మార్పులు

Jump to navigation Jump to search
చి
భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (23), బాగ → బాగా , పశుపు → పసుపు, ) → ) using AWB
|చైన్పుర్:||320 mm
|-
|నమ్ఛెనమ్ఛే బజార్:||220 mm
|-
|}
1.2 కుకుర్ తీహార్
 
రెండో రోజున కుకుర్ తీహార్ అనగా కుక్కల పండుగ . ముఖ్యంగా మరణానికి పుత్రులుగా నల్లని కుక్కలను chestnut రంగు కుక్కలను భావించి వాటిని పూజిస్తారు. వాటి ముఖానికి బొట్టు పెట్టి, మెడలో పూల దండలు వేసి, వాటికి మంచి ఆహారం పెట్టి పూజిస్తారు. అన్ని జంతువుల కన్న కుక్క మానవునికి అత్యంత విశ్వాస పాత్రమై నందున, మానవునికి తోడుగా వుండి, అతనికి ఇంటిని కాపలా కాస్తున్నందున ఈ విధంగా వాటికి రుణం తీర్చుకోవడంగా కూడా నేపాలీ ప్రజలు భావిస్తారు. ( సాధారణంగా భారతదేశంలో ఆలయాల లోనికి కుక్కలు ప్రవేశిస్తే అపవిత్రంగా భావిస్తారు. ఆ అపవిత్రతను తొలిగించ డానికి కొన్ని శుద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారు. కానీ నేపాల్ దేశంలో ఖాట్మండులోని పరమ పవిత్ర పశుపతి నాద్ దేవాలయంలో కొందరు పూజారులు కొన్ని కుక్కలకు నొసటన పశుపుపసుపు పూసి కుంకుం బొట్లు పెట్టి వాటి మెడలో పూల మాల వేసి ఒక స్తంభానికి కట్టి ఆ ప్రక్కనే ఒక పూజారి కూర్చొని వుండగా నేను గమనించాను. కుక్కలు ఆలయంలో ఈ విధంగా వుండడము చూచి ఇదేదో పవిత్రమైన కార్యమై వుంటుందని భావించి కొంత లోతుగా పరిశీలించగా..... ఆలయానికొచ్చిన భక్తులు కుక్క వద్ద వున్న పూజారికి కుక్కలకు పూజా కార్యక్రమం చేయించి వారినుండి కొంత సంభావన స్వీకరించారు. ఇది నేను స్వయంగా చూసిన విషయం. బహుశా పూజించ డానికి కుక్కలు దొరక నందున ఆలయంలో ఈవిదంగా కుక్కలను పూజించే అవకాశం కల్పించబడినదని భావించ వచ్చు. )
1.3 గోవుల పండగ
 
== ప్రపంచంలో వున్న ఏకైక హిందు సామ్రాజ్యం ==
మొన్నటి దాక రాజుల పరిపాలనలో వున్న నేపాల్ దేశం ప్రపంచంలో వున్న ఎకైక హిందు రాజ్యం. భారత దేశానికి ఉత్తరాన ఆనుకునే వున్న ఈ దేశంలోనికి అడుగు పెట్టాలంటే
భారతీయులకు ఎటువంటి పాస్ పోర్టు / వీసా / ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదు. వాహనాలకు మాత్రం కొంత రుసుము తీసుకొని అనుమతిస్తారు. అదే విధంగా భారతీయులు నేపాల్ లో స్థిరాస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకనే నేపాల్ లో వున్న పెద్ద పెద్ద హోటల్ల వ్యాపారం భారతీయుల చేతిలోనెచేతిలోనే ఉంది. ఇదంతా నేపాల్ --- భారత దేశాల మధ్య కుదుర్చు కున్న ఒప్పందం ప్రకారం జరుగు తున్నది. ఈ దేశంలో వున్న మొత్తం జనాభాలో ఎనభై శాతం హిందువులు. తక్కిన ఇరవై శాతంలో భౌద్దులు, ముస్లింలు, క్రిచ్చియన్లు ఉన్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాలు ఇక్కడున్నాయి. అలాగెఅలాగే భౌద్దులకు అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థల్లాలు ఇక్కడున్నాయి. హిందువులు, భౌద్దులు కలిసే వుంటారు.
 
==ద్రవ్యము (కరెన్సి) ==
 
== ప్రవేశ ద్వారాలు ==
భారత్ భూబాగంతొ కలిసి వున్న నేపాల్ లోనికి ప్రవేశించ డానికి చాల భూమార్గాలున్నాయి. అన్నింటి లోకి ఘోరక్ పూర్ వద్ద వున్న మార్గమే ప్రధాన మైనది. ఈ భార్డర్ లో ఇరువైపుల కలిసి వున్న గ్రామం పేరు '''సునౌలి''' ఇక్కడ అసాధరాణమైన భద్రతా ఏర్పాట్లేమి వుండవు. అక్కడి స్థానిక ప్రజలు మామూలుగానెమామూలుగానే అటు ఇటు తిరుగు తుంటారు. భారతీయులు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నేపాల్ భూభాగం లోకి ప్రవేశించ వచ్చు. కాని వాహనాలకు కొంత రుసుం కట్టితే లోనికి అనుమతిస్తారు. అలా నేపాల్ లోనికి ప్రవేశించిన వాహనాలు ఆ దేశంలో ఎక్కడైనా తిరగ వచ్చు. సరిహద్దు వద్ద నేపాల్ భూభాగం లోనికి ప్రవేశించిన పర్యాటకులకు సేద దీరడానికి, కాల కృత్యాలు తీర్చు కోడాని అనేక ఏర్పాట్లుంటాయి. నేపాల్ భూబాగంలోనికి ప్రవేశించగానెప్రవేశించగానే ప్రత్యేకంగా కనుపించే విషయ మేమంటే. ఇంకా తెల్ల వారకముందే అక్కడున్న చిన్న చిన్న అన్నశాలలు, సత్రాలు, బడ్డి కొట్టులు అన్ని తెరిచే వుంటాయి. ఆ దుఖాణాల ముందు ఒక మేజా బల్ల వేసి దానిపై మద్యం సీసాలు పెట్టి వుంటారు. మందు బాబులు కూడా అప్పటికప్పుడు తమ పని కానిచ్చుకొని వెళు తుంటారు. మద్యంపై ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేదు.
 
== గ్రామాలు పంట పొలాలు ==
సరిహద్దు నుండి కొంత దూరమెదూరమే మైదాన ప్రాంతం. అక్కడక్కడ పల్లెలు పంట పొలాలు వుంటాయి. ఇక్కడ వరి ప్రధాన పంట. ఆ వరి చాల ముతక రకం. వ్యవసాయం సాంప్రదాయ పద్ధతిలోనెపద్ధతిలోనే జరుగు తున్నది. కొండ వాలున కొన్ని అడుగుల వెడల్పున చదును చేసి అక్కడే వరి పండిస్తుంటారు. ఆ పొలాలు చూడ్డానికి చాల అందంగా కనబడుతుంటాయి. కొండలకు అందమైన మెట్లు చెక్కారా అని అనిపిస్తుంది. అటు వంటి కొండల పాద భాగన మంచి పారుతున్నా అది కొన్ని వందల అడుగుల లోతులో వున్నందున ఆ నీటిని పొలాలకు పారించ లేరు. కొండల పైనుండి జారు వారెవారే నీటి దారలే ఈ పంటలకు జల వనరులు. ఇటు వంటి నీటి దారలు చిన్నచిన్నవి చాల ఎక్కువ. కొన్ని పెద్ద పెద్ద జల ధారలు వుంటాయి అవి జలపాతాల లాక కనబడుతుంటాయి. ఈ కొండలలో ప్రజలు అన్ని రకాల కూరగాయలు, పండ్లు కూడా పండిస్తుంటారు. పల్లెలు చాల పలుచగా వుంటాయి. ఇళ్లు దూర దూరంగా వుంటాయి. కొన్ని చోట్ల పొలాల మధ్యలోనెమధ్యలోనే ఇళ్లుంటాయి. ప్రతి ఇంటి ముందు బంతి పూల చెట్లుంటాయి. రోడ్లు విశాలంగా వున్నా అక్కడ తిరిగే వాహనాలు చాల పాతవి. జీపుల్లాంటి డొక్కు వాహనాలు, రిక్షాలు మొదలగునవి ప్రయాణ సాధనాలు.
 
== ఘాట్ రోడ్డు ==
నేపాల్ దేశం కొండలమయమైనందున అక్కడ రోడ్డులన్ని ఘాట్ రోడ్డులే. కొండ వాలులో రోడ్డుకు సరిపడినంత మేర చదును చేసి కొడ వాలు వెంబడి వంకర టింకరగా మెలికలు తిరుగు తూ రోడ్లుంటాయి. బస్సులో వెళు తుంటే ఒకవైపు ఆకాశం అంతెత్తున్న కొండలు, మరొక వైపున పాతాళం కనిపిస్తున్నదా అన్నంత లోతున ప్రవహిస్తున్న నది ఇలా వందలాది మైళ్ల పర్యంతం కనబడుతూనెకనబడుతూనే వుంటుంది. లోయలో ప్రవహిస్తున్న నదిలో అతి శుభ్రమైన నీరుంటుంది. ఆ నది కూడా అనేక మలుపులు తిరుగుతూ ఎగుడు దిగుడుగా నురగలు కక్కుతూ ప్రవహిస్తుంటుంది. ఆ నదిలో రాళ్లన్ని అతి నును దేలి కాలు పెడితే జారిపోయేటట్లుంటాయి. వాటినే [[సాలగ్రాం]] లంటారు.
నదులు చిన్నవైనా అవి అతి వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ నదులలో సాహసికులు ప్రత్యేక బట్టలు వేసుకుని తలకు టోపి పెట్టుకొని రబ్బరు బోట్లలో పోటి పడుతుంటారు. కొండ వాలులో బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఇదొక ఆనంద కరమైన దృశ్యం. రోడ్డు ప్రయాణికులకు టీ, కాపి, అల్పాహారం అందించడానికి అక్కడక్కడా చిన్న చిన్న జనవాసాలుంటాయి. అక్కడే సాహసిక క్రీడలైన '''రాప్టింగ్ ''' (నదిలో రబ్బరు బోట్ల పోటీ) '''ట్రెక్కింగ్''' ( తాళ్ల సాయంతో కొండలనెక్కే సాహస క్రీడ) లకు కావలసిన సామాగ్రిని అద్దెకిచ్చే దుకాణాలుంటాయి. ఇటు వంటి నివాస ప్రాంతాలలో కూడా నీటి వసతికి నది అత్యంత లోతులో నున్నందున దానిపై ఆధార పడకుండా కొండలపై నుండి జాలువారెజాలువారే జల దారలకు పైపు తగిలించి వారి అవసరాలకు వాడు కుంటారు. ఈ రోడ్డు పై ప్రయాణించే ప్రయాణికులకు మరొక ఆచ్యర్య పరిచే వినోదం మరొకటి కను విందు చేస్తుంది. అవతిలి కొండ వాలులో పంటలు పండించే రైగులు ఇవతల నుండి నదిని దాటి అటు పక్కకు వెళ్లాలంటే. కొన్ని వందల అడుగుల లోతుకు దిగి అతి వేగంగా ప్రవహించే నదిని దాటి తిరిగి ఆ కొండ నెక్కి తమ పొలాలకు వెళ్ళాలి. ఆ నది చిన్నదే అయినా అతి వేగంగా ప్రవహిస్తుంటుంది. అందులోని రాళ్లు అతి నునుపుగా కాలు జారేటట్టుంటాయి. ఇటు వంటి ప్రమాదాన్నుండి తప్పించు కోడానికి వారు ఒక ఉపాయం కనిపెట్టారు. ఇవతల కొంత దిగువన ఒక బలమైన స్థంబాన్ని పాతి దానికి సమానాంతరంగ నదికి అవతిలి వైపున కూడా ఇలాంటి స్థంబన్ని పాతి ఈ రెండు స్థంబాలను ఒక బలమైన ఇనుప మోకుతో అనుసందానిస్తారు. పైన చక్రాలు కట్టిన ఊయాల లాంటి ఒక పెద్దబుట్టను ఆ ఇనుప మోకుకు తగిలించి ఆ బుట్టలో కూర్చొని తమ చేతులతో ఆ ఇనుప మోకును తమవైపుకు లాగుతూ వుంటే తాము కూర్చున్న ఆ బుట్ట ముందుకు సాగి అవతలి గట్టుకు చేరు కుంటారు. ఇది ఎంతో సాహసంతో కూడిన ప్రమాదకరమైన పనిగా అనిపిస్తుంది. ఇటువంటి సాహసాలు దారి పొడుగునా కనబడుతూనెకనబడుతూనే వుంటాయి. ఒక్కోచోట కేవలం ఒక మనిషే కోతిలాగ ఆ ఇనుప తాడును పట్టుకొని అవతలికి వెళ్లే సందర్భాలు కూడా చూడొచ్చు. ఇలా ఎన్నో ప్రమాద భరితమైన సాహాసాలు చూస్తు ప్రయాణిస్తున్న బస్సు ప్రయాణికులలు కూడా అత్యంత ప్రమాదం పొంచి వుంటుంది. అదేమంటే వర్షాకాలంలో కొండ చెరియలు విరిగితే అవి కచ్చితంగా ఆ రోడ్డు పైనే పడతాయి. వాహనాలపై పడితే ఇక చేయగలిగింది ఏమీలేదు. ఖాళీ రోడ్డుపై పడినా వాటిని తొలిగించేంత వరకు వారి ప్రయాణం వాయిదా పడాల్సిందే.
 
== పోక్రా లో దేవి జలపాతం ==
నేపాల్ లోని ముఖ్యమైన పట్టణాలలో ''పోక్రా'' ఒకటి. ఇది అతి చిన్న పట్టణం. కొండ కోనల్లో కట్టిన ఇళ్లతో అందంగా కనబడు తుంది. ఈ పట్టణానికి ప్రాముఖ్యతను ఆపాదించడానికి మరొక కారణమున్నది. అది పట్టణానికి అల్లంత దూరంలో మంచుతో కప్పబడిని హిమాలయా పర్వతాలు. వెండి కొండలవలెకొండలవలే ప్రకాసిస్తున్న ఆ హిమాలయాలను దగ్గర నుండి చూడ డానికి విమాన ప్రయాణాన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ చిన్న విమానాలలో హిమాలయాలకు కొంత దగ్గరికి వెళ్లి తిరిగి వస్తాయి. ఈ పట్టణాన్ని '''స్విజ్డర్ లాండు'''తో పోలుస్తారు. దీనికి ఆసియాలోని స్విజ్డర్ ల్యాండు అని అంటారు. హిమాలయాల అందాలను చూడ డానికి మంచి సమయం సూర్యోదయానికి కొంత ముందు దాని తర్వాత కొంత సమయం. ఆ సమయానికి పర్యాటకులు తాము బస చేసిన భవనాల పైకెక్కి హిమాలయాల అందాలను తిలకిస్తుంటారు. సూర్యోదయానికి ఇంకా కొన్ని నిముషాలుందనగా ఆకాశం ఎర్ర బడుతుంది. ఆ కాంతిలో ఆ మంచు కొండలు బంగారు కాంతితో మెరిసి పోతుంటాయి. ఆ బంగారు కాంతి పొద్దెక్కే కొద్ది రంగు మారి వెండి కొండ వలే వెలుగు లీనుతుంది. ఆదృశ్యం అత్యంత నయానంద కరం. ఈ పట్టణంలో మరొక వింత '''దేవి జలపాతం'''. సాధారణంగా జలపాతాలను క్రింద నుండి పైకి చూసారు. కాని ఈ జలపాతాన్ని పైనుండి క్రిందికి చూడాలి. అంటే కొండ పైకెక్కి చూడాలని కాదు. భూమి పైనుండే విశాలమైన బావిలోనికి చూడాలి. ఆ బావి చుట్టూ ప్రమాద నివారణ కొరకు ఇనుప పట్టీలతో కంచె ఏర్పాటు చేశారు. దాని అంచున నిలబడి బావి లోనికి చూడాలి. లోపల బావి [[దరి]] లోనుండి అతి పెద్ద జల ప్రవాహం వచ్చి చాల లోతున్న బావిలోనికి పడుతుంది. ఆ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. పర్యాటకులు నిలబడిన భూమి క్రింద సుమారు ఇరవై అడుగుల లోతోలోనుండి వచ్చి బావిలోనికి పడుతుంది. ఈ జలంతో ఆ బావి నిండి పోదు. ఆ వచ్చిన నీరు ఎలా వచ్చాయో అదేవిదంగా భూమి లోపలికి వెళ్లి పోతాయి. అవి ఎక్కడ బయట పడతాయో. ఈ వింత జలపాతం పోక్రా పట్టణం మధ్యలోనెమధ్యలోనే ఉంది. పోక్రాకు దిగువన కొంత మైదాన ప్రాంతమున్నది. అక్కడ వరి పంట పొలాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లంత దూరంలో వున్న మంచు కొండల నుండి మంచు కరిగి వచ్చే నీరెనీరే వీరిపంటలకు సాగునీరు. ఆ నీరు అనేక చిన్న చిన్న కాలువగుండా స్వచ్ఛంగా ప్రవహిస్తుంటుంది.
 
== కాఠ్మండు==
కాఠ్మండు నగరం కొండల మధ్యన మైదాన ప్రాంతంలో ఉంది. ఇది ఈ దేశంలో అతి పెద్ద పట్టణం మరియు దేశ రాధాని కూడ. ఇక్కడ ఇది పెద్ద పట్టణమైనా భారతదేశంలో పట్టణాలతో పోలిస్తే ఇది చిన్నదెచిన్నదే. భహుళ అంతస్తుల భవనాలు, బారీ కట్టడాలు చాల తక్కువ. ఈ దేశంలోని వాహనాలు చాల పాతవి డొక్కువి కూడాను. పాత జీపుల్లాంటి వాహనాలెవాహనాలే ఇక్కడి ప్రయాణ సాధనాలు. కాఠ్మండులో ఒక ఆకర్షన అక్కడి జూద గృహాలు. వీటిని '''కాసినొ''' అంటారు. ఇక్కడ మద్యం సేవిస్తూ, అర్థ నగ్న నృత్యాలను వీక్షిస్తూ జూదం ఆడు తారు. ఈ జూదం ఆడడనికే ఇతర దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరు. సాధారణ పర్యటకులు కూడా వెళుతుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగు సెంటర్లు కూడా ఉన్నాయి. కాని అవి ఎక్కువగా భారత్ లాంటి విదేశాల వర్తకులకు చెందినవే. అన్ని దేశాలకు చెందిన వస్తువులు ఇక్కడ అమ్ముతుంటారు. సామాన్యంగా ఇక్కడ తయారైన వస్తువులు అంటు ఏమి వుండవు. అన్ని విదేశాలవే. స్థానికులకాన్నా పర్యటకులే ఈ వస్తువులను కొంటుంటారు. ఇది కూడా అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి ఆదాయ వనరెవనరే. ఇక్కడ రుద్రాక్ష చెట్లెక్కువ. అందు చేత రుద్రాక్షలు ఎక్కువగా, చాల చవకగా దొరుకుతాయి. కొందరు పర్యాటకులు రుద్రాక్ష కాయలను కిలోల లెక్కన కొంటుంటారు. వాటిని పగల గొట్టి చూస్తే వారి అదృష్టం పండి అందులో ఒకటి రెండు ఏకముఖి రుద్రాక్షలు దొరికాయంటే వారి పంట పండి నట్లే. వాటి ధర ఒక్కోటి కొన్ని వేల రూపాయ లుంటుంది.
 
== మనసులో అనుకొన్న కోరికలు తీర్చే మనోకామన ==
[[దస్త్రం:Infront of manokamani temple at Nepal.JPG|thumb|right|మనోకామని గుడి, నేపల్]]
[[పోక్రా]] నుండి [[ఖాట్మండు కు పోయే దారిలో ఈ [[మనో కామని]] ఆలయం ఒక పెద్ద కొండపై ఉంది. బస్సు రోడ్డు కానుకొని త్రిశూల్ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ నది లోనికి దిగ గలిగినంత లోతులోనెలోతులోనే ఉంది. నదికవతల రెండు మూడు కొండలకవతల ఒక కొండపై మనో కామిని ఆలయం వెలసి ఉంది. అక్కడికి వెళ్లడానికి ''రోప్ వే" ఏర్పాటు ఉంది. ఆ రోప్ కారులో వెళుతుంటే ఆదృశ్యం . క్రింద నది, లోయలు, కొండ వాలులో పంటలు చాల మనోహరంగా వుంటుంది. గతంలో ఈ ఆలయానికి వెళ్ల డానికి మెట్ల దారి వున్నట్లు తెలిపే మెట్ల వరుసలు ఇప్పటి కనబడతాయి. ఈ రో ప్ కారులో మనుషులతో బాటు గొర్రెలు కూడా వెళుతుంటాయి. కొండ కొసన పెద్ద ఆలయం ఉంది. ఇది పగోడ పద్ధతిలో ఉంది. ఈ ఆలయంకొరకు వెలసినదే ఇక్కడున్న చిన్న గ్రామం. ఇక్కడి పూజారులను పండితులు అంటారు. వారు భక్తులను దేవి చుట్టు కూర్చో బెట్టి పూజ చేయిస్తారు. చివరన పూలు ప్రసాదం ఇస్తారు. ఇక్కడి అమ్మవారు భక్తుల మనసు లోని కోరికలు తెలుసుకొని వాటిని నెరవేరుస్తుందని భక్తుల నమ్మిక. ఈ ఆలయ ప్రాంగణంలో పావురాలు ఎక్కువగావున్నాయి. వాటికి గింజలను మేతగా వేస్తారు. ఇది చాల పురాతన ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక జంతు వధ శాల ఉంది. ఇక్కడ తరచు దేవి కొరకు జంతు బలులు ఇస్తుంటారు. ఈప్రాంతం అంతా రక్త సిక్తంగా వుంటుంది. ఆ జంతువులు అనగా గొర్రెలు కూడా రోప్ కార్లలో రావలసిందే. ఇక్కడ చిన్న చిన్న హోటళ్లు ఉన్నాయి. అందులో ప్రతి టేబుల్ ముందు మద్యం బాటిళ్లు పెట్టి వుంటాయి. ఈ కొండ పై నుండి సుదూరంలో మంచుతో కప్పబడిని హిమాలయాలు కనబడు తుంటాయి.
[[దస్త్రం:Rope car at manokamani at Nepal.JPG|thumb|రోప్ కారు]]
 
==ముక్తినాథ ఆలయము==
 
హిందువులు పవిత్రంగా బావించే నూట ఎనిమిది వైష్ణవ దివ్య దామాలలో ముక్తి నాథ ఆలయం 106 వది. పోక్రానుండి ముక్తి నాద్ ఆలయానికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. అంతా గతుకుల బాట. చిన్న చిన్న విమానాలు నడుపుతుంటారు. అవికూడ వాతావరణం సరిగా లేకుంటే నడపరు. వాటిలో వెళ్లినా ఆ తర్వాత కూడా కొంత దూరం కాలి నడకన వెళ్లాల్సిందెవెళ్లాల్సిందే. ఇది చాల కష్టతరమైన దారి ప్రయాసతో కూడు కున్న పని. ముక్తి నారాయణుడు స్వయంబువు. పద్మాసనంలో కూర్చొన్నట్లున్న మూర్తి. ఇక్కడ నూట ఎనిమిది దారలలో నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లను నెత్తిన చల్లు కుంటే నూట ఎనిమిది దివ్యదామాలు దర్శించు కున్నంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక.
 
== సూర్యోదయ వీక్షణ ==
ఖాట్మండుకు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఒక కొండ మీద ఉదయిస్తున్న సూర్యుని చూడడానికి ఒక కేంద్రం ఉంది. సూర్యోదయానికి ముందెముందే అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లెవెళ్లే దారి సన్నగాను మలుపులు తిరిగి వుంటుంది. కనుక పెద్ద వాహనాలు వెళ్లలేవు. చిన్న వాహనాలలో వెళ్లాలి. ఈ కొండ పైనున్న ఒక హోటల్ లో యాత్రీకులకు కావలసిన టీ, కాఫీ పలహారాల వంటి వసతులు చాల బాగబాగా వుంటాయి. కొండ ఎత్తుగ వున్నందున సుధూర ప్రాంతం చక్కగా కనబడు తుంది. సూర్యోదయ సమయానికి మేఘాలు అడ్డు లేకుంటే ఆ సూర్యోదయ దృశ్యం చాల అద్భుతంగా వుంటుంది.
 
== భక్తా పూర్ ==
[[దస్త్రం:In the kings palace in bhaktapur at Nepal.JPG|thumb|right|నేపల్ లో భక్తఫూర్ లో ఒక ఆలయం]]
నేపాల్ దేశంలో భక్థాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరంలో చూడ వలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం ఉన్నాయి. పశుపతి నాద్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడా ఇక్కడ ఉంది. అలాంటి దేవాలయాలు అనేకం వున్నాయి . కాని అన్ని శివాలయాలెశివాలయాలే. రాజ దర్బారు హాలు చాల గంబీరంగ వుంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి ఉంది. ఇది ఆలయం లాగ కాకుండ నివాస గృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్భంలో మాత్రమే తెరుస్తారు. లోన అత్యంత సంపద వున్నట్లు స్థానికులు చెపుతారు. గర్భ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడ వీలున్నది. ఈ ప్రాంతం లోని కట్టడాలు అతి మనోహరంగా ఉన్నాయి.
 
ప్రకృతి పరంగ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అభయారణ్యాలతో అనేక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో ఎంతో ప్రశాంతంగా కనబడే నేపాల్ దేశం రాజకీయంగా అత్యంత వేడి. వాడి చర్యలు చాల ఎక్కువగా జరుగు తుంటాయి. ఇదే ఈ దేశం ఆర్థికంగా ఎదగక పోవడానికి కారణం.
* Dor Bahadur Bista.1996. "People of Nepal". Kathmandu.
* Eva Kipp.1995. "Bending Bamboo Changing Winds". (ISBN 81-7303-037-5)
* Broughton Coburn.1982/1991. "Nepali Ama". (ISBN 0-918373-74-3)
 
{{దక్షిణ ఆసియా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2435696" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ