పరిమళ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి →‎మూలాలు: +{{Authority control}}
పంక్తి 40: పంక్తి 40:


{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}



{{పాలమూరు జిల్లా కవులు}}
{{పాలమూరు జిల్లా కవులు}}

{{Authority control}}


[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వర్తమాన కవులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వర్తమాన కవులు]]

19:17, 25 ఆగస్టు 2018 నాటి కూర్పు

పరిమళ్
జననంవెంకటయ్య
మహబూబ్ నగర్ జిల్లా,బిజినపల్లి మండలంలోని మంగనూర్ గ్రామం
నివాస ప్రాంతంమహబూబ్ నగర్
ఇతర పేర్లువెంకటయ్య
వృత్తితెలుగు అధ్యాపకుడు
ప్రసిద్ధికవి

పరిమళ్ మహబూబ్ నగర్ జిల్లా బిజినపల్లి మండలంలోని మంగనూర్ గ్రామానికి చెందిన కవి. వెంకటయ్య అను జన్మ నామం కలిగిన ఈ కవి పరిమళ్ పేరుతో కవిత్వం రాస్తున్నాడు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, పత్రిక, ప్రస్థానం, ప్రగతి, సోయి, ప్రజాసంసృతి, అరుణతార వంటి పత్రికలలో, పాలమూరు గోస, గ్లోబల్ ఖడ్గం, మా ఊరు, జనకవనం. గుజరాత్ గాయం, ప్రపంచీకరణ ప్రతిధ్వని వంటి ఆభ్యుదయ సాహిత్య సంకలనాలలో వీరి కవితలు ముద్రించబడ్డాయి. కొన్ని కథలు కూడా రాశారు. విరసం వారు వెలువరించిన 'కథల పంట' లో వీరి కథకు స్థానం దక్కింది. 2005లో 42 కవితలతో మట్టిగంప[1] కవితా సంకలనాన్ని వెలువరించాడు. కొన్ని కవితలు, కొన్ని వ్యాసాలతో కలిపి డెడ్డెనకనక అను పుస్తకాన్ని వెలువరించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో, డా. బి. కేశవులు గారి పర్యవేక్షణలో పాలమూరు జిల్లా వచన కవిత్వం - ఆర్థిక, సామాజిక విశ్లేషణ అను అంశం మీద పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం మాగనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. పాలమూరు స్థితి గతులలో మార్పు కోసం గత కొంత కాలంగా ఉద్యమిస్తున్న పాలమూరు అధ్యయన వేదికలో భాగస్వాములు. ఈ వేదికలోని ఇతర సోదర కవులు ఉదయమిత్ర, ఇక్బాల్ పాష లతో కలిసి దుఃఖాగ్నుల తెలంగాణ[2] అను చిన్న కవితా సంకలనాన్ని వెలువరించాడు.

మూలాలు

  1. మట్టిగంప-పరిమళ్, పాలమూరు ప్రచురణలు-2005
  2. దుఃఖాగ్నుల తెలంగాణ, పాలమూరు ప్రచురణలు, పాలమూరు అధ్యయన వేదిక, మహబూబ్ నగర్-డిసెంబర్,2009.
"https://te.wikipedia.org/w/index.php?title=పరిమళ్&oldid=2443793" నుండి వెలికితీశారు