటున్న పక్షితీర్ధం మామ్మగారి మేనల్లుడు గ్రహిస్తాడు. అనంత రామశర్మ అసూయతో గంగాధరం మరణానికి కారణ భూతమవుతాడు. ఈ సంఘటనతో అనంత రామశర్మ భార్యకు మతి భ్రమిస్తుంది.
 
అనంత రామశర్మను పక్షితీర్ధం మామ్మగారి ఇంటి దగ్గర దించిన తరువాత అతనికి స్వస్థత చేకూరుతుంది. కోలుకున్న అనంత రామశర్మ భార్య గంగాధరం పేరు మీద సంగీత అకాడమీ స్థాపిస్తుంది. భార్య సంగీతం నేర్పుతూ ఉంటే తరగతిలో శిష్యులలో కూర్చొంటాడు అనంత రామశర్మ. పాఠాన్ని సాధన చేస్తూ ఉన్న అనంత రామశర్మను శృతి సరి చేసుకోమంటుంది సంగీతం నేర్చుకుంటున్న బాలిక. దానితో సినిమా ముగుస్తుంది.
33,048

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2426151" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ