గిరిజాదేవి: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →బయటి లింకులు: +{{Authority control}} |
|||
పంక్తి 55: | పంక్తి 55: | ||
{{Authority control}} |
{{Authority control}} |
||
{{Authority control}} |
|||
[[ |
[[వర్గం:1929 జననాలు]] |
||
[[ |
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
[[ |
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]] |
||
[[ |
[[వర్గం:సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు]] |
||
⚫ | |||
[[Category:సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు]] |
|||
[[వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు]] |
|||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు]] |
[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు]] |
18:33, 25 ఆగస్టు 2018 నాటి కూర్పు
గిరిజాదేవి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | వారణాశి, బ్రిటీష్ ఇండియా | 1929 మే 8
సంగీత శైలి | హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం |
వాయిద్యాలు | గాత్రం |
క్రియాశీల కాలం | 1949–ప్రస్తుతం |
గిరిజాదేవి (జననం 8 మే 1929) సేనియా మరియు బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. ఈమె లలిత శాస్త్రీయ సంగీతంతో పాటుగా టుమ్రీలను గానం చేస్తుంది.
బాల్యం
గిరిజాదేవి వారణాశిలో ఒక జమీందారీ కుటుంబంలో మే 8, 1929లో జన్మించింది.[1] ఈమె తండ్రి రాందేవ్ రాయ్ హార్మోనియం వాయించేవాడు. అతడే ఈమెకు ప్రథమ సంగీత గురువు. తరువాత ఈమె తన ఐదవ యేట నుండి ప్రముఖ సారంగి విద్వాంసుడు సర్జు ప్రసాద్ మిశ్రా వద్ద ఖయాల్ , టప్పాలు పాడడం నేర్చుకుంది.[2] పిమ్మట శ్రీచంద్ మిశ్రా వద్ద వివిధ రీతుల సంగీతాన్ని అభ్యసించింది. తన తొమ్మిదవ యేట "యాద్ రహే" అనే సినిమాలో నటించింది.[2]
సంగీత ప్రస్థానం
ఈమెకు 1946లో ఒక వ్యాపారస్థునితో వివాహం జరిగింది. ఈమె తొలి సారి ఆకాశవాణి అలహాబాద్ కేంద్రం ద్వారా 1949లో బహిరంగంగా పాడింది. కానీ ఉన్నత తరగతి ప్రజలు ఇలా బహిరంగంగా ప్రదర్శనలు ఇవ్వడం సంప్రదాయం కాదని తన తల్లి, అమ్మమ్మలనుండి వ్యతిరేకత రావడంతో కొంతకాలం ఈమె సంగీతం నాలుగు గోడలకే పరిమితమయ్యింది.[1][2][3] చివరకు 1951లో బీహార్‌లో ఈమె తన తొలి సంగీత ప్రదర్శన చేసింది.[2] ఈమె శ్రీచంద్ మిశ్రా వద్ద అతడు 1960లలో మరణించేవరకు శిష్యరికం చేసింది. 1980లలో కలకత్తాలోని ఐ.టి.సి.సంగీత్ రీసర్చ్ అకాడమీ ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది. 1990 తొలినాళ్లలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత శాఖలో పని చేసి పలువురికి సంగీత పాఠాలు నేర్పి తన సంగీత వారసత్వాన్ని నిలుపుకుంది.[2] ఈమె తరచూ పలుచోట్ల పర్యటిస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చింది.[2][4]
ఈమె బెనారస్ ఘరానా పద్ధతిలో, పూరబీ అంగ్, టుమ్రీ పద్దతులలో పాడి ఆ శాస్త్రీయ పద్ధతులకు ప్రాచుర్యం కల్పించింది.[3][5] ఈమె కచేరిల్లో కజ్రి, చైతీ, హోళీ, ఖయాల్, జానపద గీతాలు, టప్పా మొదలైన పాక్షిక సాంప్రదాయ శాస్త్రీయ పద్ధతులలోని పాటలు ఉంటాయి.[3][6] ఈమె "క్వీన్ ఆఫ్ టుమ్రీ"గా పరిగణించబడింది. ఈమె శిష్యురాలు మమతా భార్గవ అలంకార్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ద్వారా అనేక మందికి సంగీత శిక్షణ ఇస్తున్నది.
అవార్డులు
- పద్మశ్రీ పురస్కారం (1972)
- పద్మభూషణ్ (1989)
- పద్మవిభూషణ్ (2016)[7]
- సంగీత నాటక అకాడమీ అవార్డు (1977)
- సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్(2010)[8]
- మహా సంగీత్ సమ్మాన్ అవార్డు(2012)[9]
- సంగీత్ సమ్మాన్ అవార్డు ( Dover Lane Music Conference)
- గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ(GiMA) అవార్డ్ 2012 (జీవన సాఫల్య పురస్కారం)
- తనరిరి పురస్కార్
మరణం
ఈమె తన 88వ యేట అక్టోబర్ 24, 2017 న కోల్‌కాతాలో గుండెపోటుతో మరణించింది[10].
మూలాలు
- ↑ 1.0 1.1 Ramnarayan, Gowri (11 November 2008). "Queen of thumri". The Hindu. Retrieved 11 April 2009.
{{cite news}}
: Italic or bold markup not allowed in:|publisher=
(help) - ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 Dutta, Amelia (2001). "Devi, Girija". In Sadie, Stanley (ed.). The New Grove dictionary of music and musicians. Vol. 7 (2nd ed.). London: Macmillan Publishers. pp. 265–266. ISBN 0-333-60800-3.
- ↑ 3.0 3.1 3.2 Tandon, Aditi (17 February 2004). "Future of folk music uncertain, warns Girija Devi". The Tribune. Retrieved 11 April 2009.
{{cite news}}
: Italic or bold markup not allowed in:|publisher=
(help) - ↑ Trivedi, Sukumar (5 January 2009). "Pandit Hariprasad Chaurasia works a charm with his magic flute". The Indian Express. Retrieved 11 April 2009.
{{cite news}}
: Italic or bold markup not allowed in:|publisher=
(help) - ↑ Dorian, Frederick; Broughton, Simon; Ellingham, Mark; McConnachie, James; Trillo, Richard; Duane, Orla (2000). World Music: The Rough Guide. Rough Guides. p. 91. ISBN 1-85828-636-0.
- ↑ Kumar, Raj (2003). Essays on Indian music. Discovery Publishing House. ISBN 81-7141-719-1.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 21 July 2015.
{{cite web}}
: Unknown parameter|deadurl=
ignored (help) - ↑ "Padma Awards". Ministry of Communications and Information Technology. Archived from the original on 17 February 2012. Retrieved 11 March 2009.
{{cite web}}
: Unknown parameter|deadurl=
ignored (help) - ↑ "Sangeet Natak Akademi Awards – Hindustani Music – Vocal". Sangeet Natak Akademi. Archived from the original on 1 February 2016. Retrieved 29 December 2009.
{{cite web}}
: Unknown parameter|deadurl=
ignored (help) - ↑ విలేకరి (25 October 2017). "ప్రముఖ గాయని గిరిజాదేవి మృతి". సాక్షి.
{{cite news}}
:|access-date=
requires|url=
(help)
ఇదీ చదవండి
- మిశ్రా, యతీంద్ర (2006). గిరిజ: ఎ జర్నీ త్రూ టుమ్రీ. రూప. ISBN 81-291-0857-7.
బయటి లింకులు
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1929 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- హిందుస్థానీ సంగీత గాయకులు
- పద్మభూషణ పురస్కార గ్రహీతలు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- భారతీయ మహిళా గాయకులు
- పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు
- మహిళా గాయకులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు