బిపిన్ చంద్ర పాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎బయటి లంకెలు: +{{Authority control}}
పంక్తి 20: పంక్తి 20:


{{భారత స్వాతంత్ర్యోద్యమం}}
{{భారత స్వాతంత్ర్యోద్యమం}}

{{Authority control}}


[[వర్గం:1858 జననాలు]]
[[వర్గం:1858 జననాలు]]

19:38, 25 ఆగస్టు 2018 నాటి కూర్పు

Bipin-Chandra-Pal
బిపిన్ చంద్ర పాల్
నవంబరు 7, 1858మే 20, 1932
జన్మస్థలం: హబీజ్‌గంజ్ జిల్లా, (నేటి బంగ్లాదేశ్ లో భాగం)
ఉద్యమం: భారత స్వాతంత్ర్యోద్యమము
ప్రధాన సంస్థలు: భారత జాతీయ కాంగ్రెసు, బ్రహ్మ సమాజం

బిపిన్ చంద్ర పాల్ (నవంబరు 7, 1858మే 20, 1932) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు లాల్ బాల్ పాల్ త్రయంలో మూడవ వాడు. 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడాడు. జాతీయోద్యమ పత్రిక బందే మాతరంను మొదలు పెట్టాడు. ఆ పత్రికలో అరబిందో వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను చేసాడు. ఆ పై గాంధీ సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. బ్రహ్మ సమాజంలో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు.

బిపిన్‌ చంద్రపాల్‌ : 07-11-1858వ సంవత్సరంలో నాటి బెంగాల్‌లోని (నేటి బంగ్లాదేశ్‌) సిల్హట్‌లో జన్మించారు. బ్రహ్మసమాజంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసకుడిగా పేరొందారు. వందేమాతరం ఉద్యమ వ్యాప్తిలో భాగంగా రాజమండ్రిలో ఈయన ప్రసంగించిన ప్రాంతాన్ని ‘పాల్‌ చౌక్‌’ అని పిలుస్తున్నారు. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఈయన ఉపన్యాసాల ప్రభావంతోనే ఏర్పాటు చేయబడిందట. ట్రిబ్యూన్‌, న్యూ ఇండియా, వందేమాతరం మొదలైన పత్రికల్లో ఈయన రచనలు ఎన్నో ప్రచురింపబడినాయి. గాంధీజీతో విభేదించిన కారణంగా ఈయనకు తగిన గుర్తింపు రాలేదంటారు. ఆనాటి రాజకీయాల్లో ప్రధాన పాత్రధారులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ అనే నాయక త్రయాన్ని ‘లాల్‌, బాల్‌, పాల్‌’ అని సగౌరవంగా పిలిచేవారు.

మూలాలు

బయటి లంకెలు